Chandrababu: ఇఫ్తార్ విందులో ఇచ్చిన హామీని గంటల వ్యవధిలోనే నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు.

0
204

ఏపీ సీఎం చంద్రబాబు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇమామ్‌లు, మౌజన్‌లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. నిన్న‌ విజయవాడలో జరిగిన ఇఫ్తార్ విందులో ప్రకటించిన విధంగా వారి గౌరవ వేతనం బకాయిల కోసం రూ.45 కోట్లను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే నిధులు విడుదల కావడం విశేషం. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 10,000 మంది ఇమామ్‌లు, మౌజన్‌ల ఖాతాల్లోకి గత ఆరు నెలల బకాయిలను నేరుగా జమ చేయనున్నారు.

 

ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇమామ్‌లకు నెలకు రూ.10,000, మౌజన్‌లకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన రూ.45 కోట్లు.. 2025 అక్టోబరు నుంచి 2026 మార్చి వరకు ఆరు నెలల కాలానికి సంబంధించినవి. రాష్ట్రంలోని 5,000 మసీదులలో సేవలందిస్తున్న వారికి ఈ బకాయిలను ఒకేసారి క్లియర్ చేశారు. తమ ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

 

ఇఫ్తార్ విందులో మాట్లాడిన సీఎం, ముస్లిం మైనారిటీల అభివృద్ధికి పలు హామీలు ఇచ్చారు. అమరావతిలో కొత్తగా హజ్‌ హౌస్‌ నిర్మాణం చేపడతామని ప్రకటించారు. అలాగే, కడపలో అసంపూర్తిగా ఉన్న హజ్‌ హౌస్‌ను త్వరలోనే పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 21 నెలల్లో ముస్లింల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని గుర్తుచేశారు. ఇప్పటివరకు ఇమామ్‌లు, మౌజన్లకు గౌరవ వేతనం కింద రూ.180 కోట్లు అందించామని వివరించారు.

 

రాష్ట్రంలో అర్హులైన ఇమామ్‌లను ప్రభుత్వ ఖాజీలుగా నియమించడంతో పాటు వివాహ లైసెన్స్‌ గడువును 3 సంవత్సరాల నుంచి 10 ఏళ్లకు పెంచామని చంద్రబాబు తెలిపారు. సుమారు 1,500 వక్ఫ్‌ ఆస్తులను సర్వే చేసి వాటిని కాపాడుతున్నామని చెప్పారు. ముస్లింలను ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి పథంలో నడిపించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.

Search
Categories
Read More
Uttarkhand
Uttarakhand Leads with Uniform Civil Code Implementation
Uttarakhand has emerged as a frontrunner in legal reforms through the implementation of the...
By Fathima Safa 2026-06-16 11:57:14 0 200
SURAKSHA
Nithya Radhakrishnan, IPS: Leading with Courage & Duty
A dedicated IPS officer of the AGMUT Cadre, Nithya Radhakrishnan has built a reputation for...
By Lokeshwari Panthadi 2026-07-22 06:56:18 0 338
Andhra Pradesh
సి. టి. ఎం. వద్ద ఘోర ప్రమాదం.. బొలెరో బోల్తా పడి ఇద్దరు మృతి.
మదనపల్లె మండలం సి.టి.ఎం. కంకర ఫ్యాక్టరీ వద్ద గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు...
By Pagadala Venkateswar 2026-04-09 14:52:21 0 144
Andhra Pradesh
RTC Buses: సంక్రాంతి వేళ రాష్ట్ర ప్రజలకు బిగ్ షాక్.. ఆర్టీసీ బస్సులు బంద్..! కష్టాలు తప్పవ్..
సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు షాక్ తగిలింది. ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మెకు...
By Pagadala Venkateswar 2026-01-13 06:03:48 0 266
Telangana
ఎండల ప్రభావం వల్ల తగ్గిన ...గృహజ్యోతి లబ్ధిదారుడు!
WGL: ఎండల ప్రభావం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు భారత్ అవాజ్ న్యూస్:5 జూన్ రోజున విద్యుత్ CMD...
By Gujile Ramu 2026-06-05 06:28:57 0 203
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com