ప్రజా సమస్యలపై జోనల్ కమిషనర్‌ను కలిసిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|

0
174

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న పలు అత్యవసర పౌర సమస్యలపై మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి జోనల్ కమిషనర్ సంచిత్‌ను కలిసి చర్చించారు. 

ఈ సందర్భంగా కాలనీలలో పెరుగుతున్న దోమల సమస్యపై ఆమె ప్రత్యేకంగా దృష్టి సారించారు.

 

పలు కాలనీల్లో దోమల సమస్య తీవ్రంగా పెరుగుతోందని, దీనిని నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. 

ముఖ్యంగా ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహించడం, పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేయడం, నిల్వ నీటిని తొలగించడం వంటి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

అదే విధంగా చీకటి ప్రాంతాల్లో ప్రజల భద్రత దృష్ట్యా కొత్త వీధి దీపాలు మరియు వాటికి అవసరమైన పోల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.

భీమ్‌రావ్ నగర్, వాసవి నగర్ ప్రాంతాల్లో ఉన్న పార్కులను రక్షించేందుకు చైన్ లింక్ మెష్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. 

దీంతో పార్కుల సంరక్షణ మెరుగుపడటంతో పాటు ప్రజా ఆస్తి రక్షణకు ఉపయోగపడుతుందని తెలిపారు.

అవసరాల దృష్ట్యా కొత్త అంతర్గత రహదారులు మంజూరు చేయాలని, అలాగే ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరుతూ జోనల్ కమిషనర్‌కు అధికారిక వినతి పత్రాన్ని కూడా సమర్పించారు.

ఈ అంశాలపై జోనల్ కమిషనర్ సంచిత్ సానుకూలంగా స్పందిస్తూ, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
మల్కాజ్ గిరి డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు
   మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / మల్కాజ్ గిరి.   మల్కాజ్ గిరి కార్పొరేటర్...
By Sidhu Maroju 2025-07-23 16:39:39 0 1K
Andhra Pradesh
Chandrababu Naidu: పనిచేసే వారికి పట్టం.. మారకుంటే నమస్కారం.. కుప్పం నుంచి చంద్రబాబు స్ట్రాంగ్ మెసేజ్!
Chandrababu Naidu: పనిచేసే వారికి పట్టం.. మారకుంటే నమస్కారం.. కుప్పం నుంచి చంద్రబాబు స్ట్రాంగ్...
By Pagadala Venkateswar 2026-02-01 10:55:04 0 215
Andhra Pradesh
ఇద్దరి మృతికి కారణమైన డ్రైవర్‌కు మూడేళ్ల జైలు శిక్ష.
మదనపల్లెలో 2018లో జరిగిన ట్రాక్టర్ బోల్తా ఘటనలో ఇద్దరు కూలీల మృతికి కారణమైన ట్రాక్టర్...
By Pagadala Venkateswar 2026-04-25 04:41:08 0 135
Andhra Pradesh
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండలంలో దోర్నాల ఈనెల 25వ తేదీన ముఖ్య మంత్రి పర్యటన
మార్కాపూర్ జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలంలో దోర్నాలఈనెల 25వ తేదీన ముఖ్యమంత్రి...
By Chennaiah Kati 2026-02-18 13:20:36 0 318
Telangana
రాజపేట మండలం ఎమ్మార్వోగా జి రవి కిరణ్ కుమార్
పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల ఎమ్మార్వోగా మంగళవారం బాధ్యతలు...
By Pindikura Mahesh 2026-06-23 17:45:40 0 251
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com