‎ ‎ ‎‎*BRS పార్టీ పోరాట ఫలితమే *నేడు రుద్రంగి గ్రామానికి* *ఎల్లంపల్లి నీళ్లు*

0
332

గత కొద్ది రోజులుగా రుద్రంగి గ్రామంలో నీళ్లు లేక రైతుల పంట పొలాలు ఎండిపోవడం జరిగింది.మరికొద్ది మంది రైతులు పొట్ట దశలో ఉన్న పంటను కాపాడుకోవడానికి ట్యాంకార్లతో నీళ్లు కొనుక్కొని తెచ్చుకొని పంటలను కాపాడుకున్న సందర్భం మనం చూసినం,రైతులు ఆరుగలం కష్టం చేసి పంట చేతికి వచ్చే సమయంలో ఎండిపోతే ఆ రైతు బాధ అంత ఇంత కాదు,అదే విధంగా చెరువుల నీళ్లు లేక గంగపుత్రుల జీవనదారం అయిన చేపలు కూడా చనిపోయి వారి ఉపాధి పోయి వాళ్ళ బ్రతుకులు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.

‎అందుకే వారి పక్షాన రైతుల పక్షపాతి BRS పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది, ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలు రుద్రంగి గ్రామానికి ఫిబ్రవరి లోనే నీళ్లు వస్తాయని, గత ప్రభుత్వం ధర్నాలు, రాస్తారోకలు చేస్తే తప్ప రైతులకు నీళ్లు ఇవ్వలేదు, మేము అలా కాదు అవి ఏవి చేయకముందే నీళ్లు ఇస్తామని గౌరవ ఎమ్మెల్యే గారు మన గ్రామానికి వచ్చిన చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది కానీ నీళ్లు మాత్రం ఇవ్వలేదు.ఎండిన పంటలు పశువుల పాలయ్యాయి, ఈ ప్రభుత్వం ఆరు గ్యారంటీలా పేరుతొ రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా, ఎరువులు సమయానికి ఇవ్వకుండా, కూలి రైతులకు12 వేలు ఇవ్వకుండా వడ్లకు బోనస్ ఇవ్వకుండా,కౌలు రైతులను,రైతులను ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం,ఇప్పుడు 2 రెండు సంవత్సరాలు గడిచిన మాయమాటలతో కాలయాపన చేస్తుంది, మీ హామీలన్నీ అమలు అయ్యేంతవరకు  BRS పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తాము, మా BRS పార్టీ ప్రభుత్వ హయాంలోనే కెసిఆర్ గారి నాయకత్వంలో ఎత్తిపోతల పతకం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఎల్లంపల్లి నీళ్లను కాలువల ద్వారా, మోటార్ పంపుల ద్వారా రుద్రంగి గ్రామానికి కాళేశ్వరం ఎల్లంపల్లి నీళ్లను తెచ్చి రుద్రంగి బీడు భూములను తడిపి పచ్చని పంటపోలలుగా మార్చిన ఘనత BRS పార్టీ గౌరవ కెసిఆర్ గారికే దక్కుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యమానేరు ప్రాజెక్టు కు 2004 లో శంకుస్థాపన చేసి తట్టేడు మట్టి కూడా తియ్యలేదు....

‎ముమ్మాటికీ BRS పార్టీ కృషి పోరాట ఫలితమే-నేడు రుద్రంగికి కాళేశ్వరం ఎల్లంపల్లి నీళ్లు రావడం జరిగింది..

‎ఈ నీళ్లు ఎన్ని రోజులు ఇస్తారో చూడాలి??

Search
Categories
Read More
Andhra Pradesh
వైభవంగా ప్రారంభమైన శ్రీమన్నారాయణ మహా యజ్ఞ కార్యక్రమాలు
వైభవంగా ప్రారంభమైన శ్రీమన్నారాయణుడి మహా యజ్ఞ కార్యక్రమాలు    అభినవ మేల్కోటగా...
By Rajini Kumari 2026-04-19 12:42:19 0 157
Telangana
"ఈటల చేతుల మీదుగా మోదీ సభ పోస్టర్ల ఆవిష్కరణ.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ చేతుల మీదుగా మే...
By Sidhu Maroju 2026-05-06 06:47:28 0 424
Chandigarh
Chandigarh Teachers Win Justice After 10-Year Wait: Tribunal Orders Regularisation
Chandigarh Teachers Win Justice After 10-Year Wait: Tribunal Orders Regularisation In a major...
By BMA ADMIN 2025-05-21 05:48:27 0 2K
Andhra Pradesh
టీడీపీ కార్యాలయంలో “మహిళా గ్రీవెన్స్” కార్యక్రమాన్ని నిర్వహించిన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే.
గుంటూరు పశ్చిమలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు తమ వ్యక్తిగత, కుటుంబ,...
By John Baji 2026-01-06 12:35:52 0 237
Telangana
తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు
తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు హైదరాబాద్‌: తెలంగాణలో పలు ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం...
By Bharat Aawaz 2025-09-27 16:36:08 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com