అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కొండయ్య*

0
585

తెలుగు ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు, ప్రత్యేక రాష్ట్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా, చీరాల పట్టణం నందు కామధేను కాంప్లెక్స్ దగ్గర ఆయన విగ్రహానికి శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే ఏకైక ధృఢ నిశ్చయంతో పొట్టి శ్రీరాములు సుదీర్ఘ పోరాటం చేశారని కొనియాడారు. "పొట్టి శ్రీరాములు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చేసిన త్యాగం మనందరిలో దేశభక్తిని, నిస్వార్థ సేవను నింపాలని,ఆయన కేవలం ఆంధ్ర రాష్ట్రం కోసం మాత్రమే పోరాడలేదని,దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు తన ఆత్మార్పణతోనే నాంది పలికారన్నారు. భారతదేశ చరిత్రలోనే ఒక భాషా సమూహం కోసం ప్రాణత్యాగం చేసిన మొట్టమొదటి వ్యక్తిని శ్రీరాములు దీక్ష మరియు త్యాగ ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి, తెలుగు మాట్లాడే ప్రజల కోసం మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఈ చారిత్రక ఘట్టం దేశంలోని ఇతర భాషా సమూహాలకూ స్ఫూర్తినిచ్చి, భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్విభజనకు దారి తీసిందని ఆయన పేర్కొన్నారు. తెలుగు భాష, సంస్కృతి, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి వారి ఆశయాలకు అనుగుణంగా,మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అల్లూరి వర్ధంతిని ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసులు.
మదనపల్లిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని...
By Pagadala Venkateswar 2026-05-08 05:17:04 0 148
Andhra Pradesh
హంద్రీ-నీవా కాలువ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం.
మదనపల్లి మండలం వలసపల్లి రెవెన్యూ పరిధిలో శుక్రవారం అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతదేహం...
By Pagadala Venkateswar 2026-02-28 07:20:33 0 196
SURAKSHA
Harish Kumar Gupta IPS | Commitment To Serve Nation With Pride
Harish Kumar Gupta IPS: The Steadfast Guardian Leading Andhra Pradesh Police with Integrity and...
By Kalaga Sailaja 2026-07-13 05:42:48 0 290
Andhra Pradesh
వెదురు సాగు పెంచేందుకు కార్యాచరణ ప్రణాళిక: కలెక్టర్
బేంబూ మిషన్లో భాగంగా జిల్లాలో వెదురు సాగును విస్తరించేందుకు వారం రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక...
By Boiena Rajesh 2026-08-13 06:38:06 0 102
Andhra Pradesh
హలో లోకేష్ పేరుతో విద్యార్థులతో మంత్రి లోకేష్ ముఖాముఖి
*రాజమహేంద్రవరం : ‘హలో లోకేష్’ పేరుతో విద్యార్థులతో మంత్రి నారా లోకేష్ ముఖాముఖి.*...
By Rajini Kumari 2025-12-20 09:40:43 0 219
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com