శ్రీ దర్పన్ స్కూల్ దశాబ్ది వేడుకలు: ముఖ్య అతిథిగా శాంతి శ్రీనివాస్ రెడ్డి.|

0
212

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డివిజన్ వేణుగోపాల్ నగర్‌లోని శ్రీ దర్పన్ స్కూల్ 10వ వార్షికోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి.

పాఠశాల డైరెక్టర్ అంతం శ్రీధర్ రెడ్డి, ప్రిన్సిపల్ అంతం సునీతా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా అల్వాల్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. 

జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె, విద్యార్థుల ప్రతిభను అభినందించారు.

ఈ సందర్భంగా శాంతి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నేటి పోటీ ప్రపంచంలో చిన్నారులకు కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా, ఆటపాటలు, ఇతర సృజనాత్మక యాక్టివిటీస్ ఎంతో అవసరమని పేర్కొన్నారు. పిల్లల సర్వతోముఖాభివృద్ధికి చదువుతో పాటు కళలు కూడా దోహదపడతాయని తెలిపారు.

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో తల్లిదండ్రులు తమ ఉద్యోగ వ్యాపారాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, పిల్లల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించాలని ఆమె సూచించారు. అప్పుడే పిల్లల్లో మానసిక వికాసం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని ఆమె స్పష్టం చేశారు.

వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య రూపకాలు ఆహూతులను మంత్రముగ్ధులను చేశాయి. రంగురంగుల దుస్తుల్లో చిన్నారులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మాజీ కార్పొరేటర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. 

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం... మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు.
పిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం...
By Pagadala Venkateswar 2026-04-10 06:06:50 0 149
Telangana
ఫోన్ కొట్టేసి... ఖాతా ఖాళి .!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో మొబైల్ దొంగలు రెచ్చిపోతున్నారు....
By Sidhu Maroju 2026-03-28 14:01:45 0 190
Telangana
75 సంవత్సరాల డైమండ్ జూబ్లి వేడుకలు
కౌకుంట్ల మండలం లోనీ పేరూరు గ్రామంలో ఉన్నటువంటి ZPHS HIGH SCHOOL  నేటికీ 75 సంవత్సరాలు పూర్తి...
By Dodla Nagaraju 2026-04-19 13:07:52 0 408
Puducherry
Puducherry Boost: JIPMER Cancer Centre & University Upgrades
Puducherry is undergoing significant infrastructure revitalization with major development...
By Lokeshwari Panthadi 2026-06-29 04:54:55 0 155
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com