పోలీసునని నమ్మించి కారు కజేసిన యువకుడు

0
131

BHARAT AAWAZ న్యూస్ 

పోలీసునని నమ్మించి కారు కాజేసిన యువకుడు 

కళ్యాణదుర్గం, తాను పోలీసు శాఖలో ఎస్‌.ఐ.నని నమ్మించి అద్దెకు తీసుకున్న కారును తిరిగి ఇవ్వకుండా మోసం చేసిన యువకుడిని కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం చల్లాపల్లి గ్రామానికి చెందిన గంటప్పగారి అనిల్‌కుమార్‌ (27)ను సోమవారం బోరంపల్లి గ్రామ బస్‌స్టాప్‌ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల కథనం మేరకు.. జస్ట్‌డయల్‌ యాప్‌ ద్వారా కారు యజమాని జి.మనోహర్‌ను సంప్రదించిన అనిల్‌కుమార్‌, తాను పోలీసు శాఖలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌నని చెప్పి నమ్మించాడు. వాట్సాప్‌ ద్వారా పోలీసు యూనిఫాం ధరించిన ఫొటోలను పంపి విశ్వాసం కలిగించాడు. అనంతరం మారుతి సుజుకి డిజైర్‌ కారు (ఏపీ 39 ఎన్‌టీ 8616)ను రోజువారీ అద్దెకు తీసుకుని తిరిగి ఇవ్వకుండా వివిధ ప్రాంతాల్లో వినియోగించినట్లు దర్యాప్తులో తేలింది.

విచారణలో అనంతపురం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనూ ఇదే తరహాలో మరికొందరిని మోసం చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. అతని వద్ద నుంచి కారుతో పాటు మోసానికి ఉపయోగించిన పోలీసు యూనిఫాంను స్వాధీనం చేసుకున్నారు.

ఎస్‌డీపీవో పి. రవిబాబు ఆదేశాల మేరకు సీఐ పి. గణేష్‌ ఆధ్వర్యంలో కేసును వేగంగా దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా దర్యాప్తులో పాల్గొన్న పోలీసు సిబ్బందిని ఎస్‌డీపీవో అభినందించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఫెయిల్ అయినా నిరాశ చెందొద్దు: ఎస్పీ ధీరజ్ సూచనలు.
రాష్ట్రవ్యాప్తంగా గురువారం పదో తరగతి ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్...
By Pagadala Venkateswar 2026-04-30 04:10:13 0 122
Telangana
Ban the hostel businesses in Hyderabad
Govt has to take serious action on banning of the Hostel Businesses in Hyderabad. Residential...
By Terli Ashok 2026-02-14 12:00:18 0 858
Andhra Pradesh
ఏపీలో ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలు.
Andhra Summer heatwave and rains happens in Andhra Pradesh ఏపీలో ఎండలు, వర్షాలతో విభిన్న...
By Pagadala Venkateswar 2026-04-30 04:52:50 0 134
Telangana
"సర్వస్వం కోల్పోయిన బిఆర్ఎస్ నాయకురాలు: తక్షణ సాయంతో అండగా అనిల్ కిశోర్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  కనజిగూడ డివిజన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది....
By Sidhu Maroju 2026-05-21 06:51:17 0 279
Andhra Pradesh
చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్‌కు జన్మదిన శుభాకాంక్షలు
చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచికి జన్మదిన శుభాకాంక్షలు  చీరాల: చీరాల నియోజకవర్గం  మాజీ...
By Gadiyapudi Narendra 2025-12-28 16:18:25 0 295
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com