వందమంది మహిళలకు డ్వాక్రా సంఘాలకు కుట్టు మిషన్లు అందజేసిన గద్దె రామ్మోహన్

0
143

*మహిళా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఆలోచనలు*

*డ్వాక్రాసంఘాలు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిదే*

*100 మంది మహిళలకు కుట్టుమిషన్లు అందచేసిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్, గద్దె అనురాధ, తానా ట్రెజరర్‌ కె.రాజా*

+++++

 

   ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ఆలోచనలు అన్ని మహిళా సంక్షేమంపైనే ఉన్నాయని విజయవాడ పార్లమెంట్‌ సభ్యులు కేశినేని శివనాద్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్, టీడీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ చెప్పారు. 

 

     శుక్రవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఎన్‌ఏసీ కళ్యాణ మండపంలో తానా ట్రెజరర్‌ కసుకుర్తి రాజా ఆర్థిక సహాయంతో ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ ఆధ్వర్యంలో 100 మంది మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్, తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ హజరై మహిళలకు కుట్టు మిషన్లను అందచేశారు. 

 

   ఎంపీ కేశినేని శివనాథ్‌ మాట్లాడుతూ తాము గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతిపక్షపార్టీ మాదిరిగానే నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి కష్ట సుఖాలను కూటమి పార్టీ ప్రజాప్రతినిధులు తెల్సుకుంటూనే ఉన్నామన్నారు. పార్టీ నాయకులు ఎల్లప్పుడు ప్రజల మధ్యనే ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిత్యం చెబుతుంటారన్నారు. గతంలో రాజా ఆధ్వర్యంలో వ్యవసాయ కిట్‌లను కూడా పంపిణీ చేశామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపునకు రాజా స్పందించి తాను సంపాదించిన దాంట్లో నుంచి పేదలకు ఉపయోకరంగా ఉండే కుట్టుమిషన్లు అందచేయడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ తన సొంత నిధులతో నియోజకవర్గంలోని పేద మహిళలకు ఎన్నో కుట్టుమిషన్లును అందచేశారని చెప్పారు. మహిళా సంక్షేమం కోసమే నారా చంద్రబాబునాయుడు నిత్యం ఆలోచనలు చేస్తుంటారన్నారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల మార్కెటింగ్‌ కోసం స్వయం అనే ప్రత్యేక పోర్టల్‌ను మహిళల కోసం ప్రభుత్వం రూపొందించిందని, మహిళలు ఈ పోర్టల్‌ను ఉపయోగించుకుని వారు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని చెప్పారు.  

 

 ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ ఇక్కడ చదువుకుని అమెరికాలో స్ధిరపడిన వారు ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేలా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కరోనా సమయంలో చాలా మందికి ఆక్సిజన్‌ సిలెండర్లను సైతం రాజా ఆధ్వర్యంలో అందచేశారని చెప్పారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఈ కుట్టుమిషన్లు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో అనేక విద్వంసాలు జరిగాయన్నారు. జగన్‌ పాలనలో సరఫరా చేసిన కల్తీ మద్యం వల్ల లక్షలాది మంది మరణించారన్నారు. ఆ కల్తీ మద్యం వల్ల నేటికి చాలా మంది అనారోగ్యానికి గురయ్యారని చెప్పారు. జగన్‌ ఐద సంవత్సరాల పాలనలో యువతకు ఉద్యోగాలు లేకుండా చేశారన్నారు. జగన్‌ చేసిన విధ్వంసం నుంచి బయటపడానికి రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారన్నారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. పీ–4 కార్యక్రమం ద్వారా పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రజల కష్టాలు, సుఖాల్లో కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ప్రతి శుక్రవారం ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజా సమస్యలను తెల్సుకుని పరిష్కరిస్తున్నామన్నారు. పురుషులకు తోడుగా ఇంట్లోనే ఉంటూ మహిళలు ఆదాయం పొందాలంటే కుట్టుమిషన్‌ ఒక్కటే మార్గమేనని అన్నారు. డ్వాక్రా అనే పదం పలికే ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేరు తలచుకోవాలని చెప్పారు. ఆయన ఏర్పాటు చేసిన డ్వాక్రా సంఘాలే ఇప్పుడు బ్యాంకులను నడిపిస్తున్నాయన్నారు. నారా చంద్రబాబునాయుడు మహిళలపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర అభివృద్థికి సహాకరిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్రమోడికి ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. 2014–19 సంవత్సరాల టీడీపీ హాయంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మహిళలకు టైలరింగ్‌లో ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టుమిషన్లు కూడా అందచేశామని, ఇప్పుడు ఆ శిక్షణా కేంద్రాలను ప్రారంభించేలా చూస్తానని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. 

 

తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ రాజా ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తూ తాను పుట్టిన స్థలంలోని ప్రజలకు ఉపయోగపడే పనులను చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. మహిళలకు సహాయం చేస్తే ఆ కుటుంబం మొత్తానికి సహాయం చేసినట్లేనని చెప్పారు. తల్లి ఎల్లప్పుడు బాధ్యతగా ఉంటూ, కుటుంబాన్ని పోషిస్తోందన్నారు. ఇప్పుడు రాజా ఆధ్వర్యంలో వంద కుట్టుమిషన్లు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. లక్షల రూపాయాల్లో బ్యాంకుల నుంచి డ్వాక్రా సంఘాల సభ్యులు రుణాలు తీసుకుంటున్నారంటే అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ఘనతేనని అన్నారు. 

 

తానా ట్రెజరర్‌ కసుమర్తి రాజా మాట్లాడుతూ తెలుగు ప్రజల సేవే లక్ష్యంగా తానా పనిచేస్తుందన్నారు. ఇప్పుడు సహాయం పొందిన వారు మరోకరికి సహాయం చేయాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంలో రైతులకు ఉపయోగపడే యంత్ర పరికరాలను అందచేయడంతో పాటుగా వైద్య శిబిరాలను తానా ఆధ్వర్యంలో గతంలో నిర్వహించామన్నారు. తానా సభ్యులందరి సహాకారంతోనే ఈ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నానని చెప్పారు. 

 

    ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గద్దె క్రాంతికుమార్, చెన్నుపాటి గాంధీ, రత్నం రమేష్, ముమ్మనేని ప్రసాద్, దయాల శీరీషా గాంధీ, చెన్నుపాటి ఉషారాణి, మైలుమూరి పీరుబాబు, సొంగా సంజయ్‌ వర్మ, నందిపాటి దేవానంద్, కొర్ర అప్పన్న, దాసరి గాబ్రియేల్‌ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: బోయకొండ గంగమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యేలు
శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని దిగువపల్లి శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారిని...
By Kothuru Murali 2026-04-04 06:13:48 0 156
Andhra Pradesh
పుంగనూరు: శని త్రయోదశి కి అన్ని ఏర్పాటు పూర్తి: మంజునాథ్
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణ పరిధిలోని 50 రాళ్ల మొరవలో వెలసి ఉన్న శనేశ్వర స్వామి ఆలయంలో ఈనెల...
By Kothuru Murali 2026-05-15 15:36:39 0 87
Uttarkhand
Uttarakhand Boosts Industrial Investment and MSMEs
Uttarakhand continues to promote industrial investment and MSME development in 2026 by...
By Fathima Safa 2026-07-04 12:04:51 0 31
Telangana
కురవి ఎన్నికల ప్రచారసభలో డోర్నకల్ మాజీఎమ్మెల్యే మాజీ మంత్రి డిఎస్ రెడ్యానాయక్..*
*రాజునాయక్ పశువుల వ్యాపారం చేయడం తప్పా, సంతలో బ్రోకర్ (మధ్యవర్తిత్వం) చేయడం తప్పా...!!* ...
By CM_ Krishna 2025-12-16 01:18:24 0 282
Telangana
అల్వాల్ ల్లో మైనర్ బాలికపై అత్యాచార కేసు- నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాఘార శిక్ష.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై జరిగిన అమానుష ఘటనలో...
By Sidhu Maroju 2026-03-11 13:28:15 0 184
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com