Justice Lisa Gill: ఏపీ హైకోర్టు జడ్జిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణస్వీకారం.

0
233

 

 

 

Justice Lisa Gill: ఏపీ హైకోర్టు జడ్జిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణస్వీకారం

13-03-2026 Fri 12:30 | Andhra

Justice Lisa Gill Sworn in as AP High Court Judge

 

లిసా గిల్ తో ప్రమాణస్వీకారం చేయించిన చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ లిసా

న్యాయరంగంలో జస్టిస్ లిసాకు అపారమైన అనుభవం

ఆంధ్రప్రదేశ్ న్యాయరంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ లిసా గిల్‌ ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలో జరిగిన ఈ వేడుకలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్ ఠాకుర్ ఆమెతో ప్రమాణం చేయించారు. జస్టిస్ లిసా గిల్ నియామకం రాష్ట్ర న్యాయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవబోతోంది.

 

 

ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ఈ ఏడాది ఏప్రిల్ 24వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తర్వాత జస్టిస్ లిసా గిల్ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలోనే తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. న్యాయరంగంలో ఆమెకు ఉన్న అపారమైన అనుభవం, అందించిన సేవలను గుర్తించి ఉన్నత న్యాయస్థానం ఈ కీలక బాధ్యతలను ఆమెకు అప్పగించినట్లు తెలుస్తోంది.

 

 

Search
Categories
Read More
Telangana
మహబూబాబాద్ ఇద్దరుMPDOలు... ఒక MRO....!
మహబూబాబాద్: ఇద్దరు MPDOలు.. ఒక MRO..! భారత్ అవాజ్ న్యూస్: 12 జూన్ రోజున...
By Gujile Ramu 2026-06-12 10:06:07 0 210
Andhra Pradesh
విజయనగరంలో వృద్ధురాలిపై అత్యాచారం
విజయనగరంలో బుధవారం జరిగిన దారుణ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై వెళ్తున్న 82 ఏళ్ల...
By Boiena Rajesh 2026-08-27 14:27:40 0 109
Jammu & Kashmir
Jammu & Kashmir Tourism Growth Driving Economic Progress
Jammu & Kashmir's tourism sector has experienced remarkable growth in 2026, contributing...
By Fathima Safa 2026-06-16 09:04:23 0 98
Andhra Pradesh
ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సౌర వెలుగులతో నింపడానికి కూటమి ప్రభుత్వం కృషి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాయచోటి నియోజకవర్గం లో తొలి దశలో 20074 ఎస్సీ ఎస్టీ గృహాలకు సోలార్ గ్రూప్ టాప్ యూనిట్లు మంజూరు...
By Benguluri Madhubabu 2026-04-11 06:16:02 0 194
Andhra Pradesh
గుడిసెవారిపల్లెలో బైక్ దగ్ధం : ఉద్రిక్తత.
మదనపల్లె మండలం గుడిసివారి పల్లెలో ఆదివారం రెండు వర్గాల మధ్య వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది....
By Pagadala Venkateswar 2026-04-13 05:42:03 0 178
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com