చీరాలలో భారీ మెగా జాబ్ మేళా * 1,400 ఉద్యోగ ఖాళీలతో నిరుద్యోగులకు సువర్ణావకాశం * పోస్టర్ లాంచ్ చేసిన ఎమ్మెల్యే మాలకొండయ్య

0
1K

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ప్రత్యేక సహకారంతో చీరాల పట్టణంలో భారీ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ నెల 17 మార్చి 2026 మంగళవారం నాడు స్థానిక ఎన్ఆర్పియం హైస్కూల్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుందని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారిణి యం. మాధవి తెలిపారు.

21 ప్రముఖ కంపెనీల ఈ మెగా జాబ్ మేళాలో ఫ్లెక్స్ టెక్ సొల్యూషన్స్, ఇన్నోవా సోర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, మాస్టర్ మైండ్స్, క్యాపస్టన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, బిగ్ సి, ఎయిర్టెల్, గోదావరి ఆంధ్ర కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, హీరో మోటర్స్, హేటిరో డ్రగ్స్ వంటి సుమారు 21 ప్రముఖ బహుళజాతి కంపెనీలు పాల్గొంటున్నాయి. మొత్తం 1,400కు పైగా ఖాళీలు ఉన్నాయని, అభ్యర్థుల విద్యార్హతను బట్టి నెలకు రూ. 10,000 నుండి రూ. 20,000 వరకు వేతనం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. అర్హతలు కావలసిన పత్రాలు విద్యార్హత ఎస్.ఎస్.సి, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, డిప్లొమా, బి.టెక్, ఎం.బి.ఏ,పి.జి పూర్తి చేసిన వారు అర్హులు అని తెలిపారు. జాబ్ మేళాలో పాల్గొని వారు కనీసవయస్సు 18 నుండి 35 సంవత్సరాల లోపు నిరుద్యోగ యువతీ యువకులు హాజరుకావచ్చు తెలిపారు. అభ్యర్థులు తమ బయోడేటా , విద్యా సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డు నకలు మరియు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలని తెలిపారు . ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొరకు ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా వెబ్ పోర్టల్ నందు తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 9988853335 లేదా ఈ క్రింది మొబైల్ నంబర్లను సంప్రదించవచ్చు అని 

7981443777, 8555901198, 9100566581, 9949914337.చీరాల ప్రాంతంలోని అర్హులైన నిరుద్యోగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉపాధి పొందాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ కోరింది.

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీ రామస్వామి ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
ఈరోజు ఉదయం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి మండలం పిఎన్ కాలనీ గ్రామం మిన్నం రెడ్డి...
By Benguluri Madhubabu 2026-03-15 08:13:03 0 239
Andhra Pradesh
పదవ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు ఆర్యవైశ్య సంఘం సన్మానం
పుంగనూరు జిల్లా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 34 మంది...
By Kothuru Murali 2026-06-16 13:45:08 0 109
Tamilnadu
Tamil Nadu Strengthens Coastal Security and Conservation
Tamil Nadu is enhancing coastal security and marine conservation through coordinated efforts...
By Fathima Safa 2026-06-29 10:22:55 0 201
Telangana
"నా కూతురి మీద వస్తున్న దుష్ప్రచారాలను ఆపించండి" అని బాధితురాలి తల్లి నన్ను వేడుకుంది
"నా కూతురి మీద వస్తున్న దుష్ప్రచారాలను ఆపించండి" అని బాధితురాలి తల్లి నన్ను వేడుకుంది ...
By Ponnala Srinivasrao 2026-05-15 02:51:54 0 152
Lakshdweep
Tourism Development and Sustainable Growth in Lakshadweep
Tourism development in Lakshadweep has focused on promoting the islands as a unique eco-tourism...
By Fathima Safa 2026-06-18 09:04:11 0 209
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com