ఆకస్మికంగా తనిఖీ చేసిన :: జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్

0
401

మహబూబాబాద్::::పట్టణంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్, ఆకస్మికంగా తనిఖీ చేశారు, ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతిప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మార్చ్ 6 నుండి జూన్ 12 వరకు షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది, అందులో భాగంగా గత రెండు మూడు రోజుల నుండి జిల్లా స్థాయి ప్రత్యేక అధికారులు అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాలలో ఫైళ్ల క్లియరెన్స్, సానిటేషన్, కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది, జిల్లా కలెక్టర్ తమ పర్యటనలో భాగంగా మున్సిపల్ కార్యాలయ పరిసరాలను పరిశీలించి ఫైళ్లను వెంటనే క్లియరెన్స్ చేయాలని, అనవసరమైన స్క్రాప్ ను వెంటనే ఖండం చేయాలని, సూచించారు, సుమారు గంటన్నరకు పైగా కార్యాలయంలో ఆమె తనిఖీలు నిర్వహించి స్వయంగా ఫైళ్లను పరిశీలించారు, వివిధ పనుల దరఖాస్తుల నిమిత్తం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల యొక్క వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని, వారి సమస్యలను సావధానంగా పరిశీలించి వారికి తగిన విధంగా పరిష్కారం చూపాలని తెలిపారు, మున్సిపల్ పరిధిలో అంతర్గత ఫైళ్ల క్లియరెన్స్, అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని, నగర పరిధిలో ఉన్నటువంటి కాలనీలలో విద్యుత్, త్రాగునీరు సరఫరా లో ఎలాంటి అంతరాయాలు లేకుండా చూడాలని, సానిటేషన్ షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని, ఆదేశించారు, జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన మండలాలు, ప్రాంతాలలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోతు జ్యోతి, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, తహసిల్దార్ రాజేశ్వరరావు, సంబంధిత అధికారులు ఉన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Nara Lokesh: రేపు నారా లోకేశ్ పుట్టినరోజు... సీడీపీ విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ.
జనవరి 23న మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయన బర్త్ డే సీడీపీని పంచుకున్న టీడీపీ...
By Pagadala Venkateswar 2026-01-22 14:34:59 0 340
SURAKSHA
Telangana Retired Officers: Building Safer Communities Now
Retirement తీసుకున్న Telangana Police officers ఇప్పుడు safer communities కట్టే పనిలో ఉన్నారు....
By Kalaga Sailaja 2026-07-03 11:19:57 0 123
Andhra Pradesh
పుంగనూరు వ్యవసాయ మార్కెట్లో అగ్నిప్రమాదం
పుంగనూరు వ్యవసాయ మార్కెట్లో మంగళవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. మార్కెట్ ఆవరణలో...
By Kothuru Murali 2026-07-08 09:50:48 0 145
Andhra Pradesh
Amaravathi city
  అమ‌రావ‌తికి మ‌రో 'గుర్తింపు'!   ఏపీ రాజ‌ధాని...
By G k Nookala 2026-04-05 13:43:14 0 242
Andhra Pradesh
రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన అంజుమన్ ఆస్తులు.
రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన వక్ఫ్ భూముల ప్రభుత్వ వివిధ రూపాల్లో స్వాధినమ్ చేసుకునే ప్రక్రియకు...
By John Baji 2025-12-27 11:41:33 0 211
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com