మంత్రి సంకల్పం -హరిత నెల్లూరు వైపు అడుగులు - టిడిపి నాయకులు

0
556

ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని హరితాంధ్రగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా  నెల్లూరు సిటీ నియోజక వర్గంలో అడుగులు పడ్డాయి .నియోజక వర్గంలోని 28 డివిజన్ లలో 50 వేల మొక్కలు నాటి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సంకల్పించారు .మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను డివిజన్ బాధ్యులకు అప్పజెప్పారు .అందులో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం ఓ యజ్ఞంలా సాగుతోంది .తమకిచ్చిన లక్ష్యాన్ని నిర్ణీత సమయంలో ఛేదించేందుకు టీడీపీ నేతలు పోటీలు పడి మొక్కలు నాటుతున్నారు .అందులో భాగంగానే 15 వ డివిజన్ లో మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు .డివిజన్ ఇంచార్జ్ కెపి చౌదరి,డివిజన్ నేత దశరధ రామయ్య లు మాట్లాడుతూ 
నెల్లూరును ఒక మోడల్ గ్రీన్  సిటీగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రతీ ఐదు మీటర్లకు ఒక చెట్టు  నాటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం , పచ్చదనంతో నిండిన పర్యావరణం  ప్రజలకు  ఇవ్వాలనే మంచి ఆలోచనతో మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సిటీలో ఉండే 28 డివిజన్లో  చెట్లు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు  .
అందులో భాగంగా ఈరోజు 15 డివిజన్లో మొదలుపెట్టామని  వారంలో పూర్తి చేస్తామన్నారు . 
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ ,యూనిట్ ఇన్ చార్జీలు ,డివిజన్ కన్వీనర్లు, డివిజన్ నాయకులు,స్థానిక ప్రజలు పాల్గొన్నారు .

Search
Categories
Read More
Andhra Pradesh
ఇంటింటికి వెళ్లి పన్నులు వసూలు చేయాలి
ఇంటింటికి వెళ్లి ఇంటి పన్నులు వసూలు చేయాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలంలోని...
By Boiena Rajesh 2026-03-03 12:56:23 0 254
BMA
Media Crisis: Economic Decline Sparks Widespread Layoffs
The journalism industry is facing an unprecedented economic crisis, marked by persistent...
By JoinBMA 2026-08-19 10:04:02 0 68
Telangana
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లో ప్రాథమిక పాఠశాలలో సీఎం రేవంత్ రెడ్డి టిఫిన్స్ ప్రారంభోత్సవంలో...
    వెంకటాపురం ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వ అల్పాహార పథకం ప్రారంభం* భారత్ అవాజ్...
By Gujile Ramu 2026-06-15 09:49:55 0 220
Telangana
బేగంపేట విమానాశ్రయం నుంచి కొడంగల్ నియోజకవర్గం కోస్గి కి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న సీఎం.
బేగంపేట విమానాశ్రయం నుంచి కొడంగల్ నియోజకవర్గం కోస్గి కి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు....
By Vanmoj Suryamohan 2025-12-24 09:57:50 0 463
Andhra Pradesh
Visakhapatnam Steel Plant: నష్టాల నుంచి లాభాల బాట పట్టిన విశాఖ స్టీల్ ప్లాంట్... సీఎం చంద్రబాబు స్పందన.
రికార్డు స్థాయిలో 94 శాతానికి చేరిన ఉత్పత్తి సామర్థ్యం   రూ.54 కోట్ల లాభం సాధించిన...
By Pagadala Venkateswar 2026-02-04 07:59:50 0 190
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com