పిల్లల ఎదుగుదలలో పోషకాహారం కీలకం – డాక్టర్ ఉమాకాంత్ సూచనలు

0
421

రాజమండ్రి: చిన్నపిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలలో సరైన ఆహారపు అలవాట్లు ఎంతో కీలకమని రాజమండ్రిలోని శ్రీ హర్షిత గ్యాస్ట్రో హాస్పిటల్‌కు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ ఉమాకాంత్ తెలిపారు. పిల్లలకు ఆరో నెల నుండి పోషకాహారం ప్రారంభించడం ఉత్తమమని ఆయన సూచించారు.

మన పూర్వీకులు పాటించిన అన్నప్రాశన సంప్రదాయం ప్రకారం ఆరో నెల నుంచి పిల్లలకు ఆహారం పెట్టడం శ్రేయస్కరమని తెలిపారు. ఈ దశలో సెర్లాక్ వంటి ఆహార పదార్థాలను కూడా ఇవ్వవచ్చని పేర్కొన్నారు. పిల్లలకు ఇచ్చే ఆహారాన్ని బాగా ఉడికించి మెత్తగా చేసి అందించాలి అని చెప్పారు.

ఎనిమిది నెలల వయస్సు నుండి వివిధ రకాల పండ్లు, కూరగాయలను బాగా ఉడికించి ఆహారంలో చేర్చాలని సూచించారు. పిల్లల జీర్ణశక్తి పెరిగే కొద్దీ కొత్త రకాల ఆహార పదార్థాలను క్రమంగా ఆహారంలో భాగం చేయాలని అన్నారు.

పిల్లలకు వారి ఆకలి మేరకు మాత్రమే ఆహారం ఇవ్వాలని, తల్లిదండ్రులు బలవంతంగా ఎక్కువగా తినిపిస్తే వాంతులు వంటి సమస్యలు తలెత్తే అవకాశముందని డాక్టర్ ఉమాకాంత్ హెచ్చరించారు.

అలాగే పిల్లల ఎత్తు పెరగడం ప్రధానంగా పోషకాహారం మరియు వంశపారంపర్య లక్షణాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. తల్లిదండ్రులు పొట్టిగా ఉన్నప్పటికీ తాతముత్తాతల లక్షణాల ప్రభావంతో కొందరు పిల్లలు ఎత్తుగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఆరోగ్యకరమైన ఎదుగుదలకు సమతుల్యమైన పోషకాహారం తప్పనిసరిగా అవసరమని ఆయన వివరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రెవిన్యూ అధికారుల అవినీతి – కలెక్టరేట్ వద్ద బాధితుల ధర్నా.
జరాపల్లి గ్రామంలోని భూమి విషయంలో రెవిన్యూ అధికారుల అవినీతి కారణంగా తాము నష్టపోతున్నామని...
By Pagadala Venkateswar 2026-02-02 07:25:32 0 176
Andhra Pradesh
బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ కె.వెంకటరమణ గుండెపోటుతో మృతి పోలీస్ లాంఛనాలతో దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ
బాపట్ల: బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కె. వెంకటరమణ మృతి పట్ల జిల్లా...
By Gadiyapudi Narendra 2026-02-05 16:17:47 0 224
Andhra Pradesh
హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్: డీఎస్పీ పావని.
మదనపల్లె మండలం కొత్తఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్ (45) హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు...
By Pagadala Venkateswar 2026-04-20 03:24:20 0 133
SURAKSHA
Neelam Meena IAS: Safeguarding Democracy with Integrity
A distinguished 1998-batch IAS officer of the West Bengal cadre, Shri Neelam Meena serves as the...
By Lokeshwari Panthadi 2026-07-28 05:12:32 0 173
SURAKSHA
Vaibhav Galriya IAS: Transforming Rajasthan Finance
A 1998-batch Rajasthan cadre IAS officer, Vaibhav Galriya has earned a reputation as one of the...
By Lokeshwari Panthadi 2026-08-01 05:45:20 0 117
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com