తాడేపల్లిలో ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

0
1K

తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సంఘ సంస్కర్త, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, మహిళా విద్యాభివృద్ధికి సావిత్రిబాయి పూలే చేసిన సేవలు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని అన్నారు. సమాజంలో మహిళలకు విద్య అందించేందుకు ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.

సమాజంలో మహిళల విద్యా విస్తరణ కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషి ఎంతో గొప్పదని, అనేక అడ్డంకులను ఎదుర్కొంటూ మహిళా సాధికారతకు ఆమె మార్గం సుగమం చేశారని తెలిపారు. మహిళలు విద్య ద్వారా అభివృద్ధి సాధించాలనే ఆమె ఆశయాన్ని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పలువురు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
కేటీఆర్ కారుకు తృటిలో ప్రమాదం.. లారీ ఢీ.|
● అలుగునూర్ వద్ద ఘటన.. కేటీఆర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు ● కారు వెనుక డోర్‌ను ఢీకొట్టిన...
By Sidhu Maroju 2026-09-05 19:23:16 0 128
Telangana
కేంద్ర సాహిత్య అకాడమీఅవార్డు -2025' ప్రముఖ తెలంగాణ కవి, రచయిత,నందిని సిధారెడ్డి గారిని అభినందిస్తూకేసీఆర్ గారు శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా అందించే, అత్యున్నత సాహిత్య పురస్కారం 'కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు...
By Ponnala Srinivasrao 2026-03-17 01:12:01 0 296
Andhra Pradesh
ప్లాష్.. ప్లాష్ .. టాటా -ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో మంటలు ఏసి బోగీ లు రెండు పూర్తి గా దగ్దం ఒక్కరు మృతి.
అనకాపల్లెలో ఎక్స్ప్రెస్ రైలు లో  అగ్ని 🔥 🔥 ప్రమాదం జరిగింది.ఆదివారం అర్ద రాత్రి 1:30 గంటలు...
By Karapati Gopi 2025-12-29 03:10:53 0 359
Andhra Pradesh
A P in tirupathi royal Enfield project
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి సమీపంలో ఏర్పాటు చేయనున్న రాయల్ ఎన్ ఫీల్డ్ ప్రాజెక్టును 18 నెలల్లో...
By G k Nookala 2026-05-18 17:24:46 0 239
Telangana
మైనంపల్లి సహకారంతో అభివృద్ధి దిశగా మచ్చ బొల్లారం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : వార్డు నెంబర్ 133 మచ్చ బొల్లారం డివిజన్ పరిధిలోని ప్రధాన రహదారుల...
By Sidhu Maroju 2026-02-01 10:34:19 0 209
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com