ట్రంప్ దురాక్రమాలను ప్రపంచ దేశాలు నిలువరించాలి

0
218

విజయవాడ

9 - 03 - 2026

 

 ట్రంప్ దురాక్రమాలను ప్రపంచ దేశాలు నిలువరించాలి 

         - మాజీ శాసనసభ్యులు యం.ఎ. గఫూర్ 

 

 అమెరికా ప్రపంచ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ చమురు నిలవలున్న దేశాలను ఆక్రమించుకుని ప్రపంచ పోలీస్ గా వ్యవహరిస్తూ ఇరాన్, వెనిజుల లాంటి దేశాలపై చేస్తున్న దుర్మార్గపు దాడులను ప్రపంచ ప్రజలు ఐక్యంగా నిరసించి,నిలువరించాలని మాజీ శాసనసభ్యులు యం.ఏ.గఫూర్ పిలుపునిచ్చారు. ఈనెల 9వ తేదీన విజయవాడలోని దాసరి భవన్ లో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ట్రంప్ విధ్వంసం - మానవాళికి ప్రమాదం అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. మాజీ శాసనసభ్యులు యం.ఎ. గఫూర్ ప్రసంగిస్తూ ప్రపంచంలో అత్యధిక అప్పులు గల దేశంగా ఉంటున్న అమెరికా ఆర్థిక సంక్షోభాన్ని అధికమించడానికి అపారమైన చమురు నిల్వలున్న వెనుజుల, ఇరాన్ లాంటి సార్వభౌమ అధికారం గల దేశాలపై దాడులు చేస్తుందన్నారు. ఇరాన్ యుద్ధం ఫలితంగా చమురు, గ్యాస్ ధరలు పెరిగి ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. గల్ఫ్ దేశాలలో ఉన్న కోటి మంది భారతీయుల ఉనికి ప్రమాదంలో పడిందని, గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు తొలగిస్తేనే శాంతియుత వాతావరణం ఏర్పడుతుందన్నారు. విశ్వ గురువుగా ప్రకటించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గాజ, వెనిజుల, ఇరాన్ లపై అమెరికా, ఇజ్రాయిల్ ల దాడులను ఖండించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారన్నారు.లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ ప్రసంగిస్తూ విదేశాలతో సుహృద్భావ వాతావరణం కొనసాగించాలని, సఖ్యతను పెంపొందించుకోవాలని భారత రాజ్యాంగం ఆర్టికల్ 51 పేర్కొంటే నేటి కేంద్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అమెరికా, ఇజ్రాయిల్ లకు కొమ్ము కాస్తుందన్నారు. గతంలో నాటి భారత ప్రధానులు అలీనఉద్యమానికి నాయకత్వం వహిస్తు చిన్నచిన్న దేశాలకు అండగా నిలిచారని, నేటి ప్రధాని నరేంద్ర మోడీ అనైతికత యుద్ధాలకు పాల్పడుతున్న దేశాలకు మద్దతు ఇవ్వడం శోచనీ యమన్నారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ అధికారం చేపట్టగానే 7 యుద్ధాలను ఆపానని, ప్రపంచశాంతి నోబెల్ బహుమతి తనకు ఇవ్వాలని పదేపదే కోరుతున్న ట్రంప్ అందుకు విరుద్ధంగా అనేక యుద్దాలకు శ్రీకారం చుట్టి మానవ వినాశకుడిగా మారారన్నారు. వెనిజులా చమరుపై ఆధిపత్యం పొందాలనే దురాశతో సార్వభౌమాధికారం గల వెనిజుల పై దండెత్తి ఆ దేశ అధ్యక్షుడిని గద్దలా ఎత్తుకు వెళ్లి అమెరికా జైలులో నిర్బంధించారన్నారు. అలాంటి ప్రయత్నంలో భాగంగా అన్వాయిదాలు రూపొందిస్తున్నారనే నెపంతో ఆ దేశ అధ్యక్షుడు అయతుల్లా సయ్యద్ అలీ హుస్సేన్ ఖమేని తో పాటు 50 మంది ముఖ్య నేతలను ఇజ్రాయిల్ తో కలిసి హతమార్చారని తెలిపారు. డోనాల్డ్ ట్రంప్ ఏడాది పాలన లోనే కెనడాను 51 వ రాష్ట్రంగా చేయాలని, క్యూబా ను అమెరికాలో కలుపుకోవాలని ఖనిజ సంపద గల గ్రీన్ ల్యాండ్ ను ఆక్రమించుకోవాలని, పనామా కాలువను స్వాధీన పరుచుకోవాలని భావిస్తునారన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి ప్రసంగిస్తూ డాలర్ వ్యవస్థను బలోపేతం చేయాలనే కుటిల బుద్ధితో నేడు అమెరికా అవలంబిస్తున్న దుర్మార్గ విధానాలపై ప్రజాస్వామ్య వాదులందరూ గళం ఎత్తాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ ప్రసంగిస్తూ అమెరికా సామ్రాజ్యవాద దృక్పథంతో చిన్నచిన్న దేశాలపై 400 సార్లు దాడులు చేసిందని, 40 దేశాలలో 800 సైనిక స్థావరాలను ఏర్పరచుకుని ప్రపంచ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుందన్నారు. సోషలిస్ట్ కూటమినాడు వలసవాదాన్ని అంతమొందిస్తే నేడు అమెరికా నయా వలస వాదంతో సార్వభౌమాధికారం గల చిన్న దేశాలపై దాడులు చేస్తూ వారి సహజ వనరులను దోచుకుంటుందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ప్రసంగిస్తూ స్పెయిన్, డెన్మార్క్ లాంటి చిన్నచిన్న దేశాలు అమెరికా యుద్దోన్మాదాన్ని వ్యతిరేకిస్తుందంటే ప్రపంచంలో అత్యధిక జనాభా గల భారత దేశం ఎందుకు మౌనం పాటిస్తుందని ప్రశ్నించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో విశ్రాంత అడిషనల్ డైరెక్టర్, పరిశ్రమల శాఖ ఎ.వి.పటేల్ శాసనమండలి మాజీ సభ్యులు జల్లి విల్సన్, జన చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. ధనుంజయ రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ శాంతిని కోరుతూ ప్రజానాట్యమండలి నేతలు పిచ్చయ్య, చంద్ర నాయక్ లు ఆలపించిన అభ్యుదయ గీతాలు ప్రజలను ఆలోచింప చేసాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు...
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు జిల్లాలో మహిళల భద్రత,...
By Gadiyapudi Narendra 2026-01-10 12:03:32 0 649
SURAKSHA
Chekka Priyanka IAS: Championing Good Governance
A Dedicated Telangana IAS Officer Strengthening District Administration Through Transparent...
By Lokeshwari Panthadi 2026-07-14 10:22:45 0 318
Andhra Pradesh
Chandrababu: పర్యాటకానికి ఏపీ అన్‌లాక్: సీఎం చంద్రబాబు.
పర్యాటక ప్రాజెక్టుల కోసం ఏపీని అన్‌లాక్ చేశామన్న సీఎం చంద్రబాబు ఆతిథ్య రంగంలో పెట్టుబడులపై...
By Pagadala Venkateswar 2026-01-22 06:13:45 0 202
Telangana
పెంటయ్య గౌడ్ గారి మేనకోడలు వివాహానికి హాజరైన
ఈ రోజు సాగర్ రింగ్ రోడ్డు బిఎం ఆర్ కన్వెన్షన్ హాల్ లో పెంటయ్య గౌడ్ గారి మేనకోడలు వివాహానికి...
By Pindikura Mahesh 2026-05-01 09:55:06 0 291
Andhra Pradesh
చీరాల బెస్తపాలెం సాయిబాబా గుడి వద్ద ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు —
చీరాల  చీరాలలోని బెస్తపాలెం శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం వద్ద గురుపౌర్ణమి వేడుకలు, ఆలయ 25వ...
By Vadlamudi NagaVenkat 2026-07-29 10:35:19 0 210
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com