AP Teachers: ఏపీ టీచర్లకు డబుల్ గుడ్ న్యూస్.. కేసుల ఎత్తివేతతో పాటు హాజరులో మినహాయింపు.

0
184

 

AP Teachers: ఏపీ టీచర్లకు డబుల్ గుడ్ న్యూస్.. కేసుల ఎత్తివేతతో పాటు హాజరులో మినహాయింపు

10-03-2026 Tue 08:06 | Andhra

 

AP Teachers Get Double Good News Cases Withdrawal Attendance Exemption

సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడి కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం నిర్ణయం

2022లో సీపీఎస్ రద్దు కోరుతూ నిరసన తెలిపిన 73 మంది ఉపాధ్యాయులకు ఊరట

అంధ ఉపాధ్యాయులకు ఫేస్ రికగ్నిషన్ హాజరు నుంచి మినహాయింపు

ప్రధానోపాధ్యాయులు లీప్ యాప్‌లో వీరి హాజరు నమోదు చేయాలని ఆదేశం

ఏపీలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రెండు శుభవార్తలు అందించింది. గత ప్రభుత్వ హయాంలో వారిపై నమోదైన కేసులను ఎత్తివేయడంతో పాటు, అంధ ఉపాధ్యాయులకు హాజరు నిబంధనల్లో కీలక మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు హోం శాఖ, పాఠశాల విద్యాశాఖ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఉపాధ్యాయ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

 

వివరాల్లోకి వెళితే.. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యూటీఎఫ్) ఆధ్వర్యంలో 2022 ఏప్రిల్ 25న ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద సమావేశమైన ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకు అనుమతి లేదన్న కారణంతో విజయవాడ గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్‌లో మొత్తం 73 మంది ఉపాధ్యాయులపై కేసు నమోదు చేశారు. తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ కేసును ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. కోర్టులో కేసు ఉపసంహరణకు పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రెండేళ్లుగా ఆందోళనలో ఉన్న ఉపాధ్యాయులకు భారీ ఊరట లభించినట్లయింది.

 

అంధ ఉపాధ్యాయుల‌కు ప్రభుత్వం మరో ఊరట

ఇదే సమయంలో అంధ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ప్రభుత్వం మరో ఊరట కల్పించింది. పాఠశాలల్లో అమలు చేస్తున్న ముఖ ఆధారిత హాజరు (ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్) విధానం నుంచి వారికి మినహాయింపు ఇస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలోని దృష్టిలోపం గల ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరును "లీప్" (LEAP) యాప్‌లో నేరుగా నమోదు చేయాలని ఆదేశించారు. ఈ రెండు నిర్ణయాలు ఉపాధ్యాయుల పట్ల కొత్త ప్రభుత్వ సానుకూల వైఖరిని సూచిస్తున్నాయని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి

Search
Categories
Read More
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ అమరావతిని రాజధానిగా ఖరారు
అందరికీ నమస్కారం.   ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో చట్టబద్ధత...
By Rajini Kumari 2026-04-02 16:02:40 0 197
Andhra Pradesh
మదనపల్లె: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లె మండలంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పసినికొండ జన్మభూమి కాలనీకి చెందిన చంద్ర...
By Pagadala Venkateswar 2026-05-10 05:49:08 0 141
Andhra Pradesh
ఎమ్మిగనూరులో బివి నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో
ఎమ్మిగనూరు కోఆపరేటివ్ స్టోర్స్ ఆధ్వర్యంలో దుకాణాల నిర్మాణానికి భూమి పూజలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ...
By Boya Dasthagiri 2026-04-22 09:50:56 0 186
Andhra Pradesh
మదనపల్లె: బొలెరో ఢీకొని తాతా–మనవరాల కు గాయాలు.
శుక్రవారం సత్యసాయి జిల్లా కొక్కంటి క్రాస్ బాలసముద్రానికి చెందిన వీరప్ప (60) తన మనవరాలు హిమశ్రీ...
By Pagadala Venkateswar 2026-03-28 04:16:07 0 228
Telangana
నిజామాబాద్: వైన్స్ షాపులకు దేవులా పెర్లు పెటకుండ చట్టం తెవాలి ఎమ్మెల్యే ధనపాల్సూర్యనారాయణ
వైన్‌షపులకు దేవుల పెర్లు తోలాగిన్‌చెలా, కొత్తగపేటకుండ చాటముటిసుకురవాలాని.ఎమ్మెల్యే...
By Sadaq Sadaq 2026-03-30 17:35:48 0 212
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com