కౌకూరు లో నిన్నంటిన మహిళ దినోత్సవం సంబరాలు.|

0
228

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్వాల్ సర్కిల్ పరిధిలోని కౌకూర్ శిలాయం ఆలయ ప్రాంగణంలో మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. 

స్థానిక నాయకులు లక్ష్మణ్ యాదవ్ (బండారి లావణ్య లక్ష్మణ్ యాదవ్) మరియు వారి బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి.. మాట్లాడుతూ, సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, వారు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. 

మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి.. మాట్లాడుతూ, ప్రతి మహిళా తన శక్తిని గుర్తించి అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. 

అనంతరం వేడుకల్లో భాగంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన మహిళలను మరియు ఆశా వర్కర్లను అతిథులు శాలువాలతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. నిర్వాహకులు లక్ష్మణ్ యాదవ్ బృందం మహిళలకు చీరల పంపిణీ చేశారు. 

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక మహిళలు పాల్గొన్నారు. 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
గంజాయి నీయంత్రణ మాదక ద్రవ్యల నిర్ములనకై తనిఖీలు : Si ప్రశాంత్
మంచిర్యాల : గంజాయి,మాదక ద్రవ్యాల నియంత్రణ మరియు ప్రజల్లో అవగాహన పెంపు లక్ష్యంగా రామగుండం పోలీస్...
By Avunoori Mahesh 2026-05-21 11:36:16 0 187
Telangana
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా: కూన శ్రీశైలం గౌడ్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా/ కుత్బుల్లాపూర్.   కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్, మాజీ...
By Sidhu Maroju 2025-08-05 08:41:36 0 849
Andhra Pradesh
గుడివాడలో మెడికల్ షాపు మాఫియా
🔴 గుడివాడలో మెడికల్ షాప్ మాఫియా    గుడివాడలో మెడికల్ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట లేదు......
By Rajini Kumari 2026-04-10 06:29:53 0 178
SURAKSHA
Combating Cyber Fraud: Lakshadweep’s 1930 Helpline Guide
n era of rising digital threats, the Lakshadweep Police are taking proactive steps to protect...
By Lokeshwari Panthadi 2026-07-03 07:55:20 0 247
Andhra Pradesh
Chandrababu Naidu: నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ.
Chandrababu Naidu: నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ 04-02-2026 Wed 10:05 | Andhra...
By Pagadala Venkateswar 2026-02-04 07:45:35 0 205
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com