మల్కాజిగిరిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు: 321 మందిపై కేసులు. |

0
231

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : వారాంతంలో మందుబాబుల ఆటకట్టించేందుకు మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో భారీ సంఖ్యలో వాహనదారులు పట్టుబడ్డారు.

వీకెండ్ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 321 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడినట్లు పోలీసులు వెల్లడించారు.

పట్టుబడిన వారిలో అత్యధికంగా 249 మంది ద్విచక్ర వాహనదారులు ఉండగా, 59 మంది ఫోర్ వీలర్ డ్రైవర్లు, 11 మంది ఆటో డ్రైవర్లు, ఇద్దరు భారీ వాహన చోదకులు ఉన్నారు. వీరి రక్తంలోని ఆల్కహాల్ శాతం (BAC) ఆధారంగా పోలీసులు కేసులను వర్గీకరించారు. ఇందులో 11 మందికి 300 mg కంటే ఎక్కువ ఆల్కహాల్ శాతం నమోదవ్వడం గమనార్హం. పట్టుబడిన వారందరినీ త్వరలోనే కోర్టులో హాజరుపరచనున్నారు.

మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైతే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని మల్కాజిగిరి డీసీపీ స్పష్టం చేశారు. తాగి వాహనం నడిపి ఎవరి మరణానికైనా కారణమైతే, వారిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 105 కింద 'హత్య కానే నేరపూరిత నరహత్య' కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సెక్షన్ కింద నిందితులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు.

గత వారం (మార్చి 1 నుంచి మార్చి 7 వరకు) నమోదైన కేసుల్లో 228 మందికి కోర్టు శిక్షలు ఖరారు చేసింది. వారిలో ఐదుగురికి జైలు శిక్షతో పాటు జరిమానా, 10 మందికి సామాజిక సేవ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. మిగిలిన 213 మందికి భారీగా జరిమానా విధించింది. రహదారి భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని పోలీసులు కోరారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
60 మందికి బోటు మత్స్యకారులకు బోటు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే
*అరవై మంది మత్స్యకారులకు బోట్ రిజిస్ట్రేషన్ పత్రాలు అందించిన ఎమ్మెల్యే*   నాగాయలంక మండలం...
By Rajini Kumari 2026-04-10 12:03:29 0 181
BMA
Investigative Games: Hunting Illegal Trawlers Online
Gamification is taking investigative journalism to broader audiences in a highly accessible way....
By JoinBMA 2026-08-21 18:51:30 0 372
Telangana
NZB: ఎసి బాలూర కళాశాల హాస్టల్ (బి)వార్డెన్ సస్పెండ్
నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని నమ్దేవాడ అ ఏసి కళాశాల  బలూరా హాస్పిటల్ (బీ). వార్డెన్ యo...
By Sadaq Sadaq 2026-02-09 10:14:41 0 242
Telangana
డంప్ యార్డ్ తరలించాలి: ఈటల.|
"నిరసనకారుల అరెస్టులు సరికావని విమర్శ.. వెంటనే విడుదల చేయాలని డిమాండ్" మేడ్చల్...
By Sidhu Maroju 2026-07-11 09:49:22 0 170
Andaman & Nikobar Islands
A&N Administration launches Online Services on National Single Window System to enhance ‘Ease of Doing Business’
 A&N Administration has made thirty essential Government services available exclusively...
By Bharat Aawaz 2025-06-25 11:51:15 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com