"సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన చిలకలగూడ పోలీసులు.|

0
293

హైదరాబాద్ : నగరాన్ని సైబర్ నేరాల నుంచి రక్షించేందుకు “జాగృతి హైదరాబాద్ – సురక్షిత హైదరాబాద్” కార్యక్రమంలో భాగంగా చిలకలగూడ పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్ట మైసమ్మ గుడి వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలకు సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్‌కు వెంటనే స్పందించవద్దని సూచించారు. 

అలాగే తెలియని వ్యక్తులు పంపే APK ఫైల్స్‌ను ఓపెన్ చేయరాదని, వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం, OTPలను ఎవరికీ చెప్పకూడదని హెచ్చరించారు.

బ్యాంకు అధికారులు లేదా పోలీసులమని నమ్మబలికి మోసగాళ్లు ప్రజలను మభ్యపెట్టి డబ్బులు దోచుకుంటున్నారని తెలిపారు. ఎవరైనా నిర్ధారణ లేకుండా గుర్తుతెలియని వ్యక్తులకు డబ్బులు పంపరాదని స్పష్టం చేశారు.

సైబర్ మోసానికి గురైన వెంటనే ‘గోల్డెన్ అవర్’లో 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేస్తే, జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి డబ్బులను ఫ్రీజ్ చేసి, కోర్టు ప్రక్రియ ద్వారా బాధితులకు తిరిగి అందించే అవకాశం ఉంటుందని పోలీసులు వివరించారు.

ఈ కార్యక్రమంలో చిలుకలగూడ ఏసీపీ కే. శశాంక్ రెడ్డి, ఎస్ఐ రాకేష్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
వ్యక్తిఆత్మహత్యాయత్నం
పుంగనూరు మండలంలోని కమతంపల్లి గ్రామానికి చెందిన ఆనంద (42) కుటుంబ కలహాల కారణంగా గురువారం ఇంట్లో...
By Kothuru Murali 2025-12-26 06:34:14 0 238
Andhra Pradesh
రోగులకు పండ్లు, రొట్టెల పంపిణీ
ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవం సందర్భంగా బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సూపరింటెండెంట్ గేదెల...
By Boiena Rajesh 2026-08-19 08:46:25 0 90
Andhra Pradesh
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు...
By Benguluri Madhubabu 2026-01-31 04:24:01 0 304
Andhra Pradesh
Chandrababu Naidu: మంత్రులకు రేటింగ్స్ ఇచ్చిన చంద్రబాబు.. హోం మంత్రి అనిత లాస్ట్!
మంత్రుల పనితీరుకు చంద్రబాబు రేటింగ్స్ తొలి స్థానంలో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు నాలుగో...
By Pagadala Venkateswar 2026-03-12 05:47:08 0 215
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com