అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీసులకు ఘన సన్మానం

0
400

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీసులకు ఘన సన్మానం

 

గోదావరిఖని ఏసీపీ కార్యాలయంలో మహిళా సిబ్బందితో వేడుకలు – మహిళల సేవలు అభినందనీయం: ఏసీపీ ఎం.రమేష్

 

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరిఖని ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ ఎం. రమేష్ పోలీస్ అధికారులతో కలిసి మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. అనంతరం మహిళా పోలీస్ అధికారులు, సిబ్బందిని శాలువాలతో ఘనంగా సన్మానించారు.

 

ఈ సందర్భంగా ఏసీపీ ఎం. రమేష్ మాట్లాడుతూ, మహిళల్లో సంకల్పశక్తి ఎక్కువగా ఉంటుందని, వారు ఏ రంగంలోనైనా గొప్ప విజయాలు సాధించగలరని అన్నారు. దేశంలోని అన్ని రంగాల్లో మహిళలు ఉన్నత స్థానాలకు చేరుకుంటూ పురుషులతో సమానంగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలకు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో హక్కులు ఉన్నాయని తెలిపారు.

 

మహిళా అధికారులు తమ పూర్తి శక్తి, సామర్థ్యాలతో విధులు నిర్వహిస్తూ తమ లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు. పురుషుల కంటే మహిళల్లో నిబద్ధత ఎక్కువగా ఉంటుందని, పలు విభాగాల్లో మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా సేవలందిస్తున్నారని తెలిపారు.

 

పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ విధులు, కోర్టు డ్యూటీ ఆఫీసర్, రైటర్, పెట్రోలింగ్, బ్లూ కోట్స్, సైబర్ వారియర్స్, పాఠశాలలు మరియు కళాశాలల్లో షీ టీమ్స్ ద్వారా సైబర్ క్రైమ్‌లపై అవగాహన కార్యక్రమాలు, ముఖ్యమైన బందోబస్త్ బాధ్యతలను మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది సమర్థంగా నిర్వహిస్తున్నారని అన్నారు. గృహహింస, వైవాహిక వివాదాల వంటి కేసుల్లో బాధిత మహిళలకు కౌన్సెలింగ్ అందిస్తూ మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని అభినందించారు.

 

మహిళలు పలు రంగాల్లో సాధిస్తున్న విజయాలు రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్న ఏసీపీ, మహిళా అధికారులు ధైర్యంగా ఉండి తమ వృత్తిపరమైన బాధ్యతలను గౌరవంగా నిర్వహించాలని సూచించారు. మహిళా పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, గోదావరిఖని టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, రామగుండం ఎస్సై సంధ్యారాణి, రామగిరి ఎస్సై దివ్య, గోదావరిఖని వన్ టౌన్ ఎస్సై అనూష, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కొమరాడలో తిష్ట వేసిన ఏనుగుల గుంపు
కొమరాడ మండలంలో కొద్ది రోజులుగా ఎనిమిది అడవి ఏనుగుల గుంపు తిష్ట వేసి రైతులకు కంటిమీద కునుకు...
By Boiena Rajesh 2026-09-07 06:13:22 0 88
Telangana
వేగంగా ఎస్‌ఐఆర్
ప్రతీ ఒక్కరూ SIR లో వివరాలు నమోదు చేసుకోవాలి జిల్లా ఎన్నికల అధికారి స్నేహ శబరీష్ ...
By Bheeshman King 2026-06-30 13:55:23 0 148
Andhra Pradesh
గోదావరిలో గల్లంతైన మదనపల్లె విద్యార్థి మృతదేహం లభ్యం
మదనపల్లెకు చెందిన బీటెక్ విద్యార్థి సతీష్ మృతదేహం గోదావరి నదిలో లభ్యమైంది. భద్రాచలం పరిధిలోని...
By Pagadala Venkateswar 2026-03-21 06:12:11 0 206
SURAKSHA
Upholding Integrity: The Puducherry Police PoP Unit Explained
The "Policing of Police" (PoP) unit represents a cornerstone of institutional integrity within...
By Lokeshwari Panthadi 2026-07-03 08:36:57 0 131
Andhra Pradesh
విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి: డీఈవో.
జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని మదనపల్లిలోని బాలాజీ నగర్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్...
By Pagadala Venkateswar 2026-02-28 11:34:40 0 195
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com