Stand with her

0
209

 

 

❇️ ఒక మహిళ సారథ్యంలో ఉన్న పార్టీ ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వాన్ని నడుపుతోంది. దేశ స్వతంత్రానికి ముందు, ఆ తర్వాత కూడా మహిళలకు కీలక పదవులు, బాధ్యతలు కట్టబెట్టిన చరిత్ర మా పార్టీకి ఉంది. నాడు తెలంగాణ ఏర్పాటులోనూ మహిళామణులే కీలకంగా వ్యవహరించారు. మహిళల శక్తిసామర్థ్యాల పట్ల మా ప్రభుత్వానికి బలమైన నమ్మకం ఉంది.

 

❇️ ప్రస్తుతం తెలంగాణ పోలీస్ శాఖలోని కీలక విభాగాలకు, ప్రభుత్వంలోని ముఖ్యమైన శాఖలకు మహిళలే అధికారిణులుగా ఉన్నారు. ఆడబిడ్డలు సామాజికంగా, ఆర్థికంగా బలోపేతమైతేనే ఆ రాష్ట్రం లేదా దేశం పురోగతి సాధించినట్టుగా భావించాలి.

 

❇️ తెలంగాణలో ఓవైపు మహిళా భద్రతకు ప్రాధాన్యం ఇస్తూనే, ఆర్థిక స్వావలంబన దిశగా మహిళ కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు, వడ్డీలేని రుణాలు మహిళల పేరుమీదే ఇస్తున్నాం. సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు, ఆర్టీసీ బస్సులకు వారిని యజమానులుగా చేస్తున్నాం.

 

❇️ తెలంగాణ గ్రామీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులను అంతర్జాతీయంగా విక్రయించేలా అమెజాన్ వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టుకున్నాం. తెలంగాణ రాష్ట్రానికి ఆడబిడ్డనే స్పూర్తిగా ఉండాలని ‘తెలంగాణ తల్లి’ మూర్తులను ప్రతిష్టించుకున్నాం.

 

❇️ తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్య సాధనలో మహిళల ముందడుగే కీలకం. మహిళలు ఆర్థిక ప్రగతి సాధించడంతోనే తెలంగాణ రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతుంది. మహిళలకు సంపూర్ణ భద్రత కల్పించడంతోనే ఇవన్నీ నెరవేరుతాయి.

 

❇️ గతంలో కొన్ని ప్రాంతాల్లోనో, బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు వేధింపులు ఎదురయ్యేవి. కానీ ఈరోజుల్లో ఫిజికల్ క్రైమ్ కంటే ఆన్‌లైన్ క్రైమ్ పెరిగిపోయింది. డీప్ ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారు. వీటిని నియంత్రించడానికి తెలంగాణ సైబర్ క్రైమ్ విభాగాన్ని కూడా పటిష్టం చేశాం.

 

❇️ ఏదైనా జరిగినప్పుడు అమ్మాయిదే తప్పు అని నిందలు వేసే చెడు సంప్రదాయాన్ని మనం వదులుకోవాలి. ఇబ్బందుల్లో ఉన్న మహిళల కోసం ‘స్టాండ్ విత్ హర్’ అనే నినాదం తీసుకొని వారికి అండగా నిలబడాలి” అని ముఖ్యమంత్రి గారు అన్నారు.

 

❇️ స్టాండ్ విత్ హర్ క్యాంపెయిన్ ప్రారంభ కార్యక్రమంలో సీఎం మాజీ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారు, విమెన్ సేఫ్టీ విభాగం అడిషనల్ డీజీపీ చారు సిన్హా గారు, సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ గారు, పలువురు పోలీస్ ఉన్నతాధికారులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Malla Ramgopal Naidu: కీర్తిచక్ర మేజర్‌కు ఏపీ ప్రభుత్వం భారీ నజరానా.. రూ.1.25 కోట్ల నగదు బహుమతి.
కీర్తిచక్ర మేజర్ రామ్‌గోపాల్ నాయుడికి నగదు పురస్కారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన...
By Pagadala Venkateswar 2026-01-28 06:19:02 0 202
SURAKSHA
Rashmi Shukla IPS: Leading Maharashtra Police with Excellence
The Journey Begins "Leadership is not merely about enforcing the law—it is about earning...
By Fathima Safa 2026-07-21 03:36:52 0 143
Uttarkhand
Rural Revolution: Voluntary Land Consolidation Policy
The Uttarakhand Cabinet has officially launched the Voluntary Chakbandi (Land Consolidation)...
By Dunna Jessicaruth 2026-05-14 09:11:02 0 113
Karnataka
Married women suicide
మూడు రోజుల నాటి సాంబార్ చిచ్చు.. వివాహిత ఆత్మహత్య   క్షణికావేశం ఎంతటి ఘోరానికి...
By G k Nookala 2026-03-07 18:03:31 0 192
Andhra Pradesh
లింగ నిర్దారణ చట్టం జిల్లా స్థాయి సమావేశం
కలెక్టర్ కార్యాలయం నందు గర్భస్థ లింగ నిర్ధారణ చట్టము మరియు ఏఆర్టి /సరోగసి జిల్లా స్థాయి సమావేశము...
By John Baji 2025-12-31 01:43:22 0 199
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com