విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి రెండవ రోజు కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు

0
184

ప్రకటన: మార్చి 07, 2026

విజయవాడ, ఇంద్రకీలాద్రి: శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కుంభాభిషేక మహోత్సవాలు రెండవ రోజు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఫాల్గుణ బహుళ చవితి సందర్భంగా శనివారం యాగశాలలో శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించనున్నారు 

రెండవ రోజు కార్యక్రమ వివరాలు:

ఉదయం 8:00 గంటలకు: వివిధ పవిత్ర నదీ జలాలు, సముద్ర జలాలతో అష్టోత్తర కలశస్థాపన, పీఠ పూజలు ప్రారంభమవుతాయి

మధ్యాహ్నం 12:00 గంటలకు: యాగశాలలో మూలమంత్రహవనములు నిర్వహించబడతాయి 

సాయంత్రం 4:00 గంటల నుండి: మూలమంత్రహవనములు, ప్రదోషకాల పీఠపూజలు మరియు హారతి కార్యక్రమాలు ఉంటాయి 

రాత్రి 7:00 గంటలకు: మంత్రపుష్పంతో నేటి కార్యక్రమాలు ముగుస్తాయి 

పత్రికా ప్రకటన: మార్చి 08, 2026

విజయవాడ, ఇంద్రకీలాద్రి: ఇంద్రకీలాద్రిపై అత్యంత వైభవంగా జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవం నేటితో (ఆదివారం) ముగియనుంది. ఈ పవిత్ర క్రతువులో భాగంగా కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారి పర్యవేక్షణలో కుంభాభిషేకం జరుగనుంది .

ముఖ్య ఘట్టాలు:

ఉదయం 7:00 గంటలకు: మంటప పూజలు, మూలమంత్ర హవనములు ప్రారంభమవుతాయి 

ఉదయం 9:00 గంటలకు: పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించబడుతుంది 

ఉదయం 9:34 గంటలకు (మేషలగ్నంలో): శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రధాన ఆలయ శిఖర విమానగోపురమునకు కంచి పీఠాధిపతుల అమృత హస్తాలతో, పవిత్ర నదీ జలాలతో కుంభాభిషేక క్రతువు నిర్వహించబడుతుంది 

అనుగ్రహ భాషణము: కుంభాభిషేకం అనంతరం రాజగోపురం ప్రాంగణంలోని కళావేదికపై శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారు భక్తులకు అనుగ్రహ భాషణము చేస్తారు 

ఈ మహోత్సవం ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఆలయ దైవిక శక్తిని పెంపొందించడానికి నిర్వహించబడుతుంది

Search
Categories
Read More
Telangana
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విస్తృత పోలీస్ అవగాహన కార్యక్రమం ఎస్పీ నితికా పంత్ ఆదేశాల మేరకు జముల్దారాలో కళాబృందం ప్రదర్శనలు
🎤భారత్ ఆవాజ్ న్యూస్ (కుమ్రం భీం  ఆసిఫాబాద్): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి నితికా...
By Chunarkar Jagadeesh 2026-09-16 13:18:55 0 79
Andhra Pradesh
విశాఖ To భోగాపురం.. ఈ-బస్సులు రెడీ!
భోగాపురం ఎయిర్పోర్ట్కు APSRTC నడపనున్న ఎలక్ట్రిక్ బస్సుల్లో 3 బస్సులు బుధవారం విశాఖ స్టీల్ డిపోకు...
By Boiena Rajesh 2026-07-16 08:24:51 0 146
Andhra Pradesh
విజయవాడ నగరంలో వీధి విక్రయదారుల గుర్తింపు కార్డులు వెడ్డింగ్ సర్టిఫికెట్స్ మంజూరు చేయాలి జి కోటేశ్వరరావు డిమాండ్
*ప్రచురణార్ధం !*     *విజయవాడ నగరంలో వీధివిక్రయదారులకి గుర్తింపు కార్డులు వెండింగ్...
By Rajini Kumari 2025-12-19 11:58:23 0 259
Andhra Pradesh
హార్టికల్చర్‌పై ప్రత్యేక దృష్టి.. బ్యాంకులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు.
2026-27 ఆర్థిక సంవత్సరానికి నాబార్డు రుణ ప్రణాళిక విడుదల రూ.5.11 లక్షల కోట్లతో స్టేట్ ఫోకస్...
By Pagadala Venkateswar 2026-05-06 07:20:21 0 142
Andhra Pradesh
ఐక్యతతో బిజెపిని బలోపేతం చేద్దాం - రాష్ట్ర యువ మోర్చా కార్యదర్శి మణి కుమార్
నేడు చీరాల రోటరీ క్లబ్ లో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా...
By Vadlamudi NagaVenkat 2026-03-24 07:28:34 0 528
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com