రాజకీయాల్లో ఏమాత్రం అనుభవం లేని వ్యక్తి దేవినేని అవినాష్ రాష్ట్ర అధికారి పొట్లూరి దర్శిత్

0
183

*ప్ర‌చుర‌ణార్థం* *05-03-2026*

 

*రాజకీయ అవగాహన లేని వ్యక్తి వైసిపి జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్* : టి.ఎన్.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి పొట్లూరి దర్షిత్

 

విజయవాడ : ఏ మాత్రం రాజకీయ అవగాహన లేని వ్యక్తి వైసిపి జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అని టి.ఎన్.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి పొట్లూరి దర్షిత్ అన్నారు. అటువంటి వ్యక్తి ఎన్టీఆర్ జిల్లా వైసిపి అధ్యక్షుడుగా ఉన్నాడంటే వైసిపి ధీన పరిస్థితి ఏంటో అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు.

 

 గురునానక్ కాలనీలో ఎన్టీఆర్ భవన్ విజయవాడ పార్లమెంట్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పొట్లూరి దర్షిత్ మాట్లాడుతూ...వైసిపి జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నాడన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ,విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ( చిన్ని) పై వ్యాఖ్యలు చేయడంను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

 

తిరువూరు నియోజకవర్గం నెమలిలో జరిగినటువంటి సంఘటనపై ఎంపీ ను విమర్శిస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడనీ, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలిని ఆసరాగా తీసుకుని ఆ ఘటనను రచ్చ చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు వైసిపి చూస్తోందన్నారు. దేవినేని అవినాష్ తండ్రి కూడా గతంలో కంకిపాడు శాసన సభ్యుడుగా పని చేసినప్పుడు ఆనాడు ఎంపీలుగా పనిచేసిన పర్వతనేని ఉపేంద్ర, లగడపాటి రాజగోపాల్ తో ఏ మాత్రం సఖ్యతగా ఉండేవాడో బెజవాడ ప్రజలందరికీ తెలుసు అన్నారు. పాత కాంగ్రెస్ నాయకులను ఎవరినడిగినా ఆ విషయాలు చెబుతారన్నారు. అవినాష్ తండ్రి కూడా ఎమ్మెల్యేగా ఉన్నపుడు నాటి ఎంపీలతో సఖ్యతగా ఉన్న పరిస్థితి లేదన్నారు.

 

ఏ రాజకీయ పార్టీలో అయినా అంతర్గత విషయాలు ఉంటాయని, ఇవేమీ తెలియని దేవినేని అవినాష్‌కు రాజకీయాల పట్ల అవగాహన లేదని మరోసారి స్పష్టం అవుతోందన్నారు. అవినాష్ వంటి రాజకీయ పరిపక్వత లేని వారిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా చేశారంటే ఆ పార్టీ ఎలాంటి దీన స్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చన్నారు. సహజంగా రాజకీయ పార్టీలు ప్రధాన పార్టీలన్నీ కూడా సీనియర్ ప్రజా ప్రతినిధులని జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమించడం జరుగుతుందనీ, ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడుగా ఉన్న దేవినేని అవినాష్ కార్పొరేటర్ గా గెలిచిన పరిస్థితి లేదన్నారు. కార్పొరేటర్ స్థాయిలో కూడా గెలిచిన దాఖలాలు లేవన్నారు.

 

అటువంటి వ్యక్తిని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పెట్టారంటే వైసిపి పార్టీ ఎలాంటి అధ్వాన స్థితిలో ఉందో ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. 2014 ఎన్నికల్లో ఇతను ఎంపీ గా పోటీ చేస్తే కనీసం డిపాజిట్ కూడా రానిటువంటి పరిస్థితి చూశామన్నారు. ఆ తర్వాత 2019 లో ఇతను గుడివాడ వెళ్లి ప్రగల్భాలు పలికినటువంటి పరిస్థితి కూడా చూశామంటూ...గుడివాడ వెళ్లి కార్యకర్తలకు 24 గంటలు అందుబాటులో ఉంటాం నా సెల్ ఫోన్ నెంబర్ రాసుకోండి అని చెప్పి మాట్లాడినటువంటి అవినాష్ అక్కడ ఘోర పరాభవం తర్వాత మరి 24 గంటల్లోనే తోక ముడుచుకుని బెజవాడ పారిపోయి వచ్చిన మాట వాస్తవం కాదా? అంటూ ప్రశ్నించారు. ఓడిపోయిన తర్వాత గుడివాడలో కనీసం తనను ఓడించిన అభ్యర్థి మీద ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేనటువంటి దీన పరిస్థితిలో ఉండిపోయిన అవినాష్‌కు ఎంత ధైర్యం ఉందో ఆనాడే బయటపడిందనీ, ప్రతిపక్ష పార్టీలో ఆనాడు పోరాడలేక అధికార పార్టీ చంకనాకి ఆరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడన్నారు.

 

అవినాష్ ను చిత్తు చిత్తుగా ఓడించిన వైసిపి లో చేరిన తర్వాత విజయవాడ తూర్పులో నీ అరాచకాల్ని దందాల్ని మొదలుపెట్టిన ప్రజలను పీడించాడన్నారు. ఏ వీధిలో ఇసుక గుట్ట కంకర గుట్ట కనపడినా అవినాష్ మనుషులంతా రాబందుల్లా వాలిపోయి కాసుల కోసం ప్రజలను దోచుకుతిన్నారన్నారు. ప్రతి భవన యజమాని దగ్గర లక్షలాది రూపాయలు నువ్వు వసూలు చేయించి వైసిపి అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో కోట్లది రూపాయలు ప్రజల దగ్గర దందాలు చేసి, ఇవ్వని వారి భవనాల స్లాబులు పగలుగొట్టించి అరాచకం చేసిన చరిత్ర అవినాష్ సొంతం అన్నారు. అటువంటి అక్రమార్కుడు దేవినేని అవినాష్ నేడు విజయవాడ పార్లమెంట్ సభ్యుడిని దందాలు చేశారని మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టే ఉందన్నారు. మూడు సార్లు ఎన్నికల్లో పోటీచేసిన దేవినేని అవినాష్‌కు మూడు ఎన్నికల్లో కలిపి లక్షా 80 వేల ఓట్లు కూడా రాలేదని, మొదటి సారే ఎంపీగా ప్రజల మద్దతుతో 2.85లక్షల మెజార్టీతో గెలిచిన నిజమైన ప్రజా నాయకుడు ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. మూడు ఎన్నికలలో పోటీ చేసి మూడు సార్లు ఓడి పోయిన ఘనుడు అవినాష్ అన్నారు. అటువంటి అవినాష్‌కు విశేష ప్రజాదరణ ఉన్న కేశినేని చిన్నిని విమర్శించే నైతికత ఉందా ? అని అన్నారు.

 

ప్రస్తుతం ఏదో జిల్లా అధ్యక్షుడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఎవరూ కూడా సిద్ధంగా లేరన్నారు. తిరువూరులో జరిగినటువంటి వ్యవహారంలో నెమలి గుడికి సంబంధించినటువంటి చైర్మన్ మీ వైసిపి మండల పార్టీ అధ్యక్షుడి భార్య ఆవిడతో ప్రెస్ మీట్ పెట్టించి ఎంపి కేశినేని చిన్ని తప్పు ఉందని నువ్వు చెప్పించగలవా ? అన్నారు. ఆ ధైర్యం నీకు ఉందా? అవినాష్ అని సవాల్ విసిరారు. ఎంపీ తప్పు లేదని అక్కడ ప్రజలందరికకీ తెలుసు అన్నారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దే రామ్మెహనరావుకు వైసిపి ప్రభుత్వ పాలనలో ఏనాడైనా నువ్వు ప్రొటోకాల్ ఇచ్చావా? ఇవ్వనిచ్చావా? అని ప్రశ్నించారు. అటువంటి అవినాష్ ఇప్పుడు ప్రొటో కాల్ అంటూ మాట్లాడటం పిగ్గుచేటన్నారు. ఒక్కసారి కూడా ఎన్నికల్లో గెలవని నీకు ప్రొటోకాల్ అంటే ఏంటో అసలు తెలుసా అంటూ ఎద్దేవా చేశారు. తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ గానీ, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) గాని, యువ నేత నారా లోకేష్ గాని వారి హుందాతనాన్ని ఒక ఐదు నిమిషాలు తీసి పక్కన పెడితే నువ్వు ప్రెస్ లో మాట్లాడడానికి కాదు కదా విజయవాడలో తిరగడానికి గాని అవినాష్ సాహసం చేయడన్నారు. ఇప్పటికైనా హద్దులు దాటి మాట్లాడవద్దని, నోరు అదుపులో ఉంచుకోవాలని అవినాష్‌కు హితవు పలుకుతున్నామని, లేని పక్షంలో గుణపాఠం తప్పదన్నారు.

 

దేవినేని అవినాష్ కి ఫ్యూజులు కొట్టేసి, కన్ఫ్యూజన్ లో ఉన్నాడని ప్రజలతోపాటు జగన్ కు కూడా అర్థమైందని, అందుకే జగన్ బహిరంగంగానే వ్యాఖ్యానించారని ఎద్దేవా చేశారు. కాబట్టి క్లారిటీ తో వచ్చే ఎన్నికల్లో అవినాష్‌కు సీటు ఎక్కడో...ఎక్కడ నుంచి పోటీ చేస్తావో తేల్చుకుని మాట్లాడితే మంచిదన్నారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
నేడు చిత్తూరు జిల్లాలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారి పర్యటన
ఈరోజు రాష్ట్ర యువజన క్రీడ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పర్యటనలో భాగంగా...
By Benguluri Madhubabu 2026-02-06 04:46:56 0 245
Odisha
Odisha Industrial and Economic Growth: Latest Developments
Odisha has emerged as one of India’s leading industrial hubs, driven by strong growth in...
By Fathima Safa 2026-06-25 07:05:50 0 66
Business & Finance
Wind Up Your LLP with Smooth Legal Compliance Process
Winding up an LLP is the legal process of closing a Limited Liability Partnership by settling...
By Navya Sree 2026-07-23 05:33:49 0 21
Telangana
అల్వాల్ అంజనాపురి కాలనీలో భారీ చోరీ.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా/ అల్వాల్ అల్వాల్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తిమ్మప్ప తెలిపిన...
By Sidhu Maroju 2025-07-29 10:51:37 0 862
Andhra Pradesh
నందవరం మండల కేంద్రంలోని
Mpp Telugu main School నుండి ఆరుగురు విద్యార్థులు గురుకుల పాఠశాల కు ఎంపిక అయ్యారు అని...
By Boya Dasthagiri 2026-04-23 12:54:25 0 158
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com