చీరాల అభివృద్ధి పై పవన్‌కు ఎమ్మెల్యే కొండయ్య వినతి నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతులకు నిధులు కోరిన ఎమ్మెల్యే, నిధుల మంజూరుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ.

0
400

చీరాల: చీరాల ఎమ్మెల్యే MMకొండయ్య,ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ను గురువారం అయన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు .ఈసందర్భంగా నియెజకవర్గంలోని అభివృధి ఫై సుదీర్ఘంగా చర్చించారు .ముఖ్యంగా చీరాల నియోజకవర్గం ఎదుర్కొంటున్న శాఖాపరమైన  ప్రధాన సమస్యలను ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి  తీసుకెళ్లినట్టు స్థానిక ఎమ్మెల్యే MMకొండయ్య  వెల్లడించారు. మరమ్మతులకు నోచుకోని రహదారులతో  పాటు, కీలకమైన తాగునీటి ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని అయన  విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం  అందజేశారు.ఈసందర్భంగా  చీరాల  నియోజకవర్గంలోని చీరాల, వేటపాలెం మండలంలోని గ్రామాలలో  రోడ్ల మరమ్మతులకు, కొత్త రోడ్లు ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే MMకొండయ్య ,ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కి  విన్నవించారు . గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ పరిధిలోని చాలా రోడ్లు అభివృద్ధికి నోచుకోక, నిర్లక్ష్యానికి గురియ్యాయన్నారు . ముఖ్యంగా  రోడ్ల మరమ్మతు పనులు కూడా చేపట్టకపోవడంతో అనేక గ్రామాలలో రోడ్లు చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయన్నారు.ఇటీవల్ల తుపాన్ ప్రభావంతో   నియోజవర్గంలోని సముద్రతీర ప్రాంతాలలోని ప్రధాన కల్వర్టులు రోడ్లు , గ్రామీణ ప్రాంతాల రోడ్లు దేబతిన్న విషయాన్ని ఎమ్మెల్యే కొండయ్య ఉప ముఖ్యమంత్రి పవన్ దృష్టికి తీసుకెళ్ళేరు .ఇదే క్రమంలో  జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో చేపట్టిన నీటి ప్రాజెక్టులు, ఇంకను గ్రామీణ ప్రాంతాలలో చేపట్టాల్సిన నీటి ప్రాజెక్ట్ గూర్చి  క్షుణంగా విచారించినట్లు చెప్పేరు. ఇక ఎమ్మెల్యే కొండయ్య , ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లిన చీరాల అభివృద్ధి  అంశాల ఫై  సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు .అంతేకాకుండా నిధుల మంజూరుకు భరోసా ఇచ్చారన్నారు .ఈక్రమంలోనే  పర్యాటకరంగంగా అభివృద్ధి చెందుతున్న చీరాల ప్రాంతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించాలని , ఆహ్వానించినట్లు  ఎమ్మెల్యే కొండయ్య తెలిపారు .ఇదే క్రమంలో ఎమ్మెల్యే MMకొండయ్య ఆహ్వానం పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుకూలంగా  స్పందించినట్లు తెలిపారు .

Search
Categories
Read More
Andhra Pradesh
భోపాల్‌లో జరిగిన సౌత్ వెస్ట్ జోన్ యూనివర్సిటీ నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో చీరాలకు చెందిన యువకుడు దేవరకొండ ప్రేమ్ సాగర్ అద్భుత ప్రతిభ
చీరాల: భోపాల్‌లో జరిగిన సౌత్ వెస్ట్ జోన్ యూనివర్సిటీ నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో...
By Gadiyapudi Narendra 2026-01-17 17:00:09 0 224
Andhra Pradesh
కార్మికులకు ఏం చేశారని విజయోత్సవాలు?: సాంబశివ.
మదనపల్లిలో శనివారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్–ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు...
By Pagadala Venkateswar 2026-06-21 07:36:23 0 87
Andhra Pradesh
మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి: సీపీఐ
వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం పట్ల సీపీఐ కాకినాడ జిల్లా కమిటీ తీవ్ర...
By Ratna Sekhar 2026-02-28 18:56:45 0 2K
Kerala
Kerala to Produce Local Snakebite Antivenom on World Snake Day
At a World Snake Day event, Kerala’s Forest Minister A. K. Saseendran announced a plan to...
By Bharat Aawaz 2025-07-17 08:36:02 0 1K
Telangana
పెట్రోల్ వదంతులతో సికింద్రాబాద్ విలవిల: బంకుల వద్ద భారీ క్యూలు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
    హైదరాబాద్ :  సికింద్రాబాద్‌తో పాటు హైదరాబాద్ మహానగరంలోని పలు...
By Sidhu Maroju 2026-03-25 06:08:32 0 214
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com