భోపాల్‌లో జరిగిన సౌత్ వెస్ట్ జోన్ యూనివర్సిటీ నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో చీరాలకు చెందిన యువకుడు దేవరకొండ ప్రేమ్ సాగర్ అద్భుత ప్రతిభ

0
224

చీరాల: భోపాల్‌లో జరిగిన సౌత్ వెస్ట్ జోన్ యూనివర్సిటీ నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో చీరాలకు చెందిన యువకుడు దేవరకొండ ప్రేమ్ సాగర్ అద్భుత ప్రతిభ కనబరిచి ఫోర్త్ ప్లేస్ సాధించాడు.ఈ ఫలితంతో అతనికి ఆల్ ఇండియా యూనివర్సిటీ నేషనల్ గేమ్స్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీలో జరిగే పోటీల్లో ప్రేమ్ సాగర్ పాల్గొననున్నట్లు యోగివేమన యూనివర్సిటీ హెచ్‌ఓడీ (ఫిజికల్ ఎడ్యుకేషన్) రామసుబ్బారెడ్డి శనివారం తెలిపారు.గత ఏడాది ప్రేమ్ సాగర్ అల్ ఇండియా పోటీలలో థర్డ్ ప్లేస్ సాధించి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు.ఈ విజయం చీరాల ప్రాంతానికి గర్వకారణమని క్రీడాభిమానులు అభినందించారు.ప్రేమ్ సాగర్ తండ్రి దేవరకొండ ప్రవీణ్ కుమార్ బ్యాంక్ ఆఫ్ బరోడా లో విధులు నిర్వర్తిస్తూ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు టెక్నికల్ అఫీషియల్ గా వ్యవహరిస్తుంటారు.ప్రేమ్ సాగర్ తల్లి స్వాతి చీరాల నియోజకవర్గ తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు గా ఉంటూ ప్రజా సేవ చేస్తుంటారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
కురబలకోటలో కారు ఢీకొని భవన కార్మికుడికి తీవ్ర గాయాలు.
కురబలకోట మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భవన నిర్మాణ కార్మికుడు కె. రమణ (45) తీవ్రంగా...
By Pagadala Venkateswar 2026-05-18 04:16:25 0 183
Andhra Pradesh
చిల్లకల్లు గ్రామంలో గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ రంగుల మహోత్సవం
జగ్గయ్యపేట    కన్నుల పండువగా శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారు రంగుల మహోత్సవ...
By Rajini Kumari 2026-01-06 10:58:42 0 247
Andhra Pradesh
గుంటూరు పశ్చిమ అభివృద్ధిపై కూటమి నేతల మధ్య పూర్తి సమన్వయం – ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు పశ్చిమ అభివృద్ధి పై ఎన్డీయే కూటమి నేతల మధ్య పూర్తి సమన్వయం ఉందని, మేయర్ కోవెలమూడి రవీంద్ర...
By John Baji 2025-12-30 01:14:44 0 225
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ చర్యలు పటిష్టతను శాస్త్రీయంగా పరిశీలించేందుకు సాంకేతిక బృందం
పత్రికా ప్రకటన   విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం కొండ చరియల పటిష్టతపై...
By Rajini Kumari 2026-04-10 12:19:21 0 190
SURAKSHA
Romil Singh Donk: Leading Leh with Vision and Service
A dynamic IAS officer of the AGMUT cadre, Romil Singh Donk serves as the Deputy Commissioner of...
By Lokeshwari Panthadi 2026-07-30 05:33:20 0 134
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com