వి.ఎస్.ఎన్. మూర్తి (దేవిప్రియ) సస్పెండ్ .|

0
215

హైదరాబాద్: తెలుగు ఫిల్మ్ జర్నలిస్టుల అసోసియేషన్ (TFJA) కీలక నిర్ణయం తీసుకుంది.

అసోసియేషన్ సభ్యుడు వి.ఎస్.ఎన్. మూర్తి (దేవిప్రియ)ను మూడు నెలల పాటు అసోసియేషన్ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు కార్యవర్గం ప్రకటించింది.

గత కొంతకాలంగా సామాజిక మాధ్యమం 'X' (ట్విట్టర్) వేదికగా తోటి జర్నలిస్టులను కించపరిచే విధంగా, వారి వ్యక్తిత్వానికి భంగం కలిగించేలా వి.ఎస్.ఎన్. మూర్తి పోస్టులు చేస్తున్నట్లు అసోసియేషన్ దృష్టికి వచ్చింది.

 దీనిపై విచారణ జరిపిన అసోసియేషన్ క్రమశిక్షణ కమిటీ, ఆయన ప్రవర్తన జర్నలిజం విలువలకి మరియు అసోసియేషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని నిర్ధారించింది.

ఈ మేరకు అసోసియేషన్ నిబంధనలను అతిక్రమించినందుకు గాను, ఆయన సభ్యత్వాన్ని తక్షణమే మూడు నెలల పాటు రద్దు చేస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. 

వృత్తిపరమైన గౌరవాన్ని కాపాడుకోవాలని, తోటి జర్నలిస్టుల పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలని ఈ సందర్భంగా అసోసియేషన్ తన సభ్యులకు సూచించింది.

#sidhumaroju 

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:మాజీ ఎంపీ రెడ్డెప్పతో పాటు మరో 32 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు
పుంగనూరులో 'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' పేరుతో నిరసన తెలిపిన 33 మంది వైసీపీ నేతలపై కేసు...
By Kothuru Murali 2026-06-07 06:16:25 0 144
Andhra Pradesh
మదనపల్లి: తాళం వేసిన ఇంట్లో చోరీ.
మదనపల్లె పట్టణంలోని చంద్రా కాలనీలో మంగళవారం సాయంత్రం తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి భారీగా నగదు,...
By Pagadala Venkateswar 2026-04-08 05:45:35 0 158
Telangana
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ -2025 ప్రకటన.|
  హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం...
By Sidhu Maroju 2026-03-07 09:25:12 0 206
Andhra Pradesh
మదనపల్లె : షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్నిప్రమాదం
మంగళవారం మదనపల్లిలోని మల్లికార్జున సర్కిల్ వద్ద భారీ అగ్నిప్రమాదం తప్పింది. వినాయక పశువుల దాణా...
By Pagadala Venkateswar 2026-02-24 08:05:46 0 190
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com