C M Revanth reddy meets Amith Shah in Delhi

0
310

తెలంగాణ రాష్ట్ర అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఐపీఎస్ అధికారుల సంఖ్య‌ను కేటాయించాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారికి ముఖ్య‌మంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి గారు కేంద్ర హోం శాఖ మంత్రి గారితో భేటీ అయ్యారు. 

 

✅ రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం 2016లో మొద‌టి క్యాడ‌ర్ రివ్యూ జ‌రిగింద‌ని, 2021లో జ‌ర‌గాల్సిన క్యాడ‌ర్ రివ్యూ చాలా ఆల‌స్యంగా 2025లో జ‌రిగింద‌ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గుర్తుచేశారు. ఆ స‌మ‌యంలోనూ కేవ‌లం ఏడుగురు ఐపీఎస్ అధికారుల‌ను మాత్ర‌మే తెలంగాణ‌కు కేటాయించార‌ని తెలిపారు.

 

✅ దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం సైబ‌ర్ నేరాలు, డ్ర‌గ్స్, వైట్ కాల‌ర్ నేరాలు స‌హా ఇత‌ర అనేక ఆధునిక స‌వాళ్ల‌ను ఎదుర్కొంటోంద‌ని చెప్పారు. హైద‌రాబాద్‌, సైబ‌రాబాద్‌, మ‌ల్కాజిగిరి క‌మిష‌న‌రేట్ల పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌, ఫ్యూచ‌ర్ సిటీ క‌మిష‌న‌ర్, హైద‌రాబాద్ న‌గ‌రంలో భారీగా పెరుగుతున్న జ‌నాభా నేప‌థ్యంలో పెద్ద సంఖ్య‌లో ఐపీఎస్ అధికారుల అవ‌స‌రం ఉంద‌ని వివరించారు.

 

✅ మూడో క్యాడ‌ర్ రివ్యూను నిర్దేశిత 2026 సంవ‌త్స‌రంలోనే చేప‌ట్టాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌స్తుతం 83 ఐపీఎస్ అధికారులు రాష్ట్రంలో ఉన్నార‌ని, ఆ సంఖ్య‌ను 103కు పెంచి కేటాయించాల‌ని కోరారు. 

 

✅ ఈ భేటీ సందర్భంగా మావోయిస్టుల లొంగుబాటుపై అమిత్ షా గారితో చ‌ర్చించారు. ఇటీవ‌ల మావోయిస్టు అగ్ర నాయ‌కుల లొంగుబాటు, వారి పున‌రావాసం అంశాలు చర్చించారు. గత రెండేళ్ల‌లో తెలంగాణ పోలీసింగ్‌లో గ‌ణ‌నీయ‌మైన మార్పులు వ‌చ్చాయ‌ని ముఖ్యమంత్రి గారు తెలిపారు. 

 

✅ రాష్ట్రంలో 591 మంది మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసిన విషయాన్ని చెప్పారు. ఇటీవల కాలంలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు కూడా సాధారణ జీవితం గడిపేందుకు ముందుకు వ‌చ్చార‌ని, వారికి నిబంధ‌న‌ల ప్ర‌కారం అంద‌జేస్తున్న ప‌రిహారం, పున‌రావాసం విష‌యాల‌ను కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి గారు వివరించారు.

 

✅ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కేంద్ర ప్ర‌భుత్వం నిధులు కేటాయించి స‌హ‌క‌రించాల‌ని కూడా కోరారు. స‌మావేశంలో ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ వి.శేషాద్రి గారు, రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి గారు, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్ గారు, ఎస్‌ఐబి ఐజీపీ బి. సుమతి గారు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మరో బి ఆర్ టి ఎస్ ఉద్యమం తప్పదు యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జాబీర్
రాయచోటి ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యం వహించి రాజ్యాంగబద్ధంగా అమలు చేయాల్సిన పన్నెండవ పిఆర్సి...
By Benguluri Madhubabu 2026-03-24 11:49:05 0 253
Telangana
పేకాటరాయుళ్ల అరెస్ట్
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైకేల్ సెయింట్ మైకేల్ స్కూల్ సమీపంలో ఓ ఇంట్లో గుట్టు చప్పుడు...
By Sidhu Maroju 2025-06-06 16:10:13 0 2K
Telangana
C M Revanth reddy live
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి మీడియా...
By G k Nookala 2026-08-24 11:29:37 0 110
Andhra Pradesh
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ పేరిట రిటైర్డ్ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ భార్య నుంచి 2.58 కోట్లు కాజేసిన కేటుగాళ్లు
✒️- స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ పేరిట రిటైర్డ్ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ భార్య నుంచి రూ.2.58...
By Rajini Kumari 2026-01-11 11:24:25 0 217
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com