Nara Lokesh: మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేశ్ దంప‌తులు.

0
231

స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన లోకేశ్‌

శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించి ప్రత్యేక ఆశీస్సులు పొందిన మంత్రి దంపతులు

ఘనంగా స్వాగతం పలికిన ఆలయ అధికారులు, స్థానిక నాయకులు

మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌, ఆయన అర్ధాంగి బ్రహ్మణి పాల్గొన్నారు. సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు నిర్వహించిన శ్రీవారి కల్యాణ మహోత్సవంలో పాల్గొని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

 

వార్షిక బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన శ్రీవారి కల్యాణాన్ని పురస్కరించుకుని ఆలయానికి చేరుకున్న లోకేశ్‌, బ్రహ్మణి దంపతులకు దేవస్థానం అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన స్వామివారి కల్యాణాన్ని వారు భక్తిశ్రద్ధలతో తిలకించారు. కార్యక్రమం ముగిశాక వేద పండితులు మంత్రి దంపతులకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. ఈ పవిత్రమైన కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మంగళగిరి క్షేత్రంలో పండుగ వాతావరణం నెలకొంది.

Search
Categories
Read More
Telangana
KTR Formula E race : ఫార్ములా ఈ కేసు, కేటీఆర్‌పై చార్జిషీట్
KTR
By Sunka Santhosh 2026-03-23 19:41:57 0 318
Telangana
నిజామాబాద్
అబద్ధాల కాంగ్రెస్ సర్కారుపై రగులుతున్న జనాగ్రహం అణగారిన వర్గాలకు, మహిళా లోకానికి తీరని ద్రోహం...
By Sadaq Sadaq 2026-04-30 05:36:05 0 158
Telangana
డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలు.. జరభద్రం: హైదరాబాద్ c.p. సజ్జనార్.|
    హైదరాబాద్ :  "హలో.. మేము సీబీఐ, నార్కోటిక్స్ నుంచి మాట్లాడుతున్నాం.. మీ పేరు...
By Sidhu Maroju 2025-12-23 14:20:53 0 273
Telangana
మొయినాబాద్లో విషాదం.. యువకుడు సూసైడ్
మొయినాబాద్ మండలం ఎత్బార్పల్లిలో విషాదం నెలకొంది. కుటుంబ సమస్యల కారణంగా బుర్ర మల్లేష్ అనే యువకుడు...
By Veeresh Kumar 2026-05-23 16:15:04 0 510
Andhra Pradesh
యూరియా కొరతపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: ప్రశాంతి రెడ్డి
కాకాని, నల్లపురెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్న ప్రశాంతి రెడ్డి నెల్లూరు జిల్లాలో యూరియా...
By Pagadala Venkateswar 2026-06-13 11:28:54 0 118
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com