AP Government: ఇక అన్నీ మీ ఫోన్‌లోనే.. ఏపీలో ఇంటింటికీ క్యూఆర్ కోడ్.

0
198

ఆస్తి పన్ను చెల్లింపుల కోసం ఏపీలో సరికొత్త విధానం

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికీ ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఏర్పాటు

పన్ను చెల్లింపులతో పాటు సమస్యలపై ఫిర్యాదులకూ అవకాశం

స్థానిక వ్యాపారాలు, సేవల వివరాలు కూడా ఫోన్‌లోనే లభ్యం

కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా రాష్ట్రంలో అమలుకు సన్నాహాలు

 

ఏపీలో పౌర సేవలను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్ను చెల్లింపులు, ఇతర పురపాలక సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సరికొత్త సాంకేతిక విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో ప్రతి ఇంటికీ, వాణిజ్య భవనానికీ ఒక ప్రత్యేక క్యూఆర్ (QR) కోడ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ విధానం ద్వారా ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, ఇంటి నుంచే సులభంగా పన్నులు చెల్లించవచ్చు.

 

ఈ కొత్త విధానాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురావడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి ఇంటి గోడకు లేదా డోర్‌కు ఈ క్యూఆర్ కోడ్‌ను అంటించనున్నారు. పౌరులు తమ ఫోన్‌తో ఈ కోడ్‌ను స్కాన్ చేయగానే, ఆ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు కనిపిస్తాయి. ఇంటి విస్తీర్ణం, ఏటా చెల్లించాల్సిన ఆస్తి పన్ను మొత్తం, ఏవైనా బకాయిలు ఉంటే ఆ వివరాలు స్పష్టంగా తెలుసుకోవచ్చని అధికారులు వివరించారు. అదేవిధంగా వ్యాపార సంస్థలు, దుకాణాల యజమానులు తమ ట్రేడ్ లైసెన్స్ ఫీజుల బకాయిలను కూడా దీని ద్వారా తెలుసుకుని చెల్లించవచ్చు.

 

ఫిర్యాదులు ఇకపై సులభం.. 

కేవలం పన్నుల చెల్లింపులకే కాకుండా ఇతర సమస్యలపై ఫిర్యాదు చేయడానికి కూడా ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఉదాహరణకు చెత్తను తొలగించడం లేదని ఫిర్యాదు చేయాలన్నా, మురుగునీటి పారుదల సమస్యలున్నా ఈ పోర్టల్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. దీనివల్ల అధికారులను నేరుగా కలవాల్సిన అవసరం ప్రజలకు తప్పుతుంది.

 

ఈ క్యూఆర్ కోడ్ విధానం ద్వారా మరిన్ని అదనపు సేవలను కూడా అందించనున్నారు. కోడ్‌ను స్కాన్ చేసినప్పుడు, ఆ ఇంటికి సమీపంలో ఉన్న థియేటర్లు, జిమ్‌లు, కల్యాణ మండపాలు, హోటళ్లు, దుకాణాలు, విద్యా సంస్థల వివరాలు కూడా కనిపిస్తాయి. వారిని సంప్రదించడానికి వీలుగా మొబైల్ నంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో "సిటీ సర్వీస్ సెంటర్ల" కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అందులో భాగంగానే ఈ క్యూఆర్ కోడ్ ప్రాజెక్టును ఏపీలో కూడా అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విధానంతో పౌర సేవల్లో పారదర్శకత పెరగడంతో పాటు ప్రజల సమయం కూడా ఆదా అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Search
Categories
Read More
Tripura
Ease of Doing Business: Tripura Leads Nationally
In a major administrative victory, Tripura has become the first state in India to fully implement...
By Dunna Jessicaruth 2026-05-18 10:35:36 0 134
Andhra Pradesh
పుంగనూరు: ఒంటరి ఏనుగు పట్ల అప్రమత్తంగా ఉండాలి
శనివారం, పుంగనూరు నియోజకవర్గం, సోమల, సదుం మండల సరిహద్దు ప్రాంతాలలో ఏనుగు సంచరిస్తోందని, ప్రజలు...
By Kothuru Murali 2026-05-09 14:59:46 0 152
Telangana
నిజామాబాద్ నగరంలోని కసాబ్ గల్లీలో కసాబ్ గల్లీ యూత్ ఆధ్వర్యంలో రాజరాజేంద్ర చౌరస్తా వద్ద గణేష్ ఆగమాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగర మేయర్ *శ్రీమతి కూరగాయల ఉమారాణి రమేష్* గారు పాల్గొన్నారు. మేయర్...
By Sadaq Sadaq 2026-09-11 04:06:40 0 78
Andhra Pradesh
ఇంటర్ సప్లిమెంట్ టైం టేబుల్ మే 2026
📚 ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ – మే 2026   ✅ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్...
By Rajini Kumari 2026-04-17 16:04:58 0 144
Andhra Pradesh
పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రమును ప్రారంభించిన డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రమును...
By Benguluri Madhubabu 2026-04-09 07:33:01 0 213
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com