చీరాలలో ఘనంగా ప్రింటర్స్ డే వేడుకలు

0
223

చీరాల:  ముద్రణ రంగంలో వస్తున్న ఆధునిక టెక్నాలజీని వినియోగించుకొని ముద్రణ రంగంలో వృద్దిలోకి రావాలని పలువురు సీనియర్ ప్రింటింగ్ రంగ ప్రతినిధులు పేర్కొన్నారు. ముద్రణ యంత్రం రూపొందించిన జోహాన్ఎస్ గూటెన్ బర్గ్ జయంతి సందర్బంగా ప్రింటర్స్ వేడుకలు మంగళవారం నిర్వహించారు.  ముందుగా జెండా ఆవిష్కరణ చేసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రముఖుల విగ్రహాలుకు పూల మాలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రోటరీ కమ్యూనిటీ హాలులో సభను నిర్వహించడం జరిగింది. ముద్రణ రంగంలో పని చేసి మరణించిన పలువురికి నివాళులు అర్పించారు. ముద్రణ రంగంలో వస్తున్న ఆధునిక టెక్నాలజీ ని అంది పుచ్చుకొని ఆర్ధికంగా ఎదగాలన్నారు. ముద్రణ రంగం పై ఎంతో మంది ఆధార పడి ఉపాధి పొందుతున్నారని అన్నారు. అక్షరం పేర్చే స్థాయి నుంచి ఏఐ స్థాయి వరకు ప్రింటింగ్ రంగం పెరిగిందన్నారు. అందరు ఐక్యత గా ఉండి ప్రింటింగ్ రంగాన్ని అభివృద్ధికి పాటుపడాలాన్నారు. అనంతరం శివ శంకర్ ఆఫ్సెట్ ప్రింటర్స్ అధినేత అచ్చుల నాగేశ్వరావు ను ఘనంగా సత్కరించుకున్నారు. లక్కీ డిప్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో అధ్యక్షులు నక్కల శ్రీనివాసరావు, కార్యదర్శి అరవింద్, కోశాధికారి కొణిజేటి నాగేశ్వరరావు, ప్రింటింగ్ ప్రెస్, బైండర్స్, ఫ్లెక్స్ ప్రింట్రర్స్, డీటీపీ ఆపరేటర్స్ తదితరులు ఎంతో ఉత్సహంగా పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
ఆసిఫాబాద్ నూతన DMHOగా డాక్టర్ నాగేంద్ర నియామకం
🎤ఆసిఫాబాద్ (భరత్ ఆవాజ్ న్యూస్)  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య...
By Chunarkar Jagadeesh 2026-08-06 04:05:16 0 395
Andhra Pradesh
Madanapalle: అంగళ్లు బైపాస్ వద్ద ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన HANS INDIA రిపోర్టర్ యుగంధర్‌ను వీడియో కాల్‌లో పరామర్శించిన మాజీ ఏపీఎండీసీ చైర్మన్ సమీమ్ అస్లాం.
Madanapalle: అంగళ్లు బైపాస్ వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన HANS INDIA...
By Pagadala Venkateswar 2026-07-24 05:25:17 0 98
Andhra Pradesh
గృహవాసాల మధ్య గోవధ.. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
మదనపల్లె పట్టణంలోని శాస్త్రి వీధిలో శుక్రవారం ఇళ్ల మధ్య గోవధకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం...
By Pagadala Venkateswar 2026-05-29 13:01:05 0 115
Andhra Pradesh
Matsyakarula sevalo
    చరిత్రలో మొట్టమొదటి సారి భారీగా ‘మత్స్యకారుల సేవలో’ నిధులు..  ...
By G k Nookala 2026-05-19 09:30:12 0 199
Andhra Pradesh
రామాపురంలోని పెరల్స్ రిసార్ట్ ఆవరణంలో  బీచ్ రిసార్ట్స్ యాజమాన్యం తో మీటింగ్.....
చీరాల: అందరికీ నమస్కారం చీరాల డిఎస్పి గారు చీరాల రూరల్ సిఐ గారు వేటపాలెం ఎస్ఐ గారు మరియు నేను...
By Gadiyapudi Narendra 2026-02-27 04:25:40 0 224
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com