హిందూ స్మశాన వాటికలో చెత్త డంపింగ్ నిలిపివేయండి.|

0
243

 

 

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  మచ్చ బొల్లారం పరిధిలోని సర్వే నెంబర్ 199లో హిందూ శ్మశానవాటిక స్థలంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న చెత్త ట్రాన్సఫర్ స్టేషన్ ని వెంటనే నిలిపివేసి మరో చోటకి తరలించాలని శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మల్కాజిగిరి మున్సిపల్ కమీషనర్ విజయ్ కృష్ణ రెడ్డిని మచ్చబొల్లారం జాయింట్ యాక్షన్ కమిటీ కలిసి వినతి పత్రం అందజేశారు. 

 

దాదాపు తొమ్మిది దశాబ్దాల క్రితం ఒక దాత దాతృత్వంతో ఏర్పాటు అయ్యిన మచ్చ బొల్లారం స్మశానవాటికను ప్రభుత్వం డంపింగ్ యార్డుగా మార్చింది.. అని జాతీయ మానవ హక్కుల కమిషన్ సైతం స్మశానవాటిక స్థలంలో డంపింగ్ నిలిపివేయాలి అని ఆదేశాల జారీ చేసి దాదాపు మూడు వారాలు గడుస్తున్నా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

కమిషనర్  వెంటనే ఒక నిర్ణయం తీసుకొని స్మశానవాటికలో చెత్త డంపింగ్ నిలిపివేయాలి అని జేఏసి అధ్యక్షులు ఉదయ్ ప్రకాష్ కోరారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు డోలి రమేష్, జేఏసి నాయకులు సుధాకర్ పడల, మెట్టు రాజశేఖర్, ప్రవీణ్, పుష్ప, పవన్ తదితరులు పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె లో కుటుంబ సమస్యలతో వివాహిత ఆత్మహత్యాయత్నం.
శుక్రవారం మదనపల్లెలో కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురైన 35 ఏళ్ల భవాని అనే వివాహిత పురుగుమందు తాగి...
By Pagadala Venkateswar 2026-02-20 11:31:51 0 190
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:రొంపిచర్ల లో అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలో అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తు...
By Kothuru Murali 2026-03-05 05:16:57 0 158
Tripura
Tripura's Road Connectivity Growth Driving Development
Tripura has made significant progress in infrastructure and road connectivity development,...
By Fathima Safa 2026-06-25 09:04:44 0 113
Telangana
Sahachari Strengthens Safety Awareness.|
● Focus on women and child safety through community participation ● Awareness session on cyber...
By Sidhu Maroju 2026-08-07 16:39:45 0 177
Andhra Pradesh
ప్రజా సమస్యలు పరిష్కరించడమే ద్యేయంగా "ప్రజా దర్బార్"..
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి తెలుగుదేశం పార్టీ...
By BABJI DADALA 2025-12-26 11:29:10 0 415
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com