Nara Lokesh: ఢిల్లీ చేరుకున్న నారా లోకేశ్... రేపు కేంద్రమంత్రులతో వరుస సమావేశాలు.

0
227

రాష్ట్ర అభివృద్ధి, నిధుల సమీకరణే ప్రధాన అజెండా

అమరావతి, విభజన హామీలపై చర్చించే అవకాశం

ఐటీ, విద్యా రంగాల విస్తరణపై ప్రత్యేక దృష్టి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ ఎంపీలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. కాగా, రాష్ట్రానికి సంబంధించిన కీలక అభివృద్ధి పనులపై చర్చించేందుకు, నిధులు రాబట్టేందుకు లోకేశ్ రేపు (ఫిబ్రవరి 4) కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశం కానున్నారు.

 

ఈ రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న లోకేశ్, బుధవారం పార్లమెంట్ భవనంలో పలువురు కేంద్ర మంత్రులతో కీలక భేటీలు జరపనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా రాష్ట్రంలో ఐటీ రంగం విస్తరణ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ఏర్పాటు, విద్యారంగ సంస్కరణలు వంటి అంశాలపై చర్చించనున్నారు. వీటితో పాటు ఏపీ విభజన చట్టంలోని హామీల అమలు, అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు, కొత్త ప్రాజెక్టుల మంజూరు వంటి విషయాలపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపనున్నారు.

 

ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయించిన రాయితీలు, మౌలిక సదుపాయాల కల్పనపై సంబంధిత శాఖల మంత్రులతో లోకేశ్ చర్చించనున్నారు. అలాగే, రాష్ట్రంలో పురోగతిలో ఉన్న రూ.92,649 కోట్ల పనుల వివరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై హై-స్పీడ్ రైల్వే కారిడార్ల అంశంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశమయ్యే అవకాశం కూడా ఉంది. కీలక సమావేశాల అనంతరం బుధవారం రాత్రికి ఆయన తిరిగి ఉండవల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు.

Search
Categories
Read More
Telangana
వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్ల బదిలీ
వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని కమలాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ఇ....
By Prashanth Goindla 2026-01-21 19:24:42 0 472
Andhra Pradesh
Perni Nani: పేర్ని నానికి నోటీసులు ఇవ్వండి: ఏపీ హైకోర్టు.
చంద్రబాబు, పవన్ లను దూషించిన కేసు పేర్ని నాని క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు నోటీసులు...
By Pagadala Venkateswar 2026-02-13 06:51:44 0 175
Telangana
ఆసిఫాబాద్ హైవే దిగ్బంధం. వట్టివాగు నీటి కోసం రైతులతో కలిసి బైఠాయించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి
 🎤(భారత్ ఆవాజ్ న్యూస్) ఆసిఫాబాద్ (బురుగుడ): వట్టివాగు ప్రాజెక్టు కాలువలకు సాగునీరు విడుదల...
By Chunarkar Jagadeesh 2026-08-17 15:17:31 0 212
Telangana
నిజామాబాద్: కార్మికుల జిత లు సెలంచకపోవడం బాధకరం
పండగ సమయంలో మున్సిపాల్ కార్మికుల వేతనాలుచెల్లించుకోవడం బాధా కరమణి ఎఐ టి యుసి జిల్లాప్రధాన...
By Sadaq Sadaq 2026-03-19 17:45:47 0 214
Andhra Pradesh
Chandrababu Naidu: పదేళ్లలో అమరావతి, గుంటూరు, విజయవాడ కలిసిపోతాయి: సీఎం చంద్రబాబు.
Chandrababu Naidu: పదేళ్లలో అమరావతి, గుంటూరు, విజయవాడ కలిసిపోతాయి: సీఎం చంద్రబాబు 30-01-2026 Fri...
By Pagadala Venkateswar 2026-01-31 06:23:21 0 345
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com