భారత విద్యార్థి ఫెడరేషన్ రౌండ్ టేబుల్ సమావేశం

0
229

*ప్రచూరణార్థం*

23/02/2026

 

భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆంధ్రప్రదేశ్, విజయవాడ 

 

విద్యాసంస్థల్లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేదించాలి -

 ఎస్ఎఫ్ఐ రౌండ్‌టేబుల్ సమావేశం లో తీర్మానం

 

 ఆంధ్రాయూనివర్శిటీలో గత వారం రోజులుగా ఆర్ఎస్ఎస్ మతోన్మాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలపై, విద్యాసంస్థల్లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేధించాలిని డిమాండ్ చేస్తూ స్థానిక మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధక్షులు పి.రామ్మోహన్ అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది.

 ఈ సమావేశంలో మాజీ ఎంఎల్‌సి కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ ఆంధ్రా యూనివర్శిటీ 100 ఏళ్ళ చరిత్ర కలిగిన విశ్వవిద్యాలయం అని అటువంటి విద్యాలయాన్ని మత విద్వేషాలతో రెచ్చగొట్టేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నాన్ని అడ్డకున్న విద్యార్థులకు అభినందనలు తెలియజేసారు. యూనివర్శిటీలోకి బయట వ్యక్తులు వచ్చి ఏకంగా ఆర్ఎస్ఎస్ శాఖ శిక్షణ శిబిరాన్నే నిర్వహిస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. విద్యార్థుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, విశ్వవిద్యాలయ విద్యార్థి ఖాసీంను మతం పేరుతో దూషించారని వాపోయారు. ఇవన్ని గమనిస్తున్న విద్యార్థులు విశ్వవిద్యాలయం ప్రశాంత వాతవరణంలో ఉండాలని విసి గారికి వినతిపత్రం ఇచ్చిన,అధికారులు సైతం స్పందించలేదని ఇది దారుణం అని అన్నారు. సెక్యూర్టీ ఆఫీసర్ ప్రొఫెసర్ ఇమ్మాన్యుల్‌ను క్రిస్టియన్ అని, ఆయన్ను సెక్యూర్టీ ఆఫీసర్ బాధ్యతల నుంచి తొలగించాలని వైస్ ఛాన్సలర్‌పై ఒత్తిడి చేసి రాజీనామ చేసేలాగా చేయడం దుర్మార్గం అన్నారు. వెంటనే తిరిగి విధుల్లో తీసుకోవాలని డిమాండ్ చేసారు.

 అదే విధంగా సామాజిక కార్యకర్త రావన్ (ప్రశ్న యూట్యుబర్) మాట్లాడుతూ ఎబివిపి ముసుగులో బయటి నుండి వచ్చిన ఆర్ఎస్ఎస్ వ్యక్తులు దుర్మర్గంగా ప్రవర్తించడం బాదకరం అన్నారు. యూనివర్శిటీలో ఇటువంటి మతతత్వ సంస్థలకు అనుమతులు ఉండకూడదని తెలిపారు. స్వాంతంత్య్రోద్యమంలో ఎటువంటి పాత్ర లేనటువంటి ఆర్ ఎస్ ఎస్ విద్యార్థి సంఘాలకు దేశభక్తి పాఠాలు నేర్పడం సిగ్గుచేటని అన్నారు. లాయర్స్ యూనియన్ నాయకులు సుంకర రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వర్శిటీలో విద్యార్థినీలను అసభ్య పదజాలంతో దూషిస్తూ వారిపై చెప్పులతో దాడికి దిగడం ఏమిటని అన్నారు. ఇవన్ని గమనిస్తున్న వర్శిటీ అధికారులు చోద్యం చూస్తున్నారు. బయటి వ్యక్తులు రాకుడదని నిభందనలు విధించిన మరసరోజు కూడా శిక్షణా శిబిరం నిర్వహించారని అయిన ఎటువంటి చర్యలు తీసకోకపోవడం దుర్మార్గం అన్నారు.

  ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసన్న కుమర్ మాట్లాడుతూ సెక్షన్ 30 అమల్లోవున్నప్పటికీ, దౌర్జన్యంగా లోపలకు చొరబడి దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు. శుక్రవారం నాడు ఎస్ఎఫ్ఐ , ఎఐఎసఎఫ్, సిఐటియు, ఎంఆర్‌పిఎస్ సంఘాల జెండా పోల్స్ ధ్వంసంచేశారు. రెచ్చగొట్టే నినాదాలు, ప్రసంగాలు చేశారు. ఈ దౌర్జన్యాలన్నీ వందలాది మంది పోలీసు సమక్షంలోనే సాగించారు. తీవ్ర ఆందోళన కల్గించే ఈ పరిణామాలను విద్యార్ధి సంఘాల మధ్య ఘర్షణగా చిత్రీకరించి, అసలు ఘటనలకు మూలమైన ఆర్ఎస్ఎస్ తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. యూనివర్శిటీ మాది, యూనివర్శిటీలో ఆర్ఎస్ఎస్ ఏ మత కార్యక్రమమైనా చేసుకుంటుదని ఎదురుదాడికి దిగుతున్నారు. వీరి అరాచకాలు ఇలాగే కొనసాగితే ఎయు విద్యార్ధుల చదువులకు తీవ్ర ప్రమాదం ఏర్పడటమే కాక మత విద్వేషాలు హెచ్చురిల్లుతాయి.

  ఈ రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం కొన్ని తీర్మానాలు చేశారు.

- ప్రశాంతంగా విజ్ఞానవంతంగా కొనసాగుతున్నటువంటి విద్యాలయాలలో ఆర్ఎస్ఎస్ మతోన్మాద చర్యలను అడ్డుకట్ట వేయాలని,ఆ సంస్థను నిషేధించాలని

- విశ్వవిద్యాలయాలలో లౌకికవాదాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని

- ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులపై ఆచార్యులపై దాడికి పాల్పడిన ఆర్ఎస్ఎస్ నూకలను అరెస్ట్ చేయాలని తీర్మానం చేశారు.

 భవిష్యత్తులో ఈ తీర్మానాల కోసం అన్ని ప్రజాస్వామ్య విద్యార్థి యువజన విద్యావేత్తల ఆధ్వర్యంలో పోరాటాలకు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి మాజీ ఎడిటర్ వెంకటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి వెంకటేశ్వర్లు, శాతవాహన కళాశాల మాజీ ప్రిన్సిపాల్, పెన్సర్స్ అసోసియేషన్ నాయకులు, ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ నాయకులు సూర్యారావు గారు, గిరిజన సంఘం అశోక్ కుమార్ గారు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నా సర్ జి, పిడిఎస్యు అధ్యక్ష కార్యదర్శులు భాస్కర్, రాజేష్,ఎస్ఎఫ్ఐ నాయకులు, పి డి ఎస్ ఓ నాయకులు, తదితరులు పాల్గొంటున్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
పిజీఆర్ఎస్ అర్జీలకు సకాలంలో నాణ్యతతో పరిష్కారం: డీఆర్ఓ.
మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పిజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి...
By Pagadala Venkateswar 2026-01-20 06:48:47 0 201
Andhra Pradesh
బోయకొండ దేవాలయంలో హుండీ లెక్కింపు జరిగింది ఈరోజు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని బోయకొండ గంగమ్మ ఆలయానికి గురువారం...
By Kothuru Murali 2026-01-08 12:40:58 0 211
Andhra Pradesh
దర్శి మున్సిపల్ పరిధిలో గురువారం సాయంత్రం, దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు అధికారులతో కలిసి దర్శి పట్టణం–పొదిలి
దర్శి మున్సిపల్ పరిధిలో గురువారం సాయంత్రం, దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి...
By Chennaiah Kati 2026-01-30 06:22:51 0 271
Andhra Pradesh
సీఎం చంద్రబాబును కలిసిన గద్దె రామ్మోహన్ ఎంపీ కేసినేని
*విజ‌య‌వాడ‌* *25-12-2025*   *సీఎం చంద్రబాబును కలిసిన ఎంపీ కేశినేని శివనాథ్,...
By Rajini Kumari 2025-12-25 07:43:31 0 283
Andhra Pradesh
పాత నేరస్తులకు మెగా కౌన్సెలింగ్: మహిళల గౌరవానికి ప్రతిజ్ఞ.
అన్నమయ్య జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం మదనపల్లిలో ‘మెగా కౌన్సెలింగ్ - పరివర్తన...
By Pagadala Venkateswar 2026-04-23 03:38:55 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com