మహిళలు బాలికల రక్షణ దేయంగా పోలీసుల అవగాహన కార్యక్రమం

0
213

కృష్ణా జిల్లా పోలీస్ 

 

*మహిళలు, బాలికల రక్షణే ధ్యేయంగా రక్షణ చట్టాలు మరియు మాదక ద్రవ్యాల పై అవగాహన కల్పిస్తున్న కృష్ణాజిల్లా పోలీసులు.*

 

మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది, శక్తి టీం మరియు ఈగల్ టీం సభ్యుల ఆధ్వర్యంలో మచిలీపట్నంలో గల విజయానంద డిగ్రీ కాలేజీ నందు విద్యార్థినీ విద్యార్థులకు మాదక ద్రవ్యాల వ్యసనం, సైబర్ క్రైమ్, పోక్సో చట్టం, శక్తి యాప్ యొక్క ఆవశ్యకత మరియు ట్రాఫిక్ నిబంధనలు వంటి అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.

 

 మాదక ద్రవ్యాల వలన శారీరక, మానసిక మరియు సామాజికంగా కలిగే తీవ్రమైన దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించబడింది.

 

అదనంగా సురక్షితమైన ఇంటర్నెట్ వినియోగం, అనుమానాస్పద లింకులు, ఫేక్ అకౌంట్లు, ఆన్‌లైన్ మోసాల నుండి జాగ్రత్తలు తీసుకోవడం వంటి విషయాలు తెలియజేశారు.

 

పిల్లల రక్షణ కోసం అమలులో ఉన్న పోక్సో చట్టంలోని ముఖ్య నిబంధనలు, చట్టపరమైన రక్షణలు మరియు సహాయ మార్గాల గురించి కూడా విద్యార్థులకు తెలియజేయబడింది.

 

ప్రతి ఒక్కరు శక్తి యాప్ను కలిగి ఉండాలని దాని యొక్క వినియోగం మరియు ఆవశ్యకతల గురించి విద్యార్థిని విద్యార్థులకు తెలియజేయడం జరిగినది.

 

రహదారి భద్రత నియమాలు పాటించడం వల్ల జరిగే ప్రమాదాలను నివారించవచ్చని తెలియజేయడం జరిగినది.

 

కార్యక్రమం మొత్తం సమయంలో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని ప్రశ్నలు అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకోవడంతో, ఈ అవగాహన కార్యక్రమం వారి భద్రత, బాధ్యత మరియు చట్టపరమైన అవగాహనను పెంపొందించే దిశగా ఎంతో ఉపయోగకరంగా నిలిచింది.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగునూరులో ప్రారంభమైన రోడ్డు పనులు కొత్తూరు మురళి
పుంగనూరు పట్టణంలో అసంపూర్తిగా నిలిచిపోయిన పుంగనూరు-బెంగళూరు రహదారి పనులు సోమవారం ప్రారంభమయ్యాయి....
By Kothuru Murali 2026-05-18 15:23:56 0 110
Andhra Pradesh
దుబాయ్ పర్యటనలో మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథులుగా క్రిస్మస్ వేడుకలు
దుబాయ్ పర్యటనలో మంత్రి నిమ్మల రామానాయుడు పాయింట్స్:   దుబాయ్ లో ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో...
By Rajini Kumari 2025-12-22 07:30:33 0 236
Andhra Pradesh
సిద్ధివారిపాలెంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించిన మాజీ MLA "పర్వత"...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం సిద్ధివారిపాలెం గ్రామంలో ప్రత్తిపాడు మాజీ...
By BABJI DADALA 2026-01-12 02:27:10 0 395
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:30:54 0 81
Andhra Pradesh
పుంగునూరు:పుంగనూరులో ఫుడ్ సేఫ్టీ అధికారి పరిశీలన
పుంగనూరు పట్టణంలో బుధవారం మధ్యాహ్న భోజనంలో బల్లి పడిన ఘటనపై ఫుడ్ ఇన్స్పెక్టర్ గురు లక్ష్మి...
By Kothuru Murali 2026-04-03 09:20:17 0 262
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com