కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం గద్దె క్రాంతి కుమార్

0
209

*కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం*

 

      *టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్*

 

 

            పార్టీకి ప్రాణం, నాయకత్వానికి బలం కార్యకర్తలని బూత్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ జెండాను గర్వంగా ఎగరేసేది, ప్రజల మధ్య పార్టీ భావజాలాన్ని తీసుకెళ్లేది కార్యకర్తలేనని అటువంటి తాము ఎప్పుడు అండగా ఉంటామని టిడిపి యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ పేర్కొన్నారు.

 

            సోమవారం ఉదయం 19వ డివిజన్ జార్జిపేట ఏరియాలో గద్దె క్రాంతి కుమార్ పర్యటించి, పార్టీ కార్యకర్త వల్లభదాసు శాయమ్మ మనవరాలు వల్లభదాసు వినీతకు కాలేజీ ఫీజులు నిమిత్తం 20 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని గద్దె క్రాంతి సొంత నిధులు నుంచి అందజేశారు.

 

             ఈ సందర్బంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనూ, సాధారణ రోజుల్లోనూ, ప్రజా సమస్యలపై పోరాటాల్లోనూ ముందుండేది కార్యకర్తలే అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్తకు, వారి కుటుంబాలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు. కార్యకర్తకు కష్టం వస్తే అది పార్టీకి వచ్చిన కష్టంగా భావిస్తూ ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనుకోని పరిస్థితులు — ఏదైనా ఎదురైనా ముందుండి సహాయం చేయడం మా బాధ్యతగా భావిస్తున్నామన్నారు. కార్యకర్త కుటుంబం సురక్షితంగా, బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందన్నారు. పార్టీ కోసం శ్రమించే ప్రతి కార్యకర్త గౌరవం కాపాడటం, వారి కృషిని గుర్తించడం, అవసరమైన సమయంలో తోడుగా నిలవడం నాయకులు బాధ్యత అన్నారు. పార్టీకి కార్యకర్తలే మా అసలు సంపద అని వారి త్యాగం, నిబద్ధత, విశ్వాసమే పార్టీ విజయానికి పునాదని కార్యకర్తల కుటుంబం అంటే మా కుటుంబమే అన్న భావంతో ఎల్లప్పుడూ వారితో ఉంటామని గద్దె క్రాంతి అన్నారు.

 

             ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు భాగం సాయి ప్రసాద్, ఎస్. ఫిరోజ్, పరిసపోగు విజయ్, దూపాటి శాంతకుమారి, ఒలేటి పావని, పల్లి మాధవి, కొండపల్లి రమేష్ తదితరులు ఉన్నారు.

Search
Categories
Read More
Telangana
భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా అంబేద్కర్ కు ఘన నివాళి : ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
     మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : 1949 నవంబర్ 26 వ తేదీన భారత రాజ్యాంగాన్ని...
By Sidhu Maroju 2025-11-26 06:46:55 0 214
Andhra Pradesh
కొండెక్కిన కోడి దిగింది కేజీ 270
*కొండేక్కిన కోడి...దిగింది..!!* 🐓 *కిలో 270 కి బ్రాయిలర్ చికెన్..వంద రూపాయలు తగ్గిన చికెన్ రేటు*...
By Rajini Kumari 2026-03-30 04:55:55 0 218
Andhra Pradesh
మిషన్ హార్టీ విజన్ తో ఉద్యాన సాగు విస్తరణ
జిల్లాలో మిషన్ హార్టీ విజన్ అమలు ద్వారా ఉద్యాన పంటల సాగును విస్తరించి రైతులకు నిరంతర ఆదాయం...
By Boiena Rajesh 2026-03-05 14:45:24 0 244
Andhra Pradesh
తక్షణమే కోసిగి ఇంటిగ్రేడ్ హాస్టల్ ఎత్తివేసే నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం విరమించుకోవాలి
కోసిగి మండలంలో ఉన్న సంక్షేమ బాలుర వసతిగృహం (ఇంటిగ్రేటెడ్) హాస్టల్‌ను ఎత్తివేసేందుకు కూటమి...
By Boya Dasthagiri 2026-07-28 14:07:43 0 141
Andhra Pradesh
Sub register get promotion to registarar.
ఏపీ లో *18 మంది సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతి*   రిజిస్ట్రేషన్,...
By G k Nookala 2026-02-18 09:56:22 0 204
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com