మౌలిక వసతులు లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు

0
205

*మౌలిక వసతులు లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు*

 

 

 *సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బంది భక్తులతో మర్యాదగా వ్యవహరించాలి*

 

 

 *అమ్మవారి ప్రసాదాల నాణ్యత మరింత పెంపొందించాలి*

 

 

 *దుర్గగుడి కాంట్రాక్టర్లకు అధికారులకు ఇంజనీరింగ్ అధికారులకు హెచ్చరికలు జారీ చేసిన ఈవో శీనా నాయక్*

 

 

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి వచ్చే భక్తుల పట్ల క్షేత్రస్థాయి సిబ్బంది, కాంట్రాక్టర్ల అనుచిత ప్రవర్తన వల్ల ఆలయ ప్రతిష్ఠ మసకబారుతోందని ఈవో శీనా నాయక్ పేర్కొన్నారు.

 

సోమవారం ఉదయం ఆయన ఆలయ సిబ్బంది, సెక్యూరిటీ, వివిధ సేవల కాంట్రాక్టర్లతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, భక్తులతో సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బంది, వివిధ సేవల కాంట్రాక్టర్లు ప్రవర్తన వలన దేవస్థానంకు అపకీర్తి కలుగుతుందని,

దేవస్థానం తరపున భక్తులకు అత్యుత్తమ దర్శనం, రుచికరమైన ప్రసాదం, క్యూ లైన్లలో మౌలిక వసతులు కల్పించడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా భక్తులు సంతృప్తికి వివిధ సేవల కాంట్రాక్టర్లు గండి కొడుతున్నారని ఈవో తెలిపారు.

 

 దేవస్థానం కల్పిస్తున్న ఈ గొప్ప వసతులన్నింటినీ కొబ్బరికాయ కొట్టే చోట రుసుము వసూలు, క్లోక్ రూమ్ వద్ద, చెప్పుల స్థాండ్ వద్ద అదనపు రుసుము వసూళ్లు, పార్కింగ్ కాంట్రాక్టర్ల దురుసు ప్రవర్తన వలన నీరుగారుస్తోందని ఈవో పేర్కొన్నారు. 

 

"ఒక భక్తుడు దర్శనం ముగించుకుని సంతోషంగా బయటకు వచ్చినా.. చెప్పుల స్టాండ్ వద్దో, పార్కింగ్ వద్దో లేదా లగేజ్ కౌంటర్ వద్దో అక్కడి సిబ్బంది దురుసుగా మాట్లాడితే, ఆ భక్తుడు మొత్తం దేవస్థానంపైనే అసంతృప్తి పెంచుకుంటాడు" అని శీనా నాయక్ వివరించారు.

 

దేవస్థానం ఎంత కష్టపడి భక్తుల కోసం ఏర్పాట్లు చేసినా, కొందరు కాంట్రాక్టర్ల ప్రవర్తన వల్ల 'దుర్గగుడిలో భక్తులకు గౌరవం లేదు' అనే చెడ్డ పేరు వస్తోందని, ఇది ఆలయ బ్రాండ్ ఇమేజ్‌ను తీవ్రంగా దెబ్బతీస్తోందని ఆయన వివరించారు.

 

భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మరియు వారి అసంతృప్తి ఆర్ టి జీ ఎస్ 

 ద్వారా నేరుగా ప్రభుత్వం దృష్టికి వెళ్తోందని, దీనివల్ల రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల ర్యాంకింగ్‌లో ఇంద్రకీలాద్రి వెనుకబడిపోతోందని ఆయన గణాంకాలతో సహా వివరించారు.

 

భక్తులు రద్దీ సమయంలో భక్తులు ఒత్తిడిలో ఉంటారు, వారిని గద్దించడం లేదా విసుక్కోవడం వంటివి చేయకూడదని,

సెక్యూరిటీ, శానిటేషన్, ఆలయ సిబ్బంది కాంట్రాక్టర్లు తమను తాము యజమానులుగా భావించకుండా, అమ్మవారి సేవకులుగా భావించి భక్తులకు సహకరించాలని ఈవో సూచించారు.

 

 

 *భక్తులతో అమర్యాదిగా ప్రవర్తించే కాంట్రాక్టర్లపై చర్యలు*

 

 

భక్తుల పట్ల ప్రవర్తన లో మార్పు రాకపోతే ఉపేక్షించేది లేదు...అని ఈవో స్పష్టం చేస్తూ, భక్తుల పట్ల అమర్యాదగా ప్రవర్తించే కాంట్రాక్టర్ల లైసెన్స్‌లను రద్దు చేయడంతో పాటు, వారి డిపాజిట్ మొత్తాన్ని పెనాల్టీగా జప్తు చేయాలని ఆదేశించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మర్రిపాలెం లో ఘనంగా నూతన విగ్రహ ప్రతిష్ట
*మర్రిపాలెంలో ఘనంగా నూతన విగ్రహాల ప్రతిష్ట*   *ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్...
By Rajini Kumari 2026-04-23 13:15:09 0 201
Andhra Pradesh
పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం నేడు మృత్యుంజయ హోమం.
  పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం నేడు మృత్యుంజయ హోమం  Andhra Mrithyunjaya Homam on April...
By Pagadala Venkateswar 2026-04-21 03:34:11 0 142
Telangana
శ్రీ లక్ష్మీనగర్‌లో సీసీ రోడ్ల పనుల పరిశీలన.|
"కాలనీ అధ్యక్షుడి వినతితో రూ.51 లక్షల నిధులు.. ప్రారంభమైన సీసీ రోడ్ల నిర్మాణం" మేడ్చల్...
By Sidhu Maroju 2026-07-13 09:06:12 0 126
Telangana
బాచుపల్లిలో ఫార్మా బస్సు బోల్తా 10 మందికి గాయాలు
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీకి చెందిన మినీ బస్సు అదుపుతప్పి బోల్తా...
By Ponnala Srinivasrao 2026-03-17 08:19:25 0 273
Telangana
ఎం.పి.ఈటెల ప్రెస్ మీట్
 మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్   రైలు నిలయంలో సంబంధిత అధికారులందరితో...
By Sidhu Maroju 2025-05-31 06:03:45 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com