డేవిడ్ కింగ్ మృతికి బిబిఎస్ కమిటీ ఘన నివాళులు పాలచర్లలో సంతాప సభలో దైవ సేవకుల భావోద్వేగ స్మరణ

0
1K

ఇటీవల పరమపదించిన బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ కమిటీ సలహాదారులు, ఆత్మీయులు ఎస్. డేవిడ్ కింగ్ స్మారకార్థం గురువారం పాలచర్లలో ఘన సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రీస్తు సంఘానికి చెందిన పలువురు ప్రముఖ దైవ సేవకులు, బైబిల్ స్కూల్ గ్రాడ్యుయేట్స్, బంధువులు, స్నేహితులు పాల్గొని ఆయన సేవలను కృతజ్ఞతతో స్మరించారు.

సభ ప్రారంభంలో డేవిడ్ కింగ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, రెండు నిమిషాల మౌనప్రార్థన నిర్వహించారు. అనంతరం వక్తలు వరుసగా మాట్లాడుతూ ఆయన ఆధ్యాత్మిక నిబద్ధత, సేవా తపన, సౌమ్య స్వభావాన్ని గుర్తుచేశారు. బిక్కవోలు బైబిల్ స్కూల్ రెండవ బ్యాచ్‌లో శిక్షణ పొందిన డేవిడ్ కింగ్, తన జీవితాన్ని దైవ సేవకు అంకితం చేసిన వ్యక్తి అని పేర్కొన్నారు.

బిక్కవోలు బైబిల్ స్కూల్ గ్రాడ్యుయేట్స్ కమిటీ (న్యూ జెనరేషన్ చారిటబుల్ సొసైటీ) అధ్యక్షుడు, జర్నలిస్ట్ గుడివాడ బాబ్జి మాట్లాడుతూ, డేవిడ్ కింగ్ మంచి సలహాదారుడిగా అనేక మందికి మార్గనిర్దేశం చేశారని తెలిపారు. సంఘ సేవలో ఆయన ఎప్పుడూ ముందుండి పనిచేసేవారని, యువ దైవ సేవకులను ప్రోత్సహిస్తూ ఆధ్యాత్మికంగా బలపరిచారని చెప్పారు.

దైవ సేవకులు ఎస్. జాన్ (రాజమండ్రి), పి.ఎస్.ఆర్. జయపాల్ (ర్యాలీ), బి. జాషువా (ఏలూరు), ఎం. జాన్ డీన్ (సింగంపల్లి), ఎం. సూర్యారావు (పెదపూడి), ఎం. జయరాజు (తణుకు), బి.సి.హెచ్. కోటేశ్వరరావు (సింగంపల్లి), టి. నతానియేలు (రాయవరం), వి. రాజా విజయ్ కుమార్ (రాజమండ్రి), కమిటీ కోశాధికారి వై. నాగేశ్వరరావు తదితరులు తమ సందేశాల ద్వారా ఆయన సేవలను స్మరించారు. సేవలో వినయం, మాటల్లో మాధుర్యం, వ్యవహారంలో స్పష్టత ఆయన ప్రత్యేక లక్షణాలని పేర్కొన్నారు.

సభలో పాల్గొన్న బిబిఎస్ గ్రాడ్యుయేట్స్, బంధువులు, సహచరులు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డేవిడ్ కింగ్ సేవలు ఎల్లప్పుడూ స్మరణీయమని, ఆయన చూపిన ఆధ్యాత్మిక మార్గం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని వక్తలు పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాల అన్నా క్యాంటీన్‌కు రెండవ స్థానం – ప్రతిష్ఠాత్మక విజయం
చీరాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అన్నా క్యాంటీన్ పథకం ద్వారా...
By Gadiyapudi Narendra 2026-02-18 16:37:52 0 237
Telangana
మహంకాళి సన్నిధిలో సీపీ సజ్జనర్ ఐపీఎస్.|
● లాల్‌దర్వాజా మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణలో పాల్గొన్న సీపీ ● నగర ప్రజలందరిపై...
By Sidhu Maroju 2026-07-31 10:08:02 0 124
SURAKSHA
T. N. Venkatesh: Driving Tamil Nadu's Growth Forward
A distinguished 2001-batch IAS officer of the Tamil Nadu cadre, T. N. Venkatesh has built a...
By Lokeshwari Panthadi 2026-07-20 08:28:04 0 141
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు పట్టణం లో న్యాయవాదుల సంఘం ఎన్నికల్లో ఘర్షణ
పుంగనూరు పట్టణంలో న్యాయవాదుల సంఘం కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రక్రియ...
By Kothuru Murali 2026-02-14 07:51:48 0 194
SURAKSHA
పల్లెల్లో ఖాకీల పలకరింపు: గ్రామ దర్శిని సక్సెస్
శాంతిభద్రతల పరిరక్షణ కేవలం నగరాలకే పరిమితం కాదని తెలంగాణ పోలీసులు నిరూపిస్తున్నారు. ‘గ్రామ...
By Kalaga Sailaja 2026-06-25 10:06:23 0 199
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com