#Big fan of @urstrulymahesh ❤️🌟
#మంచిగా ఉండేవాళ్ళని ఆదరిస్తా, చెడుగా ఉండేవాళ్ళని అణచివేస్తా 😐
#అన్ని కులాలను, మతాలను గౌరవించే మనస్తత్వం 🤩
#మంచిగా ఉండేవాళ్ళని ఆదరిస్తా, చెడుగా ఉండేవాళ్ళని అణచివేస్తా 😐
#అన్ని కులాలను, మతాలను గౌరవించే మనస్తత్వం 🤩
-
379 Posts
-
3 Photos
-
23 Videos
-
Reporter at Vizianagaram
-
Studied UNDER GRADUATED at Srichaitanya ITCClass of ITI, srichaitanya ITC
-
Followed by 1 people
-
Experience
2 Years -
Language
Telugu
-
Current Position
Reporter
-
State
Andhra Pradesh (AP) -
Assembly Constituency
Bobbili -
District
Vizianagaram -
Mandal | Tahasil | Sub Division
Bobbili
Pinned Post
Please log in to like, share and comment!
Recent Updates
-
రూ.25,08,000ల మోసంరైల్వేలో టీటీ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.25,08,000లు కాజేసిన ఇద్దరు వ్యక్తులపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు వల్లంపూడి ఎస్సై సుదర్శన్ తెలిపారు. వేపాడ మండలం పీకేఆర్ పురం గ్రామానికి చెందిన N. సన్యాసినాయుడు కుమారుడు రాజేశు ఉద్యోగం ఇప్పిస్తామని బొండపల్లి మండలం వంపల్లికి చెందిన గౌరీ శంకర్, గంట్యాడ మండలం పెదవేమలికి చెందిన సతీశ్ మోసానికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదైంది.0 Comments 0 Shares 85 Views 0 Reviews
-
ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై రోడ్డు అధ్వానంసీతానగరం ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై రహదారిపై పెద్ద పెద్ద గోతులతో అధ్వానంగా ఉండటంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ బ్రిడ్జిపై నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.గతంలో గోతులలో పడి ప్రమాదాలు జరిగే సందర్భాలు అనేకం ఉన్నాయి. వర్షాలకు గోతులు నీరు చేరి వాహనదారులకు గోతులు కనబడని కారణంగా మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు వాపోతున్నారు.0 Comments 0 Shares 100 Views 0 Reviews
-
టీడీపీలో చిన్న శ్రీనుకు కీలక పదవి?జిల్లా YCP అధ్యక్ష పదవికి రాజీనామా చేసి చిన్న శ్రీను TDPలో చేరడం జిల్లా రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన చేరికతో TDPలో భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై చర్చ మొదలైంది. ఇదే సమయంలో శ్రీనుకు జిల్లా TDP బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది. కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతకు కీలక బాధ్యతలు ఇస్తే స్థానిక నాయకత్వంలో సమీకరణాలు ఎలా మారుతాయన్న దానిపై TDP శ్రేణుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.0 Comments 0 Shares 130 Views 0 Reviews
-
చిన్న శ్రీను చేరికపై పల్లా క్లారిటీచిన్న శ్రీనును స్థానిక TDP నాయకత్వం అంగీకారంతోనే పార్టీలోకి తీసుకున్నామని AP TDP అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. పార్టీలో చేరినవారు టీడీపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. 'నదులే సముద్రంలో కలవాలి' అని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు.యువత సామర్థ్యంతోపాటు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు.0 Comments 0 Shares 107 Views 0 Reviews
-
రోడ్డుకు అడ్డంగా కూలిన చెట్టు... రాకపోకలకు అంతరాయంసీతంపేట మండలం కడగండి ప్రధాన రహదారిపై తెల్లవారుజామున భారీ చెట్టు కూలిపోయింది. వర్షం కారణంగా చెట్టు నేలకొరిగినట్లు స్థానికులు తెలిపారు. చెట్టు కొమ్మలు, విద్యుత్ తీగలు రోడ్డుపై పడటంతో అత్యవసర వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అధికారులు వెంటనే చెట్టును తొలగించి, విద్యుత్ తీగలను సరిచేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.0 Comments 0 Shares 108 Views 0 Reviews
-
వృద్ధుడు అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదుసీతంపేట మండలం పెద్దూరు గ్రామానికి చెందిన ఆరిక సత్యం(60) రెండు రోజులుగా కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యులు సీతంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇప్పటికీ ఆచూకీ లభించలేదు. ఆయన ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు లేదా 8008698577 నంబరుకు సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.0 Comments 0 Shares 102 Views 0 Reviews
-
సాలూరులో మోస్తరు వర్షాలుపార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. చాలా కాలంగా వర్షాలు లేక భూగర్భ జలాలు ఇంకిపోయి బోరు బావులలో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది. వ్యవసాయదారులు వర్షం లేక పంటలు ఎండిపోయి తీవ్ర నష్టాలు జరిగినందున ఈ వర్షంతో కొంత ఊరట లభించిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.0 Comments 0 Shares 98 Views 0 Reviews
-
చిన్న శ్రీను ఎఫెక్ట్.. బొత్సకు నో టెన్షన్!చిన్న శ్రీను టీడీపీలో చేరినా విజయనగరం జిల్లాలో బొత్స పట్టు సడలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దశాబ్దాలుగా ఉన్న వ్యక్తిగత సంబంధాలు, క్యాడర్తో అనుబంధం ఆయనకు ప్రధాన బలమని చెబుతున్నారు. తాజా పరిణామాలపై వెంటనే పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించడం బొత్స రాజకీయ చతురతకు నిదర్శనంగా విశ్లేషిస్తున్నారు. ఒక్క నేత పార్టీ మారినంత మాత్రాన ఆయన ప్రాబల్యానికి ముప్పులేదని పేర్కొంటున్నారు. దీనిపై మీ కామెంట్..!0 Comments 0 Shares 103 Views 0 Reviews
-
‘సిరమ్మ' చుట్టూ రాజకీయ ఆసక్తి!విజయనగరం రాజకీయాల్లో సిరి సహస్ర పేరు ఆసక్తి రేపుతోంది. ఆమె ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. 2023లో బడ్డుకొండ ప్రదీప్ నాయుడును వివాహం చేసుకున్నారు. 'చిన్న శ్రీను సోల్జర్స్' సంస్థతో సేవ చేస్తూ గుర్తింపు పొందారు. అభిమానులు ఆమెను 'సిరమ్మ'గా పిలుస్తారు. తండ్రితో కలిసి TDPలో చేరడంతో ఆమె రాజకీయ భవిష్యత్తుపై చర్చ మొదలైంది. కుమార్తెకు పొలిటికల్గా కీలక స్థానం కల్పించడమే చిన్న శ్రీను లక్ష్యంగా చెబుతున్నారు.0 Comments 0 Shares 110 Views 0 Reviews
-
పాముకాటుకు గురైన గిరిజనుడుబొబ్బిలి మండలం ఎరకందొరవలస గిరిజన గ్రామానికి చెందిన కె. నూకరాజు బుధవారం రాత్రి పాముకాటుకు గురయ్యడు. లెట్రిన్ కు వెళ్ళే సమయంలో పాము కాటేసిందని తన అల్లుడు గోపీకి తెలియజేయగా అతను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు.ప్రధమ చికిత్స అనంతరం బొబ్బిలి నుండి మెరుగైన చికిత్స కొరకు వైద్యుల సూచన మేరకు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కరెంటు లేని సమయంలో వెళ్లడం వల్లే పాముకాటుకు గురయ్యాడని నూకరాజు...0 Comments 0 Shares 100 Views 0 Reviews
-
బొత్స ముందు అగ్ని పరీక్ష!విజయనగరం (D) రాజకీయాల్లో బొత్స కుటుంబానికి ఊహించని సవాల్ ఎదురైంది. మేనల్లుడు చిన్న శ్రీను పార్టీని వీడటంతో బొత్స సత్యనారాయణ రాజకీయ ప్రాబల్యానికి పరీక్ష మొదలైంది. తన కుమార్తె అనూషను జిల్లా పరిషత్ పీఠంపై కూర్చోబెట్టాలని బొత్స భావిస్తుండగా, చిన్న శ్రీను తన కుమార్తె సిరిని అదే పీఠంపై నిలబెట్టేందుకు వ్యూహం రచిస్తున్నారు. దీంతో రాబోయే స్థానిక పోరు మామా–మేనల్లుడి ప్రతిష్ఠాత్మక సమరంగా మారే ఛాన్స్...0 Comments 0 Shares 115 Views 0 Reviews
-
చిన్న శ్రీను చేరిక వెనుక సానా సతీశ్?YCPకి చిన్న శ్రీను రాజీనామా వెనుక కుమార్తె సిరిసహస్ర రాజకీయ భవిష్యత్తే కారణమన్న ప్రచారం సాగుతోంది. జడ్పీ ఛైర్పర్సన్ పదవికి బొత్స తన కుమార్తె అనూషను ప్రకటించడంతో మనస్తాపానికి గురైన ఆయన కూతురితో కలిసి పార్టీ మారినట్లు వార్తలొస్తున్నాయి. శ్రీనును TDPలోకి తీసుకురావడంలో MP సానా సతీశ్ కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. మంగళవారం తర్వాత మంచిరోజుల్లేవన్న ఉద్దేశంతోనే హడావుడిగా పార్టీ మారినట్లు తెలుస్తోంది.0 Comments 0 Shares 134 Views 0 Reviews
-
మేనల్లుడి పార్టీ మార్పుపై బొత్స స్పందనమజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పార్టీ మారడంపై వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందిచారు. మనుషులకు స్వార్థం ఉండటం సహజమని, రాజకీయాల్లో పార్టీలు శాశ్వతం, వ్యక్తులు కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఫిరాయింపులు సాధారణమేనని ఆయన స్పష్టం చేశారు.0 Comments 0 Shares 143 Views 0 Reviews
-
టీడీపీలోకి మజ్జి శ్రీను?అమరావతి టీడీపీ కార్యాలయానికి మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) చేరుకున్నట్లు సమాచారం. కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తుంది. వైసీపీకి రాజీనామా చేసిన మజ్జి శ్రీనివాసరావు, తాజాగా టీడీపీలో చేరుతారనే సమాచారంతో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.0 Comments 0 Shares 137 Views 0 Reviews
-
రోడ్డు పక్కన చెత్త వేయకుండా చర్యలురోడ్డు పక్కన చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం జగన్నాధపురం రోడ్డు పక్కన ఉన్న చెత్తను మంగళవారం తొలగించి ట్రాక్టర్తో తరలించారు. రోడ్డు పక్కన చెత్త వేస్తే చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేయాలని కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలను కోరారు. ఆయనతో స్వచ్ఛ భారత్ మిషన్ కో ఆర్డినేటర్ సుధాకర్ ఉన్నారు.0 Comments 0 Shares 146 Views 0 Reviews
-
బొబ్బిలి బైపాస్ రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు తొలగించండి: కమిషనర్బొబ్బిలి పట్టణంలోని బైపాస్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించాలని కమిషనర్ లాలం రామలక్ష్మి ఆదేశించారు. మహారాణిపేట, గొల్లవీధి, బైపాస్ రోడ్డు ప్రాంతాలలో మంగళవారం పర్యటించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దాడితల్లి ఆలయం వరకు రోడ్డు నిర్మాణానికి అడ్డంకులు లేకుండా ఆక్రమణలు తొలగించాలన్నారు. పట్టణంలో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేయాలని, కాలువలలో పూడికలు తీయాలన్నారు.0 Comments 0 Shares 134 Views 0 Reviews
-
వైసీపీకి చిన్న శ్రీను రాజీనామామాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను (మజ్జి శ్రీనివాసరావు) వైసీపీకి రాజీనామా చేశారు. విజయనగరం జిల్లా అధ్యక్షుడు, భీమిలి సమన్వయకర్త పదవులకూ రిజైన్ చేశారు. రాజీనామా లేఖను పార్టీ చీఫ్ జగన్కు పంపారు. ప్రస్తుతం ఆయన విజయనగరం ZP ఛైర్మన్గా ఉన్నారు. జిల్లాలో ఆయనకు మంచి పట్టు ఉంది. ఏ పార్టీలోకి వెళ్లేది మజ్జి శ్రీను ప్రకటించలేదు.0 Comments 0 Shares 145 Views 0 Reviews
-
పేకాట స్థావరంపై పోలీసుల దాడిబలిజిపేట (M) నారంనాయుడు వలస గ్రామ శివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై బలిజిపేట పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో 5 మంది నిందితులను అదుపులోకి తీసుకుని రూ.8,220 స్వాధీనం చేసుకున్నారు.ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేశ్ తెలిపారు. అక్రమ జూదం, మద్యం, గంజాయి తదితర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.0 Comments 0 Shares 145 Views 0 Reviews
More Stories