• పోలవరంనిర్మాణంలో అత్యంత కీలకమైన 1372 మీటర్ల 'డయాఫ్రం వాల్' ను తక్కువ సమయంలోనే పూర్తి చేయగలిగింది కూటమి ప్రభుత్వం. జగన్ నిర్లక్ష్యం కారణంగా డయాఫ్రం వాల్ దెబ్బతినడంతో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ డి-వాల్ పూర్తి కావడంతో చంద్రబాబుగారు చెప్పినట్టు 2027 పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి అవుతుందని .

    డయాఫ్రం వాల్ పూర్తి – లక్ష్యం దిశగా పోలవరం.

    రికార్డు స్థాయి పనులు

    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తూ, ఇంజనీర్లను పరుగులు పెట్టించడం వల్లనే ఈ అసాధ్యమైన పని సాధ్యమైంది. గత ఐదేళ్లలో కేవలం 3.84 శాతం పనులు మాత్రమే జరిగితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనుల వేగం ఊహించని రీతిలో పెరిగింది. ఈ ఏప్రిల్ నాటికి డయాఫ్రం వాల్ పూర్తి కావడంతో, ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ నిర్మాణం పూర్తి చేయడానికి మార్గం సుగమమైంది. జగన్ హయాంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు ఐదేళ్లు వెనక్కి వెళ్లగా, ఇప్పుడు చంద్రబాబు తన అనుభవంతో ఆ కాలాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

    గోదావరి పుష్కరాలే లక్ష్యం – తొలి దశకు సిద్ధం

    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదుపరి లక్ష్యం స్పష్టంగా ఉంది. 2027లో రాబోయే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం తొలి దశను పూర్తి చేసి, జాతికి అంకితం చేయాలని ఆయన కంకణం కట్టుకున్నారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు పోలవరం జలాలతో అభిషేకం చేయాలనే సంకల్పంతో పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ, పునరావాస పనులకు నిధులు విడుదల చేసి బాధితులను ఆదుకుంటున్నారు. 2026 చివరి నాటికి ప్రధాన పనులన్నీ పూర్తి చేసి, ఏపీ ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
    పోలవరంనిర్మాణంలో అత్యంత కీలకమైన 1372 మీటర్ల 'డయాఫ్రం వాల్' ను తక్కువ సమయంలోనే పూర్తి చేయగలిగింది కూటమి ప్రభుత్వం. జగన్ నిర్లక్ష్యం కారణంగా డయాఫ్రం వాల్ దెబ్బతినడంతో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ డి-వాల్ పూర్తి కావడంతో చంద్రబాబుగారు చెప్పినట్టు 2027 పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి అవుతుందని . డయాఫ్రం వాల్ పూర్తి – లక్ష్యం దిశగా పోలవరం. రికార్డు స్థాయి పనులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తూ, ఇంజనీర్లను పరుగులు పెట్టించడం వల్లనే ఈ అసాధ్యమైన పని సాధ్యమైంది. గత ఐదేళ్లలో కేవలం 3.84 శాతం పనులు మాత్రమే జరిగితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనుల వేగం ఊహించని రీతిలో పెరిగింది. ఈ ఏప్రిల్ నాటికి డయాఫ్రం వాల్ పూర్తి కావడంతో, ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ నిర్మాణం పూర్తి చేయడానికి మార్గం సుగమమైంది. జగన్ హయాంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు ఐదేళ్లు వెనక్కి వెళ్లగా, ఇప్పుడు చంద్రబాబు తన అనుభవంతో ఆ కాలాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి పుష్కరాలే లక్ష్యం – తొలి దశకు సిద్ధం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదుపరి లక్ష్యం స్పష్టంగా ఉంది. 2027లో రాబోయే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం తొలి దశను పూర్తి చేసి, జాతికి అంకితం చేయాలని ఆయన కంకణం కట్టుకున్నారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు పోలవరం జలాలతో అభిషేకం చేయాలనే సంకల్పంతో పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ, పునరావాస పనులకు నిధులు విడుదల చేసి బాధితులను ఆదుకుంటున్నారు. 2026 చివరి నాటికి ప్రధాన పనులన్నీ పూర్తి చేసి, ఏపీ ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
    0 Comments 0 Shares 180 Views 0 Reviews
  • రాయచోటి శ్రీ శనీశ్వర శ్రీ లింగేశ్వర దేవస్థానం నందు పండు వెన్నెలలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది🙏🏽
    రాయచోటి శ్రీ శనీశ్వర శ్రీ లింగేశ్వర దేవస్థానం నందు పండు వెన్నెలలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది🙏🏽
    0 Comments 0 Shares 130 Views 2 0 Reviews
  • భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా ఈ వేడుకలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వచనం తీసుకున్నారు.

    మిథిలా స్టేడియంలో జరిగిన ఈ తిరుకల్యాణ మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, ధనసరి అనసూయ సీతక్క గారు, వాకిటి శ్రీహరి గారు, ఇతర ప్రజా ప్రతినిధులు, డీజీపీ శివధర్ రెడ్డి గారు, ఉన్నతాధికారులు, అశేషంగా భక్తులు పాల్గొన్నారు.

    శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ విస్తరణ కోసం తొలిదశ ₹351 కోట్లతో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి గారు భూమిపూజ నిర్వహించారు. ఇందులో ₹180 కోట్లతో ఆలయ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, ₹96 కోట్లతో ఆలయ పరిసరాల అభివృద్ధి, ₹75 కోట్లతో గోదావరి ఘాట్ అభివృద్ధి వంటి పనులు చేపట్టనున్నారు.
    భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా ఈ వేడుకలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వచనం తీసుకున్నారు. ❇️ మిథిలా స్టేడియంలో జరిగిన ఈ తిరుకల్యాణ మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, ధనసరి అనసూయ సీతక్క గారు, వాకిటి శ్రీహరి గారు, ఇతర ప్రజా ప్రతినిధులు, డీజీపీ శివధర్ రెడ్డి గారు, ఉన్నతాధికారులు, అశేషంగా భక్తులు పాల్గొన్నారు. ❇️ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ విస్తరణ కోసం తొలిదశ ₹351 కోట్లతో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి గారు భూమిపూజ నిర్వహించారు. ఇందులో ₹180 కోట్లతో ఆలయ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, ₹96 కోట్లతో ఆలయ పరిసరాల అభివృద్ధి, ₹75 కోట్లతో గోదావరి ఘాట్ అభివృద్ధి వంటి పనులు చేపట్టనున్నారు.
    0 Comments 0 Shares 152 Views 0 Reviews
  • తెలుగు వారి సంప్రదాయం, సంస్కృతికి ప్రతీక.. శ్రీ పరాభవ నామ ఉగాది పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నూతన సంవత్సరం కొత్త ఆశలు, సరికొత్త ఆలోచనలతో ప్రతి ఇంటా సుఖశాంతులు నెలకొని ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు.

    ఉగాది షడ్రుచుల మాదిరిగానే జీవితంలోని సుఖదుఃఖాలను సమానంగా స్వీకరిస్తూ ముందుకు సాగాలని కోరారు. ప్రకృతి పునరుజ్జీవానికి సంకేతమైన ఈ శుభదినాన్ని ప్రతి కుటుంబం ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు.
    తెలుగు వారి సంప్రదాయం, సంస్కృతికి ప్రతీక.. శ్రీ పరాభవ నామ ఉగాది పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నూతన సంవత్సరం కొత్త ఆశలు, సరికొత్త ఆలోచనలతో ప్రతి ఇంటా సుఖశాంతులు నెలకొని ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు. ❇️ ఉగాది షడ్రుచుల మాదిరిగానే జీవితంలోని సుఖదుఃఖాలను సమానంగా స్వీకరిస్తూ ముందుకు సాగాలని కోరారు. ప్రకృతి పునరుజ్జీవానికి సంకేతమైన ఈ శుభదినాన్ని ప్రతి కుటుంబం ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు.
    0 Comments 0 Shares 230 Views 0 Reviews
  • రంజాన్, ఉగాది పర్వదినాల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చంద్రబాబుగారి ప్రభుత్వం సంతోషాలను పంచింది. గత వారం రోజులుగా రోజుకో శుభవార్త వింటూ వస్తున్న ప్రజలు పండుగ ముందే వచ్చింది అనుకుంటున్నారు.
    #DivyangaShakti
    #దివ్యాంగశక్తి
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    రంజాన్, ఉగాది పర్వదినాల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చంద్రబాబుగారి ప్రభుత్వం సంతోషాలను పంచింది. గత వారం రోజులుగా రోజుకో శుభవార్త వింటూ వస్తున్న ప్రజలు పండుగ ముందే వచ్చింది అనుకుంటున్నారు. #DivyangaShakti #దివ్యాంగశక్తి #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 440 Views 0 Reviews
  • తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 10వ తరగతి (SSC) పరీక్షలకు హాజరుకాబోతున్న లక్షలాది మంది విద్యార్థులకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

    భవిష్యత్తుకు తొలిమెట్టుగా ఈ పరీక్షలను ప్రతి విద్యార్థి ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని కోరారు. భయం, ఆందోళన, ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన మనసుతో పరీక్షలు రాస్తే తప్పకుండా మంచి ఫలితాలు సాధించవచ్చని, మీలోని ప్రతిభను నమ్ముకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని విద్యార్థినీ విద్యార్థులకు పిలుపునిచ్చారు.

    పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసి ఉజ్వలమైన భవిష్యత్తుకు ముందడుగు వేయాలని ఆకాంక్షించారు.
    తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 10వ తరగతి (SSC) పరీక్షలకు హాజరుకాబోతున్న లక్షలాది మంది విద్యార్థులకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తుకు తొలిమెట్టుగా ఈ పరీక్షలను ప్రతి విద్యార్థి ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని కోరారు. భయం, ఆందోళన, ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన మనసుతో పరీక్షలు రాస్తే తప్పకుండా మంచి ఫలితాలు సాధించవచ్చని, మీలోని ప్రతిభను నమ్ముకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని విద్యార్థినీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసి ఉజ్వలమైన భవిష్యత్తుకు ముందడుగు వేయాలని ఆకాంక్షించారు.
    0 Comments 0 Shares 133 Views 0 Reviews
  • బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై.సునీల్ రావు నియామకం

    భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై.సునీల్ రావు ను నియమిస్తూ పార్టీ అధిష్టానం బుధవారం రాత్రి ఉత్తర్వులు వెలువర్చింది. ఈ మేరకు బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ మాజీ మేయర్ అయిన యాదగిరి సునీల్ రావు ఇటీవల కరీంనగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు.

    తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు గారితో పాటు తనకు అన్నివేళలా అండదండలు అందిస్తున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో పార్టీ అభ్యున్నతికి తనదైన శైలిలో కృషి చేస్తూనే నాయకులను కార్యకర్తలు కలుపుకొని ముందుకు సాగుతాననే విశ్వాసాన్ని సునీల్ రావు వ్యక్తం చేశారు.

    కేంద్రంలో మోదీ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన తనదైన పోరాటాన్ని కొనసాగిస్తానని.. బిజెపి జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ ప్రవీణ్ రావు ఇతర నాయకులందరి సహకారంతో పార్టీలో ఒక సైనికుడిగా పని చేస్తానని సంతోషాన్ని వ్యక్తం చేశారు.
    బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై.సునీల్ రావు నియామకం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై.సునీల్ రావు ను నియమిస్తూ పార్టీ అధిష్టానం బుధవారం రాత్రి ఉత్తర్వులు వెలువర్చింది. ఈ మేరకు బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ మాజీ మేయర్ అయిన యాదగిరి సునీల్ రావు ఇటీవల కరీంనగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు గారితో పాటు తనకు అన్నివేళలా అండదండలు అందిస్తున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో పార్టీ అభ్యున్నతికి తనదైన శైలిలో కృషి చేస్తూనే నాయకులను కార్యకర్తలు కలుపుకొని ముందుకు సాగుతాననే విశ్వాసాన్ని సునీల్ రావు వ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన తనదైన పోరాటాన్ని కొనసాగిస్తానని.. బిజెపి జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ ప్రవీణ్ రావు ఇతర నాయకులందరి సహకారంతో పార్టీలో ఒక సైనికుడిగా పని చేస్తానని సంతోషాన్ని వ్యక్తం చేశారు.
    #భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై. సునీల్ రావు.
    0 Comments 0 Shares 346 Views 0 Reviews
  • సిరిసిల్ల జిల్లాకు ప్రతిష్టాత్మకం కోర్టు భవన నిర్మాణం.

    సిరిసిల్ల జిల్లా కేంద్రానికి మరో ఆకర్షణగా నిలవనుంది. మరో 50 సంవత్సరాల అవసరాలు తీర్చేలా అత్యాధునిక వసతులతో నిర్మించ తలపెట్టిన భవన నిర్మాణానికి శనివారం ఉదయం శంకుస్థాపన జరగనుంది. పాత కోర్టు స్థానంలోనే సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో రూ.81 కోట్ల 60 లక్షల వ్యయంతో రూపుదిద్దుకోనున్న భవనంలో 12 రకాల న్యాయస్థానాలు కొలువుదీరేలా తీర్చిదిద్దనున్నారు. ఒక్కో అంతస్తు 21 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణం జరగనుంది. విశాలమైన కోర్టు హాళ్లు, ప్రతి అంతస్తులు ప్రత్యేకంగా వాష్ రూమ్ లు కక్షిదారులకు వెయిటింగ్ హాళ్లు కనీసం 300 కార్లకు పార్కింగ్ సౌకర్యం కల్పిస్తూ నూతన భవనం నిర్మించబోతున్నారు. సెల్లార్తోపాటు టెన్ ప్లస్ టు నిర్మాణ శైలితో రాబోయే రెండేళ్లలో పూర్తిస్థాయిలో భవన నిర్మాణాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.

    #Sircilla #Sircillanewcourt #sircillanews #rajannasircilla #sircilla_rajanna_district
    సిరిసిల్ల జిల్లాకు ప్రతిష్టాత్మకం కోర్టు భవన నిర్మాణం. సిరిసిల్ల జిల్లా కేంద్రానికి మరో ఆకర్షణగా నిలవనుంది. మరో 50 సంవత్సరాల అవసరాలు తీర్చేలా అత్యాధునిక వసతులతో నిర్మించ తలపెట్టిన భవన నిర్మాణానికి శనివారం ఉదయం శంకుస్థాపన జరగనుంది. పాత కోర్టు స్థానంలోనే సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో రూ.81 కోట్ల 60 లక్షల వ్యయంతో రూపుదిద్దుకోనున్న భవనంలో 12 రకాల న్యాయస్థానాలు కొలువుదీరేలా తీర్చిదిద్దనున్నారు. ఒక్కో అంతస్తు 21 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణం జరగనుంది. విశాలమైన కోర్టు హాళ్లు, ప్రతి అంతస్తులు ప్రత్యేకంగా వాష్ రూమ్ లు కక్షిదారులకు వెయిటింగ్ హాళ్లు కనీసం 300 కార్లకు పార్కింగ్ సౌకర్యం కల్పిస్తూ నూతన భవనం నిర్మించబోతున్నారు. సెల్లార్తోపాటు టెన్ ప్లస్ టు నిర్మాణ శైలితో రాబోయే రెండేళ్లలో పూర్తిస్థాయిలో భవన నిర్మాణాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. #Sircilla #Sircillanewcourt #sircillanews #rajannasircilla #sircilla_rajanna_district
    0 Comments 0 Shares 568 Views 0 Reviews
  • రెయిన్బో స్కూల్లో ఘనంగా జాతీయ సైన్స్ ఫెయిర్ వేడుకలు 2026.. చింతపల్లి మేజర్ న్యూస్ : చింతపల్లి మండలం మాల్ వెంకటేశ్వర్ నగర్ లోని ది రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్లో 28 ఫిబ్రవరి 2026 జాతీయ సైన్స్ డే సందర్భంగా స్కూల్లో సైన్స్ ఫెయిర్ వేడుకలు, ఫుడ్ ఫెస్టివల్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ .కాజ నవాజ్ మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి ప్రదర్శనలు చేయడం వలన, ఎక్స్పరిమెంట్స్ చేయడం వలన విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఉపయోగపడుతుందని వారన్నారు.వారు ఎంతో ఉన్నతమైన స్థితికి ఎదుగుతారని ఉన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల ప్రాజెక్టులు తయారు చేశారు .ఈరోజు చేసిన వివిధ రకాల ఎక్స్పరిమెంట్స్ విద్యార్థులు ప్రదర్శించడం వలన పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు. ప్రిన్సిపాల్ వీరేశం, ముఖ్యఅతిథిగా మాజీ ఎంపిటిసి కుంభం. శ్వేతా శ్రీశైలం గౌడ్, అధ్యాపకులు సత్యనారాయణ, శంకర్, అధ్యాపకులు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. ఈరోజు మాజీ ఎంపీపీ కొండూరు. భవాని పవన్ కుమార్ కుమార్తె ఏడవ తరగతి కే.రితిక అయోధ్య రాముని గుడిని నిర్మి0చారు.. ఈ సందర్భంగా పాఠశాల అధ్యాపకులు ప్రశంసించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఖాజ నవాజ్ విద్యార్థులను అభినందించి పలు బహుమతులు అందజేశారు.
    రెయిన్బో స్కూల్లో ఘనంగా జాతీయ సైన్స్ ఫెయిర్ వేడుకలు 2026.. చింతపల్లి మేజర్ న్యూస్ : చింతపల్లి మండలం మాల్ వెంకటేశ్వర్ నగర్ లోని ది రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్లో 28 ఫిబ్రవరి 2026 జాతీయ సైన్స్ డే సందర్భంగా స్కూల్లో సైన్స్ ఫెయిర్ వేడుకలు, ఫుడ్ ఫెస్టివల్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ .కాజ నవాజ్ మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి ప్రదర్శనలు చేయడం వలన, ఎక్స్పరిమెంట్స్ చేయడం వలన విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఉపయోగపడుతుందని వారన్నారు.వారు ఎంతో ఉన్నతమైన స్థితికి ఎదుగుతారని ఉన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల ప్రాజెక్టులు తయారు చేశారు .ఈరోజు చేసిన వివిధ రకాల ఎక్స్పరిమెంట్స్ విద్యార్థులు ప్రదర్శించడం వలన పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు. ప్రిన్సిపాల్ వీరేశం, ముఖ్యఅతిథిగా మాజీ ఎంపిటిసి కుంభం. శ్వేతా శ్రీశైలం గౌడ్, అధ్యాపకులు సత్యనారాయణ, శంకర్, అధ్యాపకులు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. ఈరోజు మాజీ ఎంపీపీ కొండూరు. భవాని పవన్ కుమార్ కుమార్తె ఏడవ తరగతి కే.రితిక అయోధ్య రాముని గుడిని నిర్మి0చారు.. ఈ సందర్భంగా పాఠశాల అధ్యాపకులు ప్రశంసించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఖాజ నవాజ్ విద్యార్థులను అభినందించి పలు బహుమతులు అందజేశారు.
    0 Comments 0 Shares 153 Views 0 Reviews
  • గౌరవ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు ఈ రోజు ఉదయం తిరుపతిలో నూతన జిల్లా కోర్టు భవనాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అమరావతిలో జ్యుడీషియల్ అకాడమీ భవనం.. హైకోర్టు అతిథి గృహభవనానికి శంకుస్థాపన చేసి, అమరావతిలో నిర్మించిన న్యాయమూర్తుల నివాస గృహాలను ప్రారంభిస్తారు.
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    గౌరవ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు ఈ రోజు ఉదయం తిరుపతిలో నూతన జిల్లా కోర్టు భవనాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అమరావతిలో జ్యుడీషియల్ అకాడమీ భవనం.. హైకోర్టు అతిథి గృహభవనానికి శంకుస్థాపన చేసి, అమరావతిలో నిర్మించిన న్యాయమూర్తుల నివాస గృహాలను ప్రారంభిస్తారు. #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 422 Views 0 Reviews
  • ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులు, ప్రజోపయోగ కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలకు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో రాష్ట్రంలో ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు రాష్ట్రంలో ఈ ప్రణాళికను అమలు చేయాలని అన్ని శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

    జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ 4 కోట్ల ప్రజల పండుగ సంబురంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకను పురస్కరించుకొని 99 రోజుల పాటు జరిగే ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు.

    ముఖ్యమంత్రి గారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు గారు, డీపీజీ బి. శివధర్ రెడ్డి గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

    దేశ అభివృద్ధి పథంలోనూ, పరిపాలనలోనూ తెలంగాణను తిరుగులేని ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని శాఖల వారిగా అధికారులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు దిశానిర్ధేశం చేశారు.

    గ్రామ స్థాయి నుంచి మండలస్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు షెడ్యూలు ప్రకారం కార్యక్రమాలను విజయవంతం చేయాలి. అందుకు అవసరమైన ప్రణాళికను వెంటనే సిద్ధం చేసి ఆచరణలో చూపెట్టాలి. ఈ కార్యక్రమానికి ప్రత్యేక లోగో తయారు చేయడమే కాకుండా రాష్ట్రమంతా 99 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల షెడ్యూలును సీఎస్ గారు రూపొందించాలి.

    ఈ 99 రోజుల్లో ఫైళ్ల క్లియరెన్స్ తో పాటు అన్ని విభాగాలు, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అన్ని ఆఫీసుల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత డ్రైవ్ నిర్వహించాలి. ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకుండా పక్కాగా అమలు చేయాలి. 99 రోజుల కార్యక్రమ పురోగతిని వ్యక్తిగతంగా పరిశీలిస్తా. క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తా.

    పరిపాలనలో అధునాతన సాంకేతిక నైపుణ్యాన్ని సమర్థంగా వినియోగించాలి. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పౌరులకు అవసరమైన సేవలన్నింటినీ మరింత సులభతరం చేయాలి. ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా అన్ని సేవలు పొందేలా సాంకేతిక సంస్కరణలు తీసుకురావాలి.

    కరెంట్ మీటర్, తమ ఇంటి అనుమతి, నల్లా కనెక్షన్ మొదలు ప్రభుత్వం నుంచి పొందాల్సిన అనుమతులకు, సేవలకు ప్రజలు ఆఫీసులకు రావాల్సిన అవసరం లేకుండా జరగాలి. వాహనం కొనుగోలు చేసిన షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ జరిగే విధానం అమల్లోకి వచ్చినట్టుగా, ప్రతి విభాగంలోనూ సంస్కరణలు తీసుకురావాలి.

    ఏ ఫైలు, ఏ ఆర్జీ ఎక్కడ ఉందో దరఖాస్తుదారు తెలుసుకునే సునాయస విధానం అమలులోకి రావాలి. సమూల మార్పులతో సాంకేతిక సంస్కరణలు అమలు చేసేందుకు సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ గారి అధ్వర్యంలో ప్రత్యేక కమిటీ వేయాలి. మూడు వారాల్లో కమిటీ నివేదికను అందించాలి.

    ప్రతి విభాగం ఈ-ఆఫీస్ విధానం, డిజిటల్ గవర్నెన్స్ ను అమలు చేయాలి. అన్ని శాఖలకు సంబంధించిన డేటా నిల్వ చేస్తున్న పాత కాలం సర్వర్లను రాబోయే 20 సంవత్సరాలకు సరిపడేలా అప్‌డేట్ చేయాలి.

    సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయడానికి సాంకేతికతను వినియోగించాలి. మహాలక్ష్మి, రేషన్ కార్డులు, రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు, ఆరోగ్య శ్రీ అర్హులైన వారందరికీ చేరాలి. సొంత స్థలముండి ఇల్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి అందాలి. రేషన్ కార్డులు అప్లై చేసుకునే ప్రక్రియ నిరంతరం కొనసాగాలి.

    ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించేలా రాష్ట్రంలో వంద మండలాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ప్రారంభిస్తున్నాం. ప్రభుత్వ విద్యను ప్రక్షాళన చేయటంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్య సేవలను మెరుగుపరిచే విధానాలు అమలు చేయాలి.

    తెలంగాణ రైజింగ్ విజన్ లో భాగంగా ప్రభుత్వం రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ మూడు జోన్లుగా విభజించి దేశంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. కోర్ అర్బన్ రీజియన్ లో చేపట్టాల్సిన సర్వీస్ సెక్టార్ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించుకోవాలి. అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీకి దాదాపు 10 వేల చ.కి.మీ. మ్యానుఫాక్చరింగ్ జోన్ భవిష్యత్తులోనూ కీలకంగా మారుతుంది.

    అన్ని విభాగాల్లో పని చేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులతో పాటు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల డేటా కార్యదర్శుల వద్ద సిద్ధంగా ఉండాలి.

    రాష్ట్రంలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండడానికి వీలు లేదు. ప్రతి శాఖకు సొంత భవనం ఉండాలి. బడ్జెట్ ప్రతిపాదనల్లో వీటిని చేర్చాలి.

    హైదరాబాద్లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌తో పాటు వరల్డ్ ఎకనమిక్ ఫోరం, విదేశీ పర్యటనలతో రాష్ట్రానికి దాదాపు రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ ఎంఓయూలన్నీ ఫలవంతమయ్యేలా కార్యదర్శులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి అవి గ్రౌండయ్యేంత వరకు సంప్రదింపులు జరపాలి.

    దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం, అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజలకు కోరుకున్న మార్పును అందిస్తామనే హామీతో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ రోజుతో ప్రభుత్వం రెండేళ్లు మూడు నెలలు పూర్తి చేసుకుంది. ప్రజలు కోరుకున్న మార్పును స్వాగతిస్తున్నారు.

    ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు పునరంకిత భావంతో ముందుకు సాగాల్సిన సమయం వచ్చింది. ఇప్పటివరకు సాధించిన విజయాలను నిజాయితీగా అంచనా వేసుకుని, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో అధికారులు గుర్తించాలి.

    వచ్చే ఎన్నికల నాటికి మిగిలిన రెండేళ్లు తొమ్మిది నెలలకు సరైన దిశా నిర్దేశంతో కార్యాచరణ రూపొందించుకోవాలి. ప్రజలు చూపిన విశ్వాసాన్ని మాటలతో కాకుండా సుపరిపాలనతో గౌరవించాల్సిన బాధ్యత తనతో పాటు అధికారులు అందరిపైనా ఉంది.. అని ముఖ్యమంత్రి గారు నిర్దేశం చేశారు.
    ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులు, ప్రజోపయోగ కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలకు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో రాష్ట్రంలో ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు రాష్ట్రంలో ఈ ప్రణాళికను అమలు చేయాలని అన్ని శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ❇️ జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ 4 కోట్ల ప్రజల పండుగ సంబురంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకను పురస్కరించుకొని 99 రోజుల పాటు జరిగే ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు. ❇️ ముఖ్యమంత్రి గారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు గారు, డీపీజీ బి. శివధర్ రెడ్డి గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ❇️ దేశ అభివృద్ధి పథంలోనూ, పరిపాలనలోనూ తెలంగాణను తిరుగులేని ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని శాఖల వారిగా అధికారులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు దిశానిర్ధేశం చేశారు. ❇️ గ్రామ స్థాయి నుంచి మండలస్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు షెడ్యూలు ప్రకారం కార్యక్రమాలను విజయవంతం చేయాలి. అందుకు అవసరమైన ప్రణాళికను వెంటనే సిద్ధం చేసి ఆచరణలో చూపెట్టాలి. ఈ కార్యక్రమానికి ప్రత్యేక లోగో తయారు చేయడమే కాకుండా రాష్ట్రమంతా 99 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల షెడ్యూలును సీఎస్ గారు రూపొందించాలి. ❇️ ఈ 99 రోజుల్లో ఫైళ్ల క్లియరెన్స్ తో పాటు అన్ని విభాగాలు, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అన్ని ఆఫీసుల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత డ్రైవ్ నిర్వహించాలి. ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకుండా పక్కాగా అమలు చేయాలి. 99 రోజుల కార్యక్రమ పురోగతిని వ్యక్తిగతంగా పరిశీలిస్తా. క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తా. ❇️ పరిపాలనలో అధునాతన సాంకేతిక నైపుణ్యాన్ని సమర్థంగా వినియోగించాలి. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పౌరులకు అవసరమైన సేవలన్నింటినీ మరింత సులభతరం చేయాలి. ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా అన్ని సేవలు పొందేలా సాంకేతిక సంస్కరణలు తీసుకురావాలి. ❇️ కరెంట్ మీటర్, తమ ఇంటి అనుమతి, నల్లా కనెక్షన్ మొదలు ప్రభుత్వం నుంచి పొందాల్సిన అనుమతులకు, సేవలకు ప్రజలు ఆఫీసులకు రావాల్సిన అవసరం లేకుండా జరగాలి. వాహనం కొనుగోలు చేసిన షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ జరిగే విధానం అమల్లోకి వచ్చినట్టుగా, ప్రతి విభాగంలోనూ సంస్కరణలు తీసుకురావాలి. ❇️ ఏ ఫైలు, ఏ ఆర్జీ ఎక్కడ ఉందో దరఖాస్తుదారు తెలుసుకునే సునాయస విధానం అమలులోకి రావాలి. సమూల మార్పులతో సాంకేతిక సంస్కరణలు అమలు చేసేందుకు సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ గారి అధ్వర్యంలో ప్రత్యేక కమిటీ వేయాలి. మూడు వారాల్లో కమిటీ నివేదికను అందించాలి. ❇️ ప్రతి విభాగం ఈ-ఆఫీస్ విధానం, డిజిటల్ గవర్నెన్స్ ను అమలు చేయాలి. అన్ని శాఖలకు సంబంధించిన డేటా నిల్వ చేస్తున్న పాత కాలం సర్వర్లను రాబోయే 20 సంవత్సరాలకు సరిపడేలా అప్‌డేట్ చేయాలి. ❇️ సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయడానికి సాంకేతికతను వినియోగించాలి. మహాలక్ష్మి, రేషన్ కార్డులు, రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు, ఆరోగ్య శ్రీ అర్హులైన వారందరికీ చేరాలి. సొంత స్థలముండి ఇల్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి అందాలి. రేషన్ కార్డులు అప్లై చేసుకునే ప్రక్రియ నిరంతరం కొనసాగాలి. ❇️ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించేలా రాష్ట్రంలో వంద మండలాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ప్రారంభిస్తున్నాం. ప్రభుత్వ విద్యను ప్రక్షాళన చేయటంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్య సేవలను మెరుగుపరిచే విధానాలు అమలు చేయాలి. ❇️ తెలంగాణ రైజింగ్ విజన్ లో భాగంగా ప్రభుత్వం రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ మూడు జోన్లుగా విభజించి దేశంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. కోర్ అర్బన్ రీజియన్ లో చేపట్టాల్సిన సర్వీస్ సెక్టార్ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించుకోవాలి. అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీకి దాదాపు 10 వేల చ.కి.మీ. మ్యానుఫాక్చరింగ్ జోన్ భవిష్యత్తులోనూ కీలకంగా మారుతుంది. ❇️ అన్ని విభాగాల్లో పని చేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులతో పాటు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల డేటా కార్యదర్శుల వద్ద సిద్ధంగా ఉండాలి. ❇️ రాష్ట్రంలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండడానికి వీలు లేదు. ప్రతి శాఖకు సొంత భవనం ఉండాలి. బడ్జెట్ ప్రతిపాదనల్లో వీటిని చేర్చాలి. ❇️ హైదరాబాద్లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌తో పాటు వరల్డ్ ఎకనమిక్ ఫోరం, విదేశీ పర్యటనలతో రాష్ట్రానికి దాదాపు రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ ఎంఓయూలన్నీ ఫలవంతమయ్యేలా కార్యదర్శులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి అవి గ్రౌండయ్యేంత వరకు సంప్రదింపులు జరపాలి. ❇️ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం, అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజలకు కోరుకున్న మార్పును అందిస్తామనే హామీతో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ రోజుతో ప్రభుత్వం రెండేళ్లు మూడు నెలలు పూర్తి చేసుకుంది. ప్రజలు కోరుకున్న మార్పును స్వాగతిస్తున్నారు. ❇️ ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు పునరంకిత భావంతో ముందుకు సాగాల్సిన సమయం వచ్చింది. ఇప్పటివరకు సాధించిన విజయాలను నిజాయితీగా అంచనా వేసుకుని, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో అధికారులు గుర్తించాలి. ❇️ వచ్చే ఎన్నికల నాటికి మిగిలిన రెండేళ్లు తొమ్మిది నెలలకు సరైన దిశా నిర్దేశంతో కార్యాచరణ రూపొందించుకోవాలి. ప్రజలు చూపిన విశ్వాసాన్ని మాటలతో కాకుండా సుపరిపాలనతో గౌరవించాల్సిన బాధ్యత తనతో పాటు అధికారులు అందరిపైనా ఉంది.. అని ముఖ్యమంత్రి గారు నిర్దేశం చేశారు.
    0 Comments 0 Shares 145 Views 0 Reviews
  • వేట్లపాలెం ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం అందిస్తాం. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యచికిత్స అందిస్తాం. పిల్లల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. వారిని చదివిస్తాం. ఇల్లు లేని వారికి, ప్రభుత్వం ఇల్లు కట్టిస్తుంది. దోషులని శిక్షిస్తాం. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం.
    వేట్లపాలెం ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం అందిస్తాం. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యచికిత్స అందిస్తాం. పిల్లల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. వారిని చదివిస్తాం. ఇల్లు లేని వారికి, ప్రభుత్వం ఇల్లు కట్టిస్తుంది. దోషులని శిక్షిస్తాం. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం.
    0 Comments 0 Shares 143 Views 6 0 Reviews
More Results
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com