• సిరిసిల్ల జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు వదంతులు, అసత్య ప్రచారాలు నమ్మవద్దు: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్.

    సిరిసిల్ల జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్పష్టం చేశారు. ఎనర్జీ మానిటరింగ్ కమిటీని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిలిండర్ల పంపిణీ, స్టాక్ తదితర అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కమిటీ సభ్యులు, సిలిండర్ ఏజెన్సీల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఎనర్జీ మానిటరింగ్ కమిటీ జిల్లా చైర్మన్ గా కలెక్టర్, కన్వీనర్ గా జిల్లా పౌరసరఫరాల అధికారి, సభ్యులుగా వివిధ శాఖల అధికారులు ఉంటారని అధికారులు తెలిపారు.

    ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా జిల్లాలో సిలిండర్ల నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలు పడవద్దని, వదంతులు నమ్మవద్దని సూచించారు. గృహ వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ సూచించిన ధరలకు మాత్రమే సిలిండర్లను విక్రయించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ హాస్టళ్లు, స్కూళ్లు, అనాథ శ్రమాలు, ఆస్పత్రులకు ఇబ్బంది లేకుండా సిలిండర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

    ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి గితే మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టించవద్దని, బ్లాక్ దందా చేయవద్దని సూచించారు. సిలిండర్ పక్కదారి పట్టినా.. బ్లాక్ దందా చేసినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

    సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా పౌర సరఫరాల అధికారి రాధాభాయ్, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు రవీందర్ రెడ్డి, అఫ్జల్ బేగం, సౌజన్య, రూపేష్, లక్ష్మీరాజం, రజిత, గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

    #Sircilla #GasCylinder #sircillacollector #garimaagrawal #rajannasircilla #sircilla_rajanna_district
    సిరిసిల్ల జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు వదంతులు, అసత్య ప్రచారాలు నమ్మవద్దు: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్. సిరిసిల్ల జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్పష్టం చేశారు. ఎనర్జీ మానిటరింగ్ కమిటీని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిలిండర్ల పంపిణీ, స్టాక్ తదితర అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కమిటీ సభ్యులు, సిలిండర్ ఏజెన్సీల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఎనర్జీ మానిటరింగ్ కమిటీ జిల్లా చైర్మన్ గా కలెక్టర్, కన్వీనర్ గా జిల్లా పౌరసరఫరాల అధికారి, సభ్యులుగా వివిధ శాఖల అధికారులు ఉంటారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా జిల్లాలో సిలిండర్ల నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలు పడవద్దని, వదంతులు నమ్మవద్దని సూచించారు. గృహ వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ సూచించిన ధరలకు మాత్రమే సిలిండర్లను విక్రయించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ హాస్టళ్లు, స్కూళ్లు, అనాథ శ్రమాలు, ఆస్పత్రులకు ఇబ్బంది లేకుండా సిలిండర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి గితే మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టించవద్దని, బ్లాక్ దందా చేయవద్దని సూచించారు. సిలిండర్ పక్కదారి పట్టినా.. బ్లాక్ దందా చేసినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా పౌర సరఫరాల అధికారి రాధాభాయ్, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు రవీందర్ రెడ్డి, అఫ్జల్ బేగం, సౌజన్య, రూపేష్, లక్ష్మీరాజం, రజిత, గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. #Sircilla #GasCylinder #sircillacollector #garimaagrawal #rajannasircilla #sircilla_rajanna_district
    0 Comments 0 Shares 439 Views 0 Reviews
  • సిరిసిల్ల జిల్లాకు ప్రతిష్టాత్మకం కోర్టు భవన నిర్మాణం.

    సిరిసిల్ల జిల్లా కేంద్రానికి మరో ఆకర్షణగా నిలవనుంది. మరో 50 సంవత్సరాల అవసరాలు తీర్చేలా అత్యాధునిక వసతులతో నిర్మించ తలపెట్టిన భవన నిర్మాణానికి శనివారం ఉదయం శంకుస్థాపన జరగనుంది. పాత కోర్టు స్థానంలోనే సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో రూ.81 కోట్ల 60 లక్షల వ్యయంతో రూపుదిద్దుకోనున్న భవనంలో 12 రకాల న్యాయస్థానాలు కొలువుదీరేలా తీర్చిదిద్దనున్నారు. ఒక్కో అంతస్తు 21 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణం జరగనుంది. విశాలమైన కోర్టు హాళ్లు, ప్రతి అంతస్తులు ప్రత్యేకంగా వాష్ రూమ్ లు కక్షిదారులకు వెయిటింగ్ హాళ్లు కనీసం 300 కార్లకు పార్కింగ్ సౌకర్యం కల్పిస్తూ నూతన భవనం నిర్మించబోతున్నారు. సెల్లార్తోపాటు టెన్ ప్లస్ టు నిర్మాణ శైలితో రాబోయే రెండేళ్లలో పూర్తిస్థాయిలో భవన నిర్మాణాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.

    #Sircilla #Sircillanewcourt #sircillanews #rajannasircilla #sircilla_rajanna_district
    సిరిసిల్ల జిల్లాకు ప్రతిష్టాత్మకం కోర్టు భవన నిర్మాణం. సిరిసిల్ల జిల్లా కేంద్రానికి మరో ఆకర్షణగా నిలవనుంది. మరో 50 సంవత్సరాల అవసరాలు తీర్చేలా అత్యాధునిక వసతులతో నిర్మించ తలపెట్టిన భవన నిర్మాణానికి శనివారం ఉదయం శంకుస్థాపన జరగనుంది. పాత కోర్టు స్థానంలోనే సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో రూ.81 కోట్ల 60 లక్షల వ్యయంతో రూపుదిద్దుకోనున్న భవనంలో 12 రకాల న్యాయస్థానాలు కొలువుదీరేలా తీర్చిదిద్దనున్నారు. ఒక్కో అంతస్తు 21 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణం జరగనుంది. విశాలమైన కోర్టు హాళ్లు, ప్రతి అంతస్తులు ప్రత్యేకంగా వాష్ రూమ్ లు కక్షిదారులకు వెయిటింగ్ హాళ్లు కనీసం 300 కార్లకు పార్కింగ్ సౌకర్యం కల్పిస్తూ నూతన భవనం నిర్మించబోతున్నారు. సెల్లార్తోపాటు టెన్ ప్లస్ టు నిర్మాణ శైలితో రాబోయే రెండేళ్లలో పూర్తిస్థాయిలో భవన నిర్మాణాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. #Sircilla #Sircillanewcourt #sircillanews #rajannasircilla #sircilla_rajanna_district
    0 Comments 0 Shares 520 Views 0 Reviews
  • ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్.

    ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మిక తనిఖీ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రంలో కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, కనీస వసతుల కల్పనను పరిశీలించి, అధికారులతో మాట్లాడారు.

    పరిశీలనలో తహసీల్దార్ మహేష్ కుమార్, అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు.

    #Sircilla #sircillacollector #garimaagrawal #rajannasircilla #sircilla_rajanna_district
    ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్. ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మిక తనిఖీ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రంలో కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, కనీస వసతుల కల్పనను పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. పరిశీలనలో తహసీల్దార్ మహేష్ కుమార్, అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు. #Sircilla #sircillacollector #garimaagrawal #rajannasircilla #sircilla_rajanna_district
    0 Comments 0 Shares 467 Views 0 Reviews
  • రాజన్న సిరిసిల్ల జిల్లా..

    1.సిరిసిల్ల పట్టణ సీఐ గా నెమ్మని శ్రీనివాస్....

    2.జిల్లా డీసీఆర్బి లో ఉన్న కదిర నాగేశ్వరరావును సిరిసిల్ల రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బదిలీ..

    3.సిరిసిల్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉన్న మొగిలిని డిసిఆర్బికి బదిలీ..

    4.కరీంనగర్ పీసీఆర్ లో పని చేస్తున్న ఓదెల వెంకటేశ్ ను ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా నియామకం...

    #sircillanews #rajannasircillaupdates #rajannasircilla #rajannasircillapolice #police
    రాజన్న సిరిసిల్ల జిల్లా.. 1.సిరిసిల్ల పట్టణ సీఐ గా నెమ్మని శ్రీనివాస్.... 2.జిల్లా డీసీఆర్బి లో ఉన్న కదిర నాగేశ్వరరావును సిరిసిల్ల రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బదిలీ.. 3.సిరిసిల్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉన్న మొగిలిని డిసిఆర్బికి బదిలీ.. 4.కరీంనగర్ పీసీఆర్ లో పని చేస్తున్న ఓదెల వెంకటేశ్ ను ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా నియామకం... #sircillanews #rajannasircillaupdates #rajannasircilla #rajannasircillapolice #police
    0 Comments 0 Shares 576 Views 0 Reviews
  • సిరిసిల్ల జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు: సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే.

    శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని పోలీస్ యాక్ట్ 1861ల ప్రకారం నెల రోజుల (మార్చ్ 1వ తేది నుండి 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు.దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు,రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు,పబ్లిక్ మీటింగ్ లు,సభలు,సమావేశాలు నిర్వహించరదాని,నిబంధనలకు విరుద్డిదంగా డి.జే వినియోగించారాదని తెలిపారు. శాతిభద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు.కాబట్టి జిల్లా ప్రజలు పోలీసు వారికి ఇట్టి విషయంలో సహకరించాలని శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని సూచించారు.

    #Sircilla #spsircilla #maheshbgeete
    సిరిసిల్ల జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు: సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే. శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని పోలీస్ యాక్ట్ 1861ల ప్రకారం నెల రోజుల (మార్చ్ 1వ తేది నుండి 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు.దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు,రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు,పబ్లిక్ మీటింగ్ లు,సభలు,సమావేశాలు నిర్వహించరదాని,నిబంధనలకు విరుద్డిదంగా డి.జే వినియోగించారాదని తెలిపారు. శాతిభద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు.కాబట్టి జిల్లా ప్రజలు పోలీసు వారికి ఇట్టి విషయంలో సహకరించాలని శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని సూచించారు. #Sircilla #spsircilla #maheshbgeete
    0 Comments 0 Shares 317 Views 0 Reviews
  • సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి
    మర్యాదపూర్వకంగా కలిసిన సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ లు.

    #Sircilla #CongressParty
    సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ లు. #Sircilla #CongressParty
    0 Comments 0 Shares 323 Views 0 Reviews
  • అల్మాస్ పూర్ వద్ద ఉన్న కేజీబీవీలో ఆకస్మిక తనిఖీ చేసిన: సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్.

    పదో తరగతి విద్యార్థులు అన్ని సబ్జెక్టులు చదవాలి రాయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ వద్ద ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ శనివారం తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లు పరిశీలించారు. కిచెన్, వంట గది, స్టోర్ రూమ్, భోజనానికి వినియోగించే ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. తరగతి గదుల్లో బోధన కొనసాగుతుండగా, పరిశీలించారు. పదో తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. అన్ని సబ్జెక్టుల సిలబస్ పూర్తి అయిందా అని ఇంచార్జి కలెక్టర్ ఆరా తీశారు. సైన్స్ కు సంబంధించి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులతో నాడీకణ నిర్మాణ నమూనాను బోర్డుపై గీసి దాని భాగాలు వివరిం చాలని సూచించారు. పలువురు విద్యార్థులు గీయగా, వారిని అభినందించారు. ఈ సందర్బంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకమని తెలిపారు. విద్యార్థులు ఒక ప్రణాళిక రూపొందించుకొని ప్రతి సబ్జెక్టుకు సంబంధించి గత ప్రశ్నాపత్రాలు సాధన చేయాలని సూచించారు. ఆ సమాధానాలను మరోసారి సమీక్ష చేసుకోవాలని పేర్కొన్నారు. పదో తరగతి మార్కులే ఉన్నత విద్యాభ్యాసంలో కీలకంగా మారుతాయని వివరించారు. ఇప్పటి అంశాలే రానున్న తరగతుల్లో మరింత విస్తృతంగా ఉంటాయని తెలిపారు. మంచిగా చదివి వివిధ ఉన్నత ఉద్యోగాలు, వృత్తుల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. కెరీర్ లో స్థిరపడిన తరువాతే మిగితా విషయాలు ఆలోచించాలని సూచించారు.

    *నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి*

    విద్యాలయంపైన అదనపు తరగతి గదుల నిర్మాణాలపై టీజీఈడబ్ల్యూఐడీసీ ఏఈల నుంచి ఆరాతీశారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ ఆదేశించారు.

    #rajannasircilla #sircillacollector #sircilla_rajanna_district
    అల్మాస్ పూర్ వద్ద ఉన్న కేజీబీవీలో ఆకస్మిక తనిఖీ చేసిన: సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్. పదో తరగతి విద్యార్థులు అన్ని సబ్జెక్టులు చదవాలి రాయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ వద్ద ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ శనివారం తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లు పరిశీలించారు. కిచెన్, వంట గది, స్టోర్ రూమ్, భోజనానికి వినియోగించే ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. తరగతి గదుల్లో బోధన కొనసాగుతుండగా, పరిశీలించారు. పదో తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. అన్ని సబ్జెక్టుల సిలబస్ పూర్తి అయిందా అని ఇంచార్జి కలెక్టర్ ఆరా తీశారు. సైన్స్ కు సంబంధించి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులతో నాడీకణ నిర్మాణ నమూనాను బోర్డుపై గీసి దాని భాగాలు వివరిం చాలని సూచించారు. పలువురు విద్యార్థులు గీయగా, వారిని అభినందించారు. ఈ సందర్బంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకమని తెలిపారు. విద్యార్థులు ఒక ప్రణాళిక రూపొందించుకొని ప్రతి సబ్జెక్టుకు సంబంధించి గత ప్రశ్నాపత్రాలు సాధన చేయాలని సూచించారు. ఆ సమాధానాలను మరోసారి సమీక్ష చేసుకోవాలని పేర్కొన్నారు. పదో తరగతి మార్కులే ఉన్నత విద్యాభ్యాసంలో కీలకంగా మారుతాయని వివరించారు. ఇప్పటి అంశాలే రానున్న తరగతుల్లో మరింత విస్తృతంగా ఉంటాయని తెలిపారు. మంచిగా చదివి వివిధ ఉన్నత ఉద్యోగాలు, వృత్తుల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. కెరీర్ లో స్థిరపడిన తరువాతే మిగితా విషయాలు ఆలోచించాలని సూచించారు. *నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి* విద్యాలయంపైన అదనపు తరగతి గదుల నిర్మాణాలపై టీజీఈడబ్ల్యూఐడీసీ ఏఈల నుంచి ఆరాతీశారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ ఆదేశించారు. #rajannasircilla #sircillacollector #sircilla_rajanna_district
    0 Comments 0 Shares 373 Views 0 Reviews
  • సిరిసిల్ల జిల్లా గంబీరావుపేటలో ఆదివారం డిప్యూటీ సీఎం పర్యటన వాయిదా.
    rajannasircilla
    సిరిసిల్ల జిల్లా గంబీరావుపేటలో ఆదివారం డిప్యూటీ సీఎం పర్యటన వాయిదా. rajannasircilla
    0 Comments 0 Shares 212 Views 0 Reviews
  • సిరిసిల్ల లో ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద 163 BNSS (సెక్షన్ 144) అమలు.

    ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణ నేపథ్యంలో సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన 10 పరీక్షా కేంద్రాల వద్ద తేది: 25-02-2026 నుండి 18-03-2026 వరకు ప్రతిరోజు ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు 163 BNSS (సెక్షన్ 144) అమల్లో ఉంటుందని సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి తెలిపారు.

    జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

    *అమలులో ఉండే నిబంధనలు:*

    *● ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్షా కేంద్రాల వద్ద గుమికూడరాదు.*

    *● నిషేధిత వస్తువులతో పరీక్షా కేంద్రాల వద్ద సంచరించరాదు.*

    *● పరీక్షా కేంద్రం నుండి 200 మీటర్ల పరిధిలో ఉన్న జిరాక్స్ సెంటర్లు ఉదయం 08:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు మూసివేయాలి.*

    పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

    #Sircilla #Sircilladsp #sircillajillapolice #sircillanews
    సిరిసిల్ల లో ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద 163 BNSS (సెక్షన్ 144) అమలు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణ నేపథ్యంలో సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన 10 పరీక్షా కేంద్రాల వద్ద తేది: 25-02-2026 నుండి 18-03-2026 వరకు ప్రతిరోజు ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు 163 BNSS (సెక్షన్ 144) అమల్లో ఉంటుందని సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. *అమలులో ఉండే నిబంధనలు:* *● ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్షా కేంద్రాల వద్ద గుమికూడరాదు.* *● నిషేధిత వస్తువులతో పరీక్షా కేంద్రాల వద్ద సంచరించరాదు.* *● పరీక్షా కేంద్రం నుండి 200 మీటర్ల పరిధిలో ఉన్న జిరాక్స్ సెంటర్లు ఉదయం 08:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు మూసివేయాలి.* పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. #Sircilla #Sircilladsp #sircillajillapolice #sircillanews
    0 Comments 0 Shares 519 Views 0 Reviews
  • సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్ ల ప్రమాణ స్వీకారం, చైర్ పర్సన్ గా జిందం కళా చక్రపాణి, వైస్ చైర్మన్ గా దార్ల సందీప్ #muncipalelectionsircilla
    సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్ ల ప్రమాణ స్వీకారం, చైర్ పర్సన్ గా జిందం కళా చక్రపాణి, వైస్ చైర్మన్ గా దార్ల సందీప్ #muncipalelectionsircilla
    0 Comments 0 Shares 301 Views 0 Reviews
  • విదేయతకే పట్టం..

    సిరిసిల్ల మున్సిపల్‌‌ చైర్ పర్సన్ గా జిందం కళాచక్రపాణి

    రెండవ సారి చైర్ పర్సన్‌‌ బాధ్యతలు చేపట్టనున్న సిరిసిల్ల 3 వ వార్డు కౌన్సిలర్ జిందం కళాచక్రపాణి

    సిరిసిల్ల బీఆర్‌‌ఎస్‌‌ పార్టీలో సీనియర్‌‌ లీడర్ గా.. బీఆర్ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌ కు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన జిందం చక్రాపాణి

    పార్టీ అన్ని విధాల చర్చించి జిందం కళ ను చైర్ పర్సన్ గా నియమించాలని కేటీఆర్‌‌ నిర్ణయం..

    మరికొద్ది సేపట్లో సిరిసిల్ల మున్సిపల్‌‌ కార్యాలయానికి చేరుకోనున్న బీఆర్ఎస్‌‌ కౌన్సిలర్లు..

    హైదరాబాద్‌‌ క్యాంపు నుంచి నేరుగా సిరిసిల్ల మున్సిపల్‌‌ కు

    Kalvakuntla Taraka Rama Rao - KTR
    BRS Party
    Sircilla Municipality
    విదేయతకే పట్టం.. సిరిసిల్ల మున్సిపల్‌‌ చైర్ పర్సన్ గా జిందం కళాచక్రపాణి రెండవ సారి చైర్ పర్సన్‌‌ బాధ్యతలు చేపట్టనున్న సిరిసిల్ల 3 వ వార్డు కౌన్సిలర్ జిందం కళాచక్రపాణి సిరిసిల్ల బీఆర్‌‌ఎస్‌‌ పార్టీలో సీనియర్‌‌ లీడర్ గా.. బీఆర్ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌ కు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన జిందం చక్రాపాణి పార్టీ అన్ని విధాల చర్చించి జిందం కళ ను చైర్ పర్సన్ గా నియమించాలని కేటీఆర్‌‌ నిర్ణయం.. మరికొద్ది సేపట్లో సిరిసిల్ల మున్సిపల్‌‌ కార్యాలయానికి చేరుకోనున్న బీఆర్ఎస్‌‌ కౌన్సిలర్లు.. హైదరాబాద్‌‌ క్యాంపు నుంచి నేరుగా సిరిసిల్ల మున్సిపల్‌‌ కు Kalvakuntla Taraka Rama Rao - KTR BRS Party Sircilla Municipality
    0 Comments 0 Shares 156 Views 0 Reviews
  • రాజన్న సిరిసిల్ల జిల్లా లో ఈరోజు పోలింగ్ శాతం వార్డుల వారీగా Male Female Others Total Male Female Others Total
    1 2 3 4 5 6 7 8 9 10 11 12
    Mandal Parishath Upper
    primary school/ North West
    wing, Ragudu
    1 309 324 0 633 78.83 83.51 0 81.15
    Mandal parishath upper
    primary school/ South west
    wing, Ragudu
    2 320 336 0 656 82.26 84 0 83.14
    Mandal parishath upper
    primary school/ South East
    wing, Ragudu
    3 312 336 0 648 81.46 83.79 0 82.65
    Community hall,
    Shanthinagar Old 2nd Ward 4 285 302 0 587 70.2 74.2 0 72.2
    Community hall,
    Shanthinagar Old 3rd Ward 5 286 304 0 590 69.08 76.19 0 72.57
    Sri Siddartha English
    Medium High School, North
    Wing, Shanthinagar
    6 285 302 0 587 70.9 78.04 0 74.4
    Mandal Parishath Primary
    school North Wing, Geetha
    nagar
    7 299 333 0 632 77.66 79.86 0 78.8
    Mandal Parishath Primary
    school North East Wing,
    Geetha nagar
    8 300 319 0 619 78.53 76.68 0 77.57
    Zilla Parishath High School
    Girls, West Wing, Geetha
    nagar
    9 271 309 0 580 71.5 74.64 0 73.14
    SIRCILLA MUNICIPALITY
    Shanthinagar 2
    Geethanagar 3
    Final votes polled after closure of poll
    Ragudu 1
    Percentage of Votes polled
    Location Ward
    No. Name of Polling Station PS.No
    రాజన్న సిరిసిల్ల జిల్లా లో ఈరోజు పోలింగ్ శాతం వార్డుల వారీగా Male Female Others Total Male Female Others Total 1 2 3 4 5 6 7 8 9 10 11 12 Mandal Parishath Upper primary school/ North West wing, Ragudu 1 309 324 0 633 78.83 83.51 0 81.15 Mandal parishath upper primary school/ South west wing, Ragudu 2 320 336 0 656 82.26 84 0 83.14 Mandal parishath upper primary school/ South East wing, Ragudu 3 312 336 0 648 81.46 83.79 0 82.65 Community hall, Shanthinagar Old 2nd Ward 4 285 302 0 587 70.2 74.2 0 72.2 Community hall, Shanthinagar Old 3rd Ward 5 286 304 0 590 69.08 76.19 0 72.57 Sri Siddartha English Medium High School, North Wing, Shanthinagar 6 285 302 0 587 70.9 78.04 0 74.4 Mandal Parishath Primary school North Wing, Geetha nagar 7 299 333 0 632 77.66 79.86 0 78.8 Mandal Parishath Primary school North East Wing, Geetha nagar 8 300 319 0 619 78.53 76.68 0 77.57 Zilla Parishath High School Girls, West Wing, Geetha nagar 9 271 309 0 580 71.5 74.64 0 73.14 SIRCILLA MUNICIPALITY Shanthinagar 2 Geethanagar 3 Final votes polled after closure of poll Ragudu 1 Percentage of Votes polled Location Ward No. Name of Polling Station PS.No
    0 Comments 0 Shares 176 Views 0 Reviews
More Results
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com