• మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సిఐటియు

    కుమ్మరి కుంట నాగన్న
    సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు

    ఈరోజు మున్సిపల్ కార్మికుల సమావేశం గాంధీ పార్కులో పుచ్చకాయలు ఎల్లయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కుమ్మరి కుంట్ల నాగన్న పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇస్తామని చెప్పి కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఎన్ ఎమ్ ఆర్ లను పర్మనెంట్ చేస్తామని చెప్పి ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా వేతనం పెంచకుండా కాలయాపన చేస్తున్నారు ఈ బడ్జెట్ సమావేశాల్లో కార్మికులకి కనీస వేతనం పెంచాలని సమాన పనికి సమాన వేతనివ్వాలని ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యం కల్పించాలని ప్రతి కార్మికుడికి వ్యక్తిగత ఇన్సూరెన్స్ 25 లక్షల రూపాయలు చేయించాలని అర్హులైన కార్మికులకు ప్రమోషన్లు ఇవ్వాలని రిటర్మెంట్ బెనిఫిట్స్ కింద పతి కార్మికుడికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని మట్టి ఖర్చుల కింద 50 వేల రూపాయలు ఇవ్వాలని ఇప్పటికే అనేక సందర్భాల్లో ఆందోళన పోరాటలు చేసిన ఎప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ కార్మికుల మీద ఎలాంటి కనికరం లేకుండా కాలయాపన చేస్తున్నారు ఇప్పటికైనా వారికి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేనియెడల రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని చెప్పి ఆయన అన్నారు రేపు జరగబోయే చలో హైదరాబాద్ కార్యక్రమానికి మైబాద్ నుండి కార్మికులు తరలిపోవడం జరుగుతోందని అన్నారు

    ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కాంపల్లి శ్రీనివాస్ పార్నందు కృష్ణ ఇమ్మడి పద్మ మంజుల ముత్తమ్మ ఆవుల ఈరన్న సైదులు మనోహర్ అచ్చమ్మ శ్రీను వెంకన్న రాములు రజిని ఆదాము యాకన్న పద్మ అర్చన మంగమ్మ ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు
    మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సిఐటియు కుమ్మరి కుంట నాగన్న సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఈరోజు మున్సిపల్ కార్మికుల సమావేశం గాంధీ పార్కులో పుచ్చకాయలు ఎల్లయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కుమ్మరి కుంట్ల నాగన్న పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇస్తామని చెప్పి కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఎన్ ఎమ్ ఆర్ లను పర్మనెంట్ చేస్తామని చెప్పి ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా వేతనం పెంచకుండా కాలయాపన చేస్తున్నారు ఈ బడ్జెట్ సమావేశాల్లో కార్మికులకి కనీస వేతనం పెంచాలని సమాన పనికి సమాన వేతనివ్వాలని ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యం కల్పించాలని ప్రతి కార్మికుడికి వ్యక్తిగత ఇన్సూరెన్స్ 25 లక్షల రూపాయలు చేయించాలని అర్హులైన కార్మికులకు ప్రమోషన్లు ఇవ్వాలని రిటర్మెంట్ బెనిఫిట్స్ కింద పతి కార్మికుడికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని మట్టి ఖర్చుల కింద 50 వేల రూపాయలు ఇవ్వాలని ఇప్పటికే అనేక సందర్భాల్లో ఆందోళన పోరాటలు చేసిన ఎప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ కార్మికుల మీద ఎలాంటి కనికరం లేకుండా కాలయాపన చేస్తున్నారు ఇప్పటికైనా వారికి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేనియెడల రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని చెప్పి ఆయన అన్నారు రేపు జరగబోయే చలో హైదరాబాద్ కార్యక్రమానికి మైబాద్ నుండి కార్మికులు తరలిపోవడం జరుగుతోందని అన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కాంపల్లి శ్రీనివాస్ పార్నందు కృష్ణ ఇమ్మడి పద్మ మంజుల ముత్తమ్మ ఆవుల ఈరన్న సైదులు మనోహర్ అచ్చమ్మ శ్రీను వెంకన్న రాములు రజిని ఆదాము యాకన్న పద్మ అర్చన మంగమ్మ ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు
    0 Comments 0 Shares 206 Views 0 Reviews
  • వైసీపీ పాలకవర్గంలో ఆమోదం పొందిన అభివృద్ధి పనులనే బొబ్బిలి మున్సిపాలిటీలో కూటమి పాలకవర్గం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. వైసీపీ కార్యాలయంలో మంగళవారం కౌన్సిలర్లను ఆయన సన్మానించారు.వైసీపీ గుర్తుపై గెలుపొందిన కౌన్సిలర్లు కొంతమంది స్వార్థంతో టీడీపీలో చేరగా చాలామంది వైసీపీలో ఉన్నారన్నారు.
    #Boiena Rajesh
    వైసీపీ పాలకవర్గంలో ఆమోదం పొందిన అభివృద్ధి పనులనే బొబ్బిలి మున్సిపాలిటీలో కూటమి పాలకవర్గం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. వైసీపీ కార్యాలయంలో మంగళవారం కౌన్సిలర్లను ఆయన సన్మానించారు.వైసీపీ గుర్తుపై గెలుపొందిన కౌన్సిలర్లు కొంతమంది స్వార్థంతో టీడీపీలో చేరగా చాలామంది వైసీపీలో ఉన్నారన్నారు. #Boiena Rajesh
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని గృహ యజమానులు మరియు వాణిజ్య గృహ యజమానులకు తెలియజేయునది ఏమనగా, ఆస్తి పన్ను (Property Tax), ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, వివిధ లైసెన్స్ ఫీజులు మరియు ప్రకటనల (Advertisements) ఫీజులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించవలసిందిగా కమిషనర్ గారు విజ్ఞప్తి చేశారు.
    పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, డ్రైనేజ్ వ్యవస్థ బలోపేతం వంటి అభివృద్ధి కార్యక్రమాలు పన్నుల ద్వారా లభించే ఆదాయంతోనే నిర్వహించబడుతున్నాయి. అందువల్ల ప్రతి పన్నుదారుడు తన బాధ్యతగా భావించి బకాయిలు లేకుండా తక్షణమే చెల్లింపులు పూర్తి చేయవలసిందిగా కోరడమైనది.
    ప్రస్తుతం పురపాలక సిబ్బంది మొత్తం పన్నుల వసూళ్లలో నిమగ్నమై, ఇంటింటి సేకరణ, ఫీల్డ్ సందర్శనలు నిర్వహిస్తూ లక్ష్య సాధనకు కృషి చేస్తున్నారు. పట్టణ ప్రజలు సహకరించి సకాలంలో పన్నులు చెల్లించగలరని ఆశిస్తున్నామని కమిషనర్ గారు తెలిపారు.
    సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని గృహ యజమానులు మరియు వాణిజ్య గృహ యజమానులకు తెలియజేయునది ఏమనగా, ఆస్తి పన్ను (Property Tax), ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, వివిధ లైసెన్స్ ఫీజులు మరియు ప్రకటనల (Advertisements) ఫీజులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించవలసిందిగా కమిషనర్ గారు విజ్ఞప్తి చేశారు. పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, డ్రైనేజ్ వ్యవస్థ బలోపేతం వంటి అభివృద్ధి కార్యక్రమాలు పన్నుల ద్వారా లభించే ఆదాయంతోనే నిర్వహించబడుతున్నాయి. అందువల్ల ప్రతి పన్నుదారుడు తన బాధ్యతగా భావించి బకాయిలు లేకుండా తక్షణమే చెల్లింపులు పూర్తి చేయవలసిందిగా కోరడమైనది. ప్రస్తుతం పురపాలక సిబ్బంది మొత్తం పన్నుల వసూళ్లలో నిమగ్నమై, ఇంటింటి సేకరణ, ఫీల్డ్ సందర్శనలు నిర్వహిస్తూ లక్ష్య సాధనకు కృషి చేస్తున్నారు. పట్టణ ప్రజలు సహకరించి సకాలంలో పన్నులు చెల్లించగలరని ఆశిస్తున్నామని కమిషనర్ గారు తెలిపారు.
    0 Comments 0 Shares 214 Views 0 Reviews
  • సిరిసిల్లలో నీటి సరఫరా కు అంతరాయం..

    అందరికీ నమస్కారం, ఇందుమూలముగా తెలియజేయునది ఏమనగా సిరిసిల్ల లోని 120MLD నీటి శుద్ధి కేంద్రం లో ఆపరేషన్ & మెయింటెనెన్స్ లో భాగంగా మరమత్తుల కొరకు మూడు రోజులు అనగా తేదీ 20-02-2026 (శుక్రవారం), 21-02-2026 (శనివారం) మరియు 22-02-2026(ఆదివారం) ప్లాంట్ నిలిపివేయడం జరుగుతుంది. అందువలన సిరిసిల్ల, వేములవాడ మరియు చొప్ప దండి నియోజకవర్గంలోని అన్నిగ్రామాలకు మరియు మున్సిపాలిటీలకు నీటి సరఫరాకు అంతరాయం కలుగును. తిరిగి అనగా తేదీ 23-02-2026 (సోమవారం) రోజున తిరిగి మిషన్ భగీరథ నీటి సరఫరాను పునరుద్ధరిస్తాము. అంతవరకు గ్రామాలలో మరియు సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి మున్సిపాలిటీలలో ప్రతామాయ ఏర్పాట్లు చేసుకోగలరని మనవి.

    ఇట్లు,

    Qum Per (Md.Muzahid Anwar) కార్యనిర్వాహక ఇంజనీర్ మిషన్ భగీరథ, గ్రిడ్ డివిజన్ సిరిసిల్ల
    సిరిసిల్లలో నీటి సరఫరా కు అంతరాయం.. అందరికీ నమస్కారం, ఇందుమూలముగా తెలియజేయునది ఏమనగా సిరిసిల్ల లోని 120MLD నీటి శుద్ధి కేంద్రం లో ఆపరేషన్ & మెయింటెనెన్స్ లో భాగంగా మరమత్తుల కొరకు మూడు రోజులు అనగా తేదీ 20-02-2026 (శుక్రవారం), 21-02-2026 (శనివారం) మరియు 22-02-2026(ఆదివారం) ప్లాంట్ నిలిపివేయడం జరుగుతుంది. అందువలన సిరిసిల్ల, వేములవాడ మరియు చొప్ప దండి నియోజకవర్గంలోని అన్నిగ్రామాలకు మరియు మున్సిపాలిటీలకు నీటి సరఫరాకు అంతరాయం కలుగును. తిరిగి అనగా తేదీ 23-02-2026 (సోమవారం) రోజున తిరిగి మిషన్ భగీరథ నీటి సరఫరాను పునరుద్ధరిస్తాము. అంతవరకు గ్రామాలలో మరియు సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి మున్సిపాలిటీలలో ప్రతామాయ ఏర్పాట్లు చేసుకోగలరని మనవి. ఇట్లు, Qum Per (Md.Muzahid Anwar) కార్యనిర్వాహక ఇంజనీర్ మిషన్ భగీరథ, గ్రిడ్ డివిజన్ సిరిసిల్ల
    0 Comments 0 Shares 178 Views 0 Reviews
  • సిరిసిల్ల మునిసిపల్ చైర్ పర్సన్ గా "జిందంకళ"

    * బిఆర్ఎస్ అధిష్టానం ఆశీర్వాదం మళ్లీ జిందం కళ కే..

    * వైస్ చైర్మన్ గా దార్ల సందీప్.

    * విలీన గ్రామాలకు విప్ తో సరి.

    .* సిరిసిల్ల మున్సిపల్లో కేటీఆర్ వ్యూహం.

    * యువతకు ప్రాధాన్యం.

    రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పటికప్పుడు అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటునే ఉన్నాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మాత్రం రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులకు భిన్నంగా సిరిసిల్ల ఓటర్లు తీర్పు ఇవ్వడం గమనార్హం.

    భారత రాష్ట్ర సమితికి సిరిసిల్ల కంచుకోటల ఉంటూ వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు లు కల్వకుంట్ల తారక రామారావుకు వరుస విజయాలను అందిస్తూ వచ్చింది. గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోను రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సిరిసిల్ల నియోజకవర్గంలోనే అత్యధిక సర్పంచ్ లను అందించింది సిరిసిల్ల నియోజకవర్గంమే. అధికారంలో ఉన్నప్పుడు సిరిసిల్ల మున్సిపాలిటీలో 22 స్థానాలకే పరిమితమైన ఈసారి మున్సిపల్ లో 27 స్థానాలను అందించిందిన ఘనత కూడాసిరిసిల్ల దే.

    అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్న వైరుధ్యాలను తెలివిగా భారత రాష్ట్రపతి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తెలివిగా ఉపయోగించుకొని ప్రత్యర్థులు ఎత్తుగడలను తిప్పి కొట్టారనే చెప్పవచ్చు. అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం 6 గురు కౌన్సిలర్ లను గెలిపించుకోగా. భారత రాష్ట్ర సమితి మాత్రం బలమైన శక్తిగా ముందుకు రావడం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపిన అంశం. 22 కౌన్సిలర్ స్థానాల నుంచి ప్రతిపక్షంలో ఉండి కూడా ఏకంగా 27 స్థానాలు సాధించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భారత రాష్ట్రపతి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సిరిసిల్ల మున్సిపాలిటీ చేజిక్కించుకోవడం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఆయన వ్యూహం ఫలించి భారీ విజయం సాధించారు.

    * చైర్పర్సన్ గా మరోసారి జిందం కళ..

    సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎవరిని ఎన్నిక చేస్తారని విషయంలో అనేక ఊహగానాలు తెరపైకి వచ్చాయి. ఈసారి కొత్తవారికి అవకాశం ఉంటుందనే అంచనాల్లో ఆ నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు సీనియర్ కౌన్సిల్ సభ్యులు చైర్మన్ పీఠం ఆశించారు. కేటీఆర్ వ్యూహాత్మకంగా మళ్లీ "జిందం కళ చక్రపాని"కే మునిసిపల్ పగ్గాలు అప్పగించి రాజకీయ పరిశీలకుల అంచనాలను తలకిందులు చేశారు.

    * వైస్ చైర్మన్ గా "దార్ల సందీప్."

    మున్సిపల్ పాలకవర్గం సమర్థవంతంగా నడిపించడం కోసం పాత కొత్తల మేలవింపుతో వ్యవహరించినట్లు కనిపిస్తోంది. సిరిసిల్ల కార్మిక వాడ బద్దం ఎల్లారెడ్డి నగర్ నుంచి గెలుపొందిన యువ నాయకులు "దార్ల సందీప్" మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎంపిక చేయడం కేటీఆర్ ముందుచూపు తో వ్యవహరించినట్లు కనిపిస్తుందని ఓ సీనియర్ నాయకుడు స్పష్టం చేశారు.

    * విలీన గ్రామాలకు విప్ తో సరి..

    సిరిసిల్ల మున్సిపల్ పాలకవర్గ కూర్పులో భారత రాష్ట్రపతి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు ప్రజల అంచనాలను పరిగణలోకి తీసుకొని వ్యూహాత్మకంగా వ్యవహరించిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే తప్పని సరిగా విలీన గ్రామాల నుంచి వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని ఆశించిన ప్రజలకు కొంత నిరాశే మిగిలినట్లు కనిపించిన 24వ వార్డు నుంచి ఎంపికైన బుర్ర మల్లికార్జున్ గౌడ్ కు విప్ గా బాధ్యతలు అప్పగించడం విలీన గ్రామాల ప్రజలకు కొంత ఊరట కలిగించిందనే చెప్పాలి.

    * అలకలు ఏ పరిణామాలకు దారి తీస్తాయో..!

    సరిగ్గా మున్సిపల్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధం అవుతుండగా భారత రాష్ట్ర సమితి లో అనైక్యత కు కారణం అవుతుందా..! అన్న అంశం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఆశించిన బుర్ర నారాయణ గౌడ్ తనకు మాట ఇచ్చి మరొకరికి వైస్ చైర్మన్ పదవి ఎలా ఇస్తారంట నిలదీయడం తర్వాత నాయకులు బుజ్జగించడం ఆయన శాంతించడం జరిగిపోయింది. మొత్తానికి మున్సిపల్ పాలకవర్గంలో యువతకు ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తుంది వ్యూహాత్మకంగా వ్యవహరించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు వ్యూహం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడవలసి ఉంది. రాష్ట్రంలో అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల మున్సిపాలిటీలు భారత రాష్ట్ర సమితి పాలకవర్గం కొలువు తీరిన పరిస్థితులు. భిన్నమైన పరిస్థితులు సిరిసిల్ల మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతాయే అన్నది వేచి చూడవలసిందే.

    _ అల్లే రమేష్. సిరిసిల్ల.
    సిరిసిల్ల మునిసిపల్ చైర్ పర్సన్ గా "జిందంకళ" * బిఆర్ఎస్ అధిష్టానం ఆశీర్వాదం మళ్లీ జిందం కళ కే.. * వైస్ చైర్మన్ గా దార్ల సందీప్. * విలీన గ్రామాలకు విప్ తో సరి. .* సిరిసిల్ల మున్సిపల్లో కేటీఆర్ వ్యూహం. * యువతకు ప్రాధాన్యం. రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పటికప్పుడు అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటునే ఉన్నాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మాత్రం రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులకు భిన్నంగా సిరిసిల్ల ఓటర్లు తీర్పు ఇవ్వడం గమనార్హం. భారత రాష్ట్ర సమితికి సిరిసిల్ల కంచుకోటల ఉంటూ వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు లు కల్వకుంట్ల తారక రామారావుకు వరుస విజయాలను అందిస్తూ వచ్చింది. గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోను రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సిరిసిల్ల నియోజకవర్గంలోనే అత్యధిక సర్పంచ్ లను అందించింది సిరిసిల్ల నియోజకవర్గంమే. అధికారంలో ఉన్నప్పుడు సిరిసిల్ల మున్సిపాలిటీలో 22 స్థానాలకే పరిమితమైన ఈసారి మున్సిపల్ లో 27 స్థానాలను అందించిందిన ఘనత కూడాసిరిసిల్ల దే. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్న వైరుధ్యాలను తెలివిగా భారత రాష్ట్రపతి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తెలివిగా ఉపయోగించుకొని ప్రత్యర్థులు ఎత్తుగడలను తిప్పి కొట్టారనే చెప్పవచ్చు. అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం 6 గురు కౌన్సిలర్ లను గెలిపించుకోగా. భారత రాష్ట్ర సమితి మాత్రం బలమైన శక్తిగా ముందుకు రావడం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపిన అంశం. 22 కౌన్సిలర్ స్థానాల నుంచి ప్రతిపక్షంలో ఉండి కూడా ఏకంగా 27 స్థానాలు సాధించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భారత రాష్ట్రపతి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సిరిసిల్ల మున్సిపాలిటీ చేజిక్కించుకోవడం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఆయన వ్యూహం ఫలించి భారీ విజయం సాధించారు. * చైర్పర్సన్ గా మరోసారి జిందం కళ.. సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎవరిని ఎన్నిక చేస్తారని విషయంలో అనేక ఊహగానాలు తెరపైకి వచ్చాయి. ఈసారి కొత్తవారికి అవకాశం ఉంటుందనే అంచనాల్లో ఆ నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు సీనియర్ కౌన్సిల్ సభ్యులు చైర్మన్ పీఠం ఆశించారు. కేటీఆర్ వ్యూహాత్మకంగా మళ్లీ "జిందం కళ చక్రపాని"కే మునిసిపల్ పగ్గాలు అప్పగించి రాజకీయ పరిశీలకుల అంచనాలను తలకిందులు చేశారు. * వైస్ చైర్మన్ గా "దార్ల సందీప్." మున్సిపల్ పాలకవర్గం సమర్థవంతంగా నడిపించడం కోసం పాత కొత్తల మేలవింపుతో వ్యవహరించినట్లు కనిపిస్తోంది. సిరిసిల్ల కార్మిక వాడ బద్దం ఎల్లారెడ్డి నగర్ నుంచి గెలుపొందిన యువ నాయకులు "దార్ల సందీప్" మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎంపిక చేయడం కేటీఆర్ ముందుచూపు తో వ్యవహరించినట్లు కనిపిస్తుందని ఓ సీనియర్ నాయకుడు స్పష్టం చేశారు. * విలీన గ్రామాలకు విప్ తో సరి.. సిరిసిల్ల మున్సిపల్ పాలకవర్గ కూర్పులో భారత రాష్ట్రపతి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు ప్రజల అంచనాలను పరిగణలోకి తీసుకొని వ్యూహాత్మకంగా వ్యవహరించిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే తప్పని సరిగా విలీన గ్రామాల నుంచి వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని ఆశించిన ప్రజలకు కొంత నిరాశే మిగిలినట్లు కనిపించిన 24వ వార్డు నుంచి ఎంపికైన బుర్ర మల్లికార్జున్ గౌడ్ కు విప్ గా బాధ్యతలు అప్పగించడం విలీన గ్రామాల ప్రజలకు కొంత ఊరట కలిగించిందనే చెప్పాలి. * అలకలు ఏ పరిణామాలకు దారి తీస్తాయో..! సరిగ్గా మున్సిపల్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధం అవుతుండగా భారత రాష్ట్ర సమితి లో అనైక్యత కు కారణం అవుతుందా..! అన్న అంశం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఆశించిన బుర్ర నారాయణ గౌడ్ తనకు మాట ఇచ్చి మరొకరికి వైస్ చైర్మన్ పదవి ఎలా ఇస్తారంట నిలదీయడం తర్వాత నాయకులు బుజ్జగించడం ఆయన శాంతించడం జరిగిపోయింది. మొత్తానికి మున్సిపల్ పాలకవర్గంలో యువతకు ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తుంది వ్యూహాత్మకంగా వ్యవహరించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు వ్యూహం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడవలసి ఉంది. రాష్ట్రంలో అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల మున్సిపాలిటీలు భారత రాష్ట్ర సమితి పాలకవర్గం కొలువు తీరిన పరిస్థితులు. భిన్నమైన పరిస్థితులు సిరిసిల్ల మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతాయే అన్నది వేచి చూడవలసిందే. _ అల్లే రమేష్. సిరిసిల్ల.
    0 Comments 0 Shares 170 Views 0 Reviews
  • రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లాలో మున్సిపాలిటీలలో జెండా ఎగిరేసేది ఎవరు..!

    * జిల్లాలో పోలింగ్ ప్రశాంతం_77% పోలింగ్.

    *బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం.

    * సిరిసిల్లాలో కీలకం కానున్న స్వతంత్రులు.

    * వేములవాడలో "త్రిముఖ" పోటీ.

    రాజన్న సిరిసిల్ల జిల్లాలో మునిసిపల్ ఎన్నికలపై ప్రత్యేకం.

    హోరెత్తిన మైకులు.. ప్రలోభాల "ఏరా" లను దాటుకొని రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ప్రస్తుతానికి బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా ఉంది. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో ఎవరు జెండా ఎగిరేస్తారని అంశంపై ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది.

    అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరగడమే కాకుండా 77. 70 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 39 వార్డుల్లో 117 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 39,492 పురుషులు, 42,011 స్త్రీలు ఇతరులు 5, మొత్తం 63, 562 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు . మొత్తంగా 77.55 శాతం ఓటింగ్ నమోదు అయింది. అత్యధికంగా మహిళలు ఓటు హక్కు వినియోగించుకోవడం గమనించవచ్చు.

    ముఖ్యంగా సిరిసిల్ల మున్సిపాలిటీలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి,భారతీయ జనతా పార్టీతో పాటు, స్వతంత్ర అభ్యర్థులు పోటీపడ్డారు. ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. సిరిసిల్ల మున్సిపల్ పీఠం దక్కించుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. గత మున్సిపాలిటీ ఎన్నికల్లో టిఆర్ఎస్ 22, బిజెపి 3, కాంగ్రెస్ 2 కౌన్సిలర్ అభ్యర్థులను గెలుచుకున్నాయి. సిరిసిల్ల మున్సిపల్ పీఠంపై అప్పట్లో భారత రాష్ట్ర సమితి జెండా ఎగురవేసిన విషయం తెలిసిందే.

    ఈసారి ఫలితాలు మాత్రం ఆసక్తికరంగా ఉండేట్టు కనిపిస్తోంది. సిరిసిల్ల మున్సిపాలిటీ పై జెండా
    ఎగరవేసేందుకు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతుండగా ఈసారి మాత్రం స్వతంత్రంగా గెలుపొందిన అభ్యర్థులే కీలకం కానున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఎక్కడ చూసిన ప్రస్తుతానికి ఈ అంశం పైనే జోరుగా చర్చలు నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.

    *వేములవాడ మున్సిపాలిటీలో..

    రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న రెండు మున్సిపాలిటీలలో రెండవది వేములవాడ మున్సిపాలిటీ 28 మంది కౌన్సిల్ సభ్యులు ఉండగా 58 మంది కౌన్సిలర్ అభ్యర్థులు పోటీ పడ్డారు. వేములవాడ మున్సిపాలిటీలు ప్రధానంగా త్రిముఖ పోటీ జరిగిందని చెప్పవచ్చు. గతంలో టిఆర్ఎస్ 16, బిజెపి 6, కాంగ్రెస్ 1 గెలుపొందగా ఈసారి భిన్నమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో 19,580 మంది పురుషులు, 21 279 మంది మహిళలు ఇతరులు 10 ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 1,22,836 మంది ఓటర్లు ఉండగా 95, 443 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 77.70 శాతం పోలీస్ నమోదైనట్లు అధికారులు ధ్రువీకరించారు. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ కూడా మహిళలే అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి. ఫలితాలపై ఎవరి అంచనాలు వారికి ఉండగా వేములవాడ మున్సిపల్ పీఠంపై జెండా ఎవరు ఎగరేస్తారన్నది వేసి చూడవలసి ఉంది.

    మొత్తానికి సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలలో జరిగే రాజకీయ సమీకరణలు, వ్యూహ ప్రతి వ్యూహాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయే అన్న చర్చ విస్తృతంగా రెండు మున్సిపాలిటీలలో నడుస్తుంది. గతంలో మునిసిపాలిటీల్లో వచ్చిన ఫలితాలకు భిన్నంగా ఈసారి ఫలితాలు ఉంటాయన్నది పరిశీలగుల అంచనా. పోలింగ్ ప్రశాంతంగా జరగడం కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికి సిరిసిల్ల వేములవాడ మున్సిపాలిటీలలోని కౌన్సిలర్ అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా ఉంది. విజయం ఎవర్ని వరిస్తుందన్నది తుది ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సిందే..

    రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లాలో మున్సిపాలిటీలలో జెండా ఎగిరేసేది ఎవరు..! * జిల్లాలో పోలింగ్ ప్రశాంతం_77% పోలింగ్. *బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం. * సిరిసిల్లాలో కీలకం కానున్న స్వతంత్రులు. * వేములవాడలో "త్రిముఖ" పోటీ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మునిసిపల్ ఎన్నికలపై ప్రత్యేకం. హోరెత్తిన మైకులు.. ప్రలోభాల "ఏరా" లను దాటుకొని రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ప్రస్తుతానికి బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా ఉంది. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో ఎవరు జెండా ఎగిరేస్తారని అంశంపై ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరగడమే కాకుండా 77. 70 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 39 వార్డుల్లో 117 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 39,492 పురుషులు, 42,011 స్త్రీలు ఇతరులు 5, మొత్తం 63, 562 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు . మొత్తంగా 77.55 శాతం ఓటింగ్ నమోదు అయింది. అత్యధికంగా మహిళలు ఓటు హక్కు వినియోగించుకోవడం గమనించవచ్చు. ముఖ్యంగా సిరిసిల్ల మున్సిపాలిటీలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి,భారతీయ జనతా పార్టీతో పాటు, స్వతంత్ర అభ్యర్థులు పోటీపడ్డారు. ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. సిరిసిల్ల మున్సిపల్ పీఠం దక్కించుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. గత మున్సిపాలిటీ ఎన్నికల్లో టిఆర్ఎస్ 22, బిజెపి 3, కాంగ్రెస్ 2 కౌన్సిలర్ అభ్యర్థులను గెలుచుకున్నాయి. సిరిసిల్ల మున్సిపల్ పీఠంపై అప్పట్లో భారత రాష్ట్ర సమితి జెండా ఎగురవేసిన విషయం తెలిసిందే. ఈసారి ఫలితాలు మాత్రం ఆసక్తికరంగా ఉండేట్టు కనిపిస్తోంది. సిరిసిల్ల మున్సిపాలిటీ పై జెండా ఎగరవేసేందుకు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతుండగా ఈసారి మాత్రం స్వతంత్రంగా గెలుపొందిన అభ్యర్థులే కీలకం కానున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఎక్కడ చూసిన ప్రస్తుతానికి ఈ అంశం పైనే జోరుగా చర్చలు నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. *వేములవాడ మున్సిపాలిటీలో.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న రెండు మున్సిపాలిటీలలో రెండవది వేములవాడ మున్సిపాలిటీ 28 మంది కౌన్సిల్ సభ్యులు ఉండగా 58 మంది కౌన్సిలర్ అభ్యర్థులు పోటీ పడ్డారు. వేములవాడ మున్సిపాలిటీలు ప్రధానంగా త్రిముఖ పోటీ జరిగిందని చెప్పవచ్చు. గతంలో టిఆర్ఎస్ 16, బిజెపి 6, కాంగ్రెస్ 1 గెలుపొందగా ఈసారి భిన్నమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో 19,580 మంది పురుషులు, 21 279 మంది మహిళలు ఇతరులు 10 ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 1,22,836 మంది ఓటర్లు ఉండగా 95, 443 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 77.70 శాతం పోలీస్ నమోదైనట్లు అధికారులు ధ్రువీకరించారు. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ కూడా మహిళలే అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి. ఫలితాలపై ఎవరి అంచనాలు వారికి ఉండగా వేములవాడ మున్సిపల్ పీఠంపై జెండా ఎవరు ఎగరేస్తారన్నది వేసి చూడవలసి ఉంది. మొత్తానికి సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలలో జరిగే రాజకీయ సమీకరణలు, వ్యూహ ప్రతి వ్యూహాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయే అన్న చర్చ విస్తృతంగా రెండు మున్సిపాలిటీలలో నడుస్తుంది. గతంలో మునిసిపాలిటీల్లో వచ్చిన ఫలితాలకు భిన్నంగా ఈసారి ఫలితాలు ఉంటాయన్నది పరిశీలగుల అంచనా. పోలింగ్ ప్రశాంతంగా జరగడం కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికి సిరిసిల్ల వేములవాడ మున్సిపాలిటీలలోని కౌన్సిలర్ అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా ఉంది. విజయం ఎవర్ని వరిస్తుందన్నది తుది ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సిందే..
    0 Comments 0 Shares 122 Views 0 Reviews

  • ఈరోజు భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికలలో ప్రచారంలో భాగంగా భూపాలపల్లికి మధ్యాహ్నం మల్లన్న గారికి స్వాగతం పలుకుతారు
    ఈరోజు భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికలలో ప్రచారంలో భాగంగా భూపాలపల్లికి మధ్యాహ్నం మల్లన్న గారికి స్వాగతం పలుకుతారు
    0 Comments 0 Shares 278 Views 0 Reviews
  • రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లాలను సాధించుకున్న కాంగ్రెస్ జిల్లాలకు వ్యతిరేకం కానే కాదు

    ఓట్ల కోసం
    తుపాకీ రామని మాటలు కట్టిపెట్టు కేటీఆర్



    డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని డబ్బా ఇల్లు కూడా ఇవ్వలేదు

    దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లు అందిన కాడికి దోసుకు తిన్నారు

    చేనేత కార్మికుల ఓట్లతో గెలిచిన కేటీఆర్ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిండు

    చురకలు ప్రతినిధి ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 06 :

    మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికల్లో ఓట్లను దండుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే జిల్లాలు రద్ద అవుతాయని
    సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ కుట్రపూరితంగా తుపాకి రామని మాటలు మాట్లాడుతున్నారని జిల్లాలను సాధించుకున్న కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కానే కాదని సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి స్పష్టం చేశారు,
    సిరిసిల్ల మునిసిపాలిటీ 20వ వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు,
    20 వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఇప్ప పూల లక్ష్మన్ కు చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు,
    నిరుపేదలందరికీ డబల్ బెడ్ రూములు ఇస్తామని చెప్పి ఓక్క డబ్బా బెడ్రూం కూడా ఇవ్వలేదని ఆయన దుయ్యబట్టారు,
    రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల మున్సిపాలిటీ లో 900 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగిందన్నారు రెండవ విడత కూడా మరో 900 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు,
    చేనేత కార్మికుల ఓట్లతో గెలిచిన కేటీఆర్ చేనేత కార్మికుల ఆత్మగౌరవాణి దెబ్బతీసిండని 375 కోట్ల
    రూపాయల అప్పులు చేస్తే మిత్తితో సహా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి చెల్లించడం జరిగిందన్నారు, బతుకమ్మ చీరల పేరిట మహిళలను మోసం చేసి కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు, బతుకమ్మ చీరలను చేనులకాడా బెదురు పెట్టుకోడానికి , స్టీల్ గిన్నెలకు అమ్ముకోవడం నిజామా? కాదా ? అని మహిళలను ఆయన ప్రశ్నించారు,
    సీఎం రేవంత్ రెడ్డి మహిళల ఆత్మగౌరవం నిలిపే విధంగా ఇందిరమ్మ శ్రీ మహిళా శక్తి చీరలను మహిళలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు,
    మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించి 9 వేల 200 కోట్ల రూపాయల బస్సు చార్జీలను రేవంత్ రెడ్డి సర్కార్ ఆర్టీసీకి చెల్లించడం జరిగిందన్నారు, పేదవారు కూడా సుఖంగా నిద్రించడానికి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా అందజేస్తూ సుమారు 3 వేల 500 కోట్లు ప్రభుత్వం విద్యుత్ సమస్థ కు కట్టిందన్నారు,
    కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో సి ఎం రేవంత్ రెడ్డి మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని
    పెట్రోలు బంకులు విత్తన, ఎరువుల విక్రయ కేంద్రాలు రైస్ మిల్లులు సోలార్ విద్యుత్ కేంద్రాలు మహిళా సంఘాల ద్వారా మహిళలకే కేటాయించడం జరుగుతుందన్నారు,
    పదేళ్ల కెసిఆర్ పాలనలో రిటర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ జరగలేదని నిరుద్యోగాలకు ఉద్యోగాలు లేకపోయినా కేసిఆర్ ఇంట్లో నలుగురికి ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు, కెసిఆర్ హాయంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేకపోయినా రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలో రేషన్ కార్డులు సన్నబియ్యం ఇస్తున్న మాట వాస్తవమా కాదా అని ఆయన ఓటర్ల ను ప్రశ్నించారు,
    పెద్దవారితో సమానంగా పేదవారు కూడా సన్న బియ్యం అన్నం సంతృప్తి గా తినాలని సన్నబియ్యం ఇస్తున్నామని అన్నారు , సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తో సహా ఎంగిలి మెతుకులు తినే కొందరు బిఆర్ఎస్ నాయకులు దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లు అవినీతి ఆక్రమాలకు పాల్పడి తిన్నారని దోసుకొని దాసుకొని తిన్నారని ఆయన దుయ్యబట్టారు పదేళ్ల బిఆర్ఎస్, పాలన రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందో ఆలోచన చేసి సిరిసిల్ల మునిసిపాలిటీ లో సిరిసిల్ల ఓటర్లు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు,
    జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ జిల్లా నాయకులు చక్రధర్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో చేస్తున్నా పనులను గుర్తించి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు, ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయాల చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ 20 వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి లక్ష్మణ్, మాజీ ఏఎంసీ చైర్మన్ గడ్డం నరసయ్య, బొప్పా దేవయ్య, ఎల్లారెడ్డిపేట మండల సర్పంచ్ల పోరం అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్రెడ్డి నంది కిషన్ గుర్రాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు, ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
    రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లాలను సాధించుకున్న కాంగ్రెస్ జిల్లాలకు వ్యతిరేకం కానే కాదు ఓట్ల కోసం తుపాకీ రామని మాటలు కట్టిపెట్టు కేటీఆర్ డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని డబ్బా ఇల్లు కూడా ఇవ్వలేదు దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లు అందిన కాడికి దోసుకు తిన్నారు చేనేత కార్మికుల ఓట్లతో గెలిచిన కేటీఆర్ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిండు చురకలు ప్రతినిధి ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 06 : మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికల్లో ఓట్లను దండుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే జిల్లాలు రద్ద అవుతాయని సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ కుట్రపూరితంగా తుపాకి రామని మాటలు మాట్లాడుతున్నారని జిల్లాలను సాధించుకున్న కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కానే కాదని సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి స్పష్టం చేశారు, సిరిసిల్ల మునిసిపాలిటీ 20వ వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు, 20 వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఇప్ప పూల లక్ష్మన్ కు చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు, నిరుపేదలందరికీ డబల్ బెడ్ రూములు ఇస్తామని చెప్పి ఓక్క డబ్బా బెడ్రూం కూడా ఇవ్వలేదని ఆయన దుయ్యబట్టారు, రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల మున్సిపాలిటీ లో 900 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగిందన్నారు రెండవ విడత కూడా మరో 900 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు, చేనేత కార్మికుల ఓట్లతో గెలిచిన కేటీఆర్ చేనేత కార్మికుల ఆత్మగౌరవాణి దెబ్బతీసిండని 375 కోట్ల రూపాయల అప్పులు చేస్తే మిత్తితో సహా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి చెల్లించడం జరిగిందన్నారు, బతుకమ్మ చీరల పేరిట మహిళలను మోసం చేసి కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు, బతుకమ్మ చీరలను చేనులకాడా బెదురు పెట్టుకోడానికి , స్టీల్ గిన్నెలకు అమ్ముకోవడం నిజామా? కాదా ? అని మహిళలను ఆయన ప్రశ్నించారు, సీఎం రేవంత్ రెడ్డి మహిళల ఆత్మగౌరవం నిలిపే విధంగా ఇందిరమ్మ శ్రీ మహిళా శక్తి చీరలను మహిళలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించి 9 వేల 200 కోట్ల రూపాయల బస్సు చార్జీలను రేవంత్ రెడ్డి సర్కార్ ఆర్టీసీకి చెల్లించడం జరిగిందన్నారు, పేదవారు కూడా సుఖంగా నిద్రించడానికి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా అందజేస్తూ సుమారు 3 వేల 500 కోట్లు ప్రభుత్వం విద్యుత్ సమస్థ కు కట్టిందన్నారు, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో సి ఎం రేవంత్ రెడ్డి మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని పెట్రోలు బంకులు విత్తన, ఎరువుల విక్రయ కేంద్రాలు రైస్ మిల్లులు సోలార్ విద్యుత్ కేంద్రాలు మహిళా సంఘాల ద్వారా మహిళలకే కేటాయించడం జరుగుతుందన్నారు, పదేళ్ల కెసిఆర్ పాలనలో రిటర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ జరగలేదని నిరుద్యోగాలకు ఉద్యోగాలు లేకపోయినా కేసిఆర్ ఇంట్లో నలుగురికి ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు, కెసిఆర్ హాయంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేకపోయినా రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలో రేషన్ కార్డులు సన్నబియ్యం ఇస్తున్న మాట వాస్తవమా కాదా అని ఆయన ఓటర్ల ను ప్రశ్నించారు, పెద్దవారితో సమానంగా పేదవారు కూడా సన్న బియ్యం అన్నం సంతృప్తి గా తినాలని సన్నబియ్యం ఇస్తున్నామని అన్నారు , సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తో సహా ఎంగిలి మెతుకులు తినే కొందరు బిఆర్ఎస్ నాయకులు దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లు అవినీతి ఆక్రమాలకు పాల్పడి తిన్నారని దోసుకొని దాసుకొని తిన్నారని ఆయన దుయ్యబట్టారు పదేళ్ల బిఆర్ఎస్, పాలన రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందో ఆలోచన చేసి సిరిసిల్ల మునిసిపాలిటీ లో సిరిసిల్ల ఓటర్లు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ జిల్లా నాయకులు చక్రధర్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో చేస్తున్నా పనులను గుర్తించి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు, ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయాల చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ 20 వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి లక్ష్మణ్, మాజీ ఏఎంసీ చైర్మన్ గడ్డం నరసయ్య, బొప్పా దేవయ్య, ఎల్లారెడ్డిపేట మండల సర్పంచ్ల పోరం అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్రెడ్డి నంది కిషన్ గుర్రాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు, ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
    0 Comments 0 Shares 139 Views 0 Reviews
  • రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ ఎన్నికల వేళ మున్సిపల్ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు..

    రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని.

    మున్సిపల్ ఎన్నికల పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల సంఘం కమిషనర్.

    హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్.

    రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 02 : మున్సిపల్ ఎన్నికలకు కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల పై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ.. పురపాలక ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం కట్టుదిట్టంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రకటన, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు నిబంధనల ప్రకారం జరగాలని సూచించారు. ‌పోలింగ్ కు అవసరమైన మేర బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పత్రాలు సిద్ధం చేసుకోవాలని, పోలింగ్ బృందాలు, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని అన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద స్ట్రాంగ్ రూమ్ లలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. కౌంటింగ్ ముగిసిన తర్వాత మున్సిపాలిటీలలో చైర్ పర్సన్, కార్పొరేషన్లలో మేయర్ ఎన్నిక కోసం సంసిద్ధం కావాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్ కుమార్, ప్రవీణ్, అన్సార్, మీర్జా ఫసహత్ అలీ బేగ్ తదితరులు పాల్గొన్నారు.
    రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ ఎన్నికల వేళ మున్సిపల్ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు.. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని. మున్సిపల్ ఎన్నికల పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల సంఘం కమిషనర్. హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్. రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 02 : మున్సిపల్ ఎన్నికలకు కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల పై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ.. పురపాలక ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం కట్టుదిట్టంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రకటన, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు నిబంధనల ప్రకారం జరగాలని సూచించారు. ‌పోలింగ్ కు అవసరమైన మేర బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పత్రాలు సిద్ధం చేసుకోవాలని, పోలింగ్ బృందాలు, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని అన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద స్ట్రాంగ్ రూమ్ లలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. కౌంటింగ్ ముగిసిన తర్వాత మున్సిపాలిటీలలో చైర్ పర్సన్, కార్పొరేషన్లలో మేయర్ ఎన్నిక కోసం సంసిద్ధం కావాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్ కుమార్, ప్రవీణ్, అన్సార్, మీర్జా ఫసహత్ అలీ బేగ్ తదితరులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 122 Views 0 Reviews
  • రాజన్న సిరిసిల్ల జిల్లా లో మొదటిసారి జనసేన పార్టీ లో నామినేషన్ *సిరిసిల్ల మున్సిపాలిటీ*
    Deekonda Ashok-13
    Dasari Shekar-25
    Nalla Praveen-11
    Annaram Sai Kumar-26
    Sagala Jeevan-34

    *వేములవాడ మున్సిపాలిటీ*
    Kolagari Chandu-16
    Yedelli Harshak-17
    Chinthapanti Srikrishna-18
    MD Shadhulla -14
    రాజన్న సిరిసిల్ల జిల్లా లో మొదటిసారి జనసేన పార్టీ లో నామినేషన్ *సిరిసిల్ల మున్సిపాలిటీ* Deekonda Ashok-13 Dasari Shekar-25 Nalla Praveen-11 Annaram Sai Kumar-26 Sagala Jeevan-34 *వేములవాడ మున్సిపాలిటీ* Kolagari Chandu-16 Yedelli Harshak-17 Chinthapanti Srikrishna-18 MD Shadhulla -14
    0 Comments 0 Shares 294 Views 0 Reviews
  • రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్ర రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం వేములవాడ పట్టణ కేంద్రంలో పట్టణ అధ్యక్షులు శ్రీ రాపెళ్లి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల విజయ సంకల్ప సమావేశం నిర్వహించారు

    ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి మాజీ మంత్రి శ్రీ ఇనుగాల పెద్ది రెడ్డి గారు మరియు బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డబోయిన గోపి గారు మరియు వేములవాడ నియోజకవర్గం ఇన్చార్జ్ డాక్టర్ శ్రీ చెన్నమనేని వికాస్ రావు గారు హాజరయ్యారు

    ఈ సందర్భంగా వారు గడిచిన రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలకు చిల్లిగవ్వ ఇవ్వలేదనేది స్పష్టంగా తెలుస్తోంది. మున్సిపాలిటీల్లో, అంతోఇంతో అభివృద్ధి పనులు జరిగాయంటే అవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అనేది ప్రజలకు తెలిసిన సత్యం.

    అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నయాపైసా రాదనేది ఎంత సత్యమో, బీఆర్ఎస్ కు ఓటు వేస్తే అది వృధా అనేది కూడా అంతే సత్యం.రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో బిజెపికి ఓటు వేస్తేనే కేంద్రం నుండి నిధులు వస్తాయనే విషయాన్ని ప్రజలు గమనించాలి. తెలంగాణ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో, బిజెపికి పట్టం కట్టాలని కోరుకుంటున్నారు అని అన్నారు

    అదేవిధంగా వేములవాడ పట్టణ అభివృద్ధికి పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీ భవిష్యత్తును నిర్దేశించే కీలక ఎన్నికలని, ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసి పార్టీ బలోపేతానికి అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి వార్డులో ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని, పార్టీ శ్రేణులు అంతా ఐక్యంగా, సమన్వయంతో పనిచేస్తే మున్సిపల్ ఎన్నికల్లో విజయాన్ని సాధించడం ఖాయమని నేతలు ధీమా వ్యక్తం చేశారు.

    ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్ గారు మరియు శ్రీ అల్లాడి రమేష్ బిజెపి రాష్ట్ర నాయకులు జిల్లా మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జ్ శ్రీ లింగంపల్లి శంకర్ గారు మరియు బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కుమ్మరి శంకర్ గారు మరియు స్టేట్ కౌన్సిల్ మెంబర్ శ్రీ కృష్ణ స్వామి గారు వేములవాడ మున్సిపాలిటీ ఇంచార్జి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ సిరికొండ శ్రీనివాస్ గారు జిల్లా ఉప అధ్యక్షులు శ్రీ బండ మల్లేశం, జిల్లా ఎస్సీ మోర్చ అధ్యక్షులు సంటి మహేష్, ,సీనియర్ నాయకులు మల్లికార్జున్,అన్ని మండలాల అధ్యక్షులు, కౌన్సిల్ మెంబర్లు,పట్టణ నాయకులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, యువజన విభాగ నాయకులు, కార్యకర్తలు , ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్ర రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం వేములవాడ పట్టణ కేంద్రంలో పట్టణ అధ్యక్షులు శ్రీ రాపెళ్లి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల విజయ సంకల్ప సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి మాజీ మంత్రి శ్రీ ఇనుగాల పెద్ది రెడ్డి గారు మరియు బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డబోయిన గోపి గారు మరియు వేములవాడ నియోజకవర్గం ఇన్చార్జ్ డాక్టర్ శ్రీ చెన్నమనేని వికాస్ రావు గారు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు గడిచిన రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలకు చిల్లిగవ్వ ఇవ్వలేదనేది స్పష్టంగా తెలుస్తోంది. మున్సిపాలిటీల్లో, అంతోఇంతో అభివృద్ధి పనులు జరిగాయంటే అవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అనేది ప్రజలకు తెలిసిన సత్యం. అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నయాపైసా రాదనేది ఎంత సత్యమో, బీఆర్ఎస్ కు ఓటు వేస్తే అది వృధా అనేది కూడా అంతే సత్యం.రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో బిజెపికి ఓటు వేస్తేనే కేంద్రం నుండి నిధులు వస్తాయనే విషయాన్ని ప్రజలు గమనించాలి. తెలంగాణ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో, బిజెపికి పట్టం కట్టాలని కోరుకుంటున్నారు అని అన్నారు అదేవిధంగా వేములవాడ పట్టణ అభివృద్ధికి పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీ భవిష్యత్తును నిర్దేశించే కీలక ఎన్నికలని, ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసి పార్టీ బలోపేతానికి అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి వార్డులో ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని, పార్టీ శ్రేణులు అంతా ఐక్యంగా, సమన్వయంతో పనిచేస్తే మున్సిపల్ ఎన్నికల్లో విజయాన్ని సాధించడం ఖాయమని నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్ గారు మరియు శ్రీ అల్లాడి రమేష్ బిజెపి రాష్ట్ర నాయకులు జిల్లా మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జ్ శ్రీ లింగంపల్లి శంకర్ గారు మరియు బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కుమ్మరి శంకర్ గారు మరియు స్టేట్ కౌన్సిల్ మెంబర్ శ్రీ కృష్ణ స్వామి గారు వేములవాడ మున్సిపాలిటీ ఇంచార్జి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ సిరికొండ శ్రీనివాస్ గారు జిల్లా ఉప అధ్యక్షులు శ్రీ బండ మల్లేశం, జిల్లా ఎస్సీ మోర్చ అధ్యక్షులు సంటి మహేష్, ,సీనియర్ నాయకులు మల్లికార్జున్,అన్ని మండలాల అధ్యక్షులు, కౌన్సిల్ మెంబర్లు,పట్టణ నాయకులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, యువజన విభాగ నాయకులు, కార్యకర్తలు , ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 197 Views 0 Reviews
  • రాజన్న సిరిసిల్ల జిల్లా మొగిన ఎన్నికల నగర అమలులోకి ఎన్నికల ప్రవర్తన నియమావళి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని.

    ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుండి ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, సీడీఎంఏ సెక్రటరీ శ్రీదేవి తదితరులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించగా, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.

    ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినప్పటి నుండి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని, నామినేషన్ ప్రక్రియ, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలు, జోనల్, నోడల్ అధికారులు, పర్యవేక్షణ బృందాలు, పి ఓ లు, ఎ పి ఓ లు, ఎన్నికల సిబ్బంది నియామకం ప్రతి అంశంలో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమాలని ఖచ్చితంగా పాటించాలని, ఎన్నికల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పోలింగ్, నామినేషన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. ఎన్నికలలో వినియోగించే బ్యాలెట్ బాక్సులు, సామగ్రి, బ్యాలెట్ ప్రింటింగ్ కు అవసరమైన ఏర్పాట్లు, నామినేషన్ స్వీకరణ కేంద్రంలో ఏర్పాట్లు చేయాలని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా పర్యవేక్షించాలని, స్వేచ్ఛగా, నిర్భయంగా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగేందుకు అవసరమైన పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని తెలిపారు.

    ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ జిల్లాలోని సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 39 వార్డులు, వేములవాడ మున్సిపల్ పరిధిలో 28 వార్డులు ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా వెబ్ కాస్టింగ్, నోడల్ అధికారులు, జోనల్ అధికారులు, రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, పి ఓ లు, ఓ పి ఓల నియామకం, శిక్షణ, ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని, అధికారుల సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.

    ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఈఓ జగన్ మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్, ఎన్నికల అధికారులు శ్రీనివాసాచారి, ప్రవీణ్, అన్సర్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, మీర్జా ఫసహత్ అలీ బేగ్ తదితరులు పాల్గొన్నారు.

    రాజన్న సిరిసిల్ల జిల్లా మొగిన ఎన్నికల నగర అమలులోకి ఎన్నికల ప్రవర్తన నియమావళి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుండి ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, సీడీఎంఏ సెక్రటరీ శ్రీదేవి తదితరులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించగా, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినప్పటి నుండి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని, నామినేషన్ ప్రక్రియ, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలు, జోనల్, నోడల్ అధికారులు, పర్యవేక్షణ బృందాలు, పి ఓ లు, ఎ పి ఓ లు, ఎన్నికల సిబ్బంది నియామకం ప్రతి అంశంలో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమాలని ఖచ్చితంగా పాటించాలని, ఎన్నికల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పోలింగ్, నామినేషన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. ఎన్నికలలో వినియోగించే బ్యాలెట్ బాక్సులు, సామగ్రి, బ్యాలెట్ ప్రింటింగ్ కు అవసరమైన ఏర్పాట్లు, నామినేషన్ స్వీకరణ కేంద్రంలో ఏర్పాట్లు చేయాలని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా పర్యవేక్షించాలని, స్వేచ్ఛగా, నిర్భయంగా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగేందుకు అవసరమైన పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ జిల్లాలోని సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 39 వార్డులు, వేములవాడ మున్సిపల్ పరిధిలో 28 వార్డులు ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా వెబ్ కాస్టింగ్, నోడల్ అధికారులు, జోనల్ అధికారులు, రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, పి ఓ లు, ఓ పి ఓల నియామకం, శిక్షణ, ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని, అధికారుల సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఈఓ జగన్ మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్, ఎన్నికల అధికారులు శ్రీనివాసాచారి, ప్రవీణ్, అన్సర్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, మీర్జా ఫసహత్ అలీ బేగ్ తదితరులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 176 Views 0 Reviews
More Results
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com