రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లాలో మున్సిపాలిటీలలో జెండా ఎగిరేసేది ఎవరు..!
* జిల్లాలో పోలింగ్ ప్రశాంతం_77% పోలింగ్.
*బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం.
* సిరిసిల్లాలో కీలకం కానున్న స్వతంత్రులు.
* వేములవాడలో "త్రిముఖ" పోటీ.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మునిసిపల్ ఎన్నికలపై ప్రత్యేకం.
హోరెత్తిన మైకులు.. ప్రలోభాల "ఏరా" లను దాటుకొని రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ప్రస్తుతానికి బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా ఉంది. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో ఎవరు జెండా ఎగిరేస్తారని అంశంపై ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరగడమే కాకుండా 77. 70 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 39 వార్డుల్లో 117 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 39,492 పురుషులు, 42,011 స్త్రీలు ఇతరులు 5, మొత్తం 63, 562 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు . మొత్తంగా 77.55 శాతం ఓటింగ్ నమోదు అయింది. అత్యధికంగా మహిళలు ఓటు హక్కు వినియోగించుకోవడం గమనించవచ్చు.
ముఖ్యంగా సిరిసిల్ల మున్సిపాలిటీలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి,భారతీయ జనతా పార్టీతో పాటు, స్వతంత్ర అభ్యర్థులు పోటీపడ్డారు. ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. సిరిసిల్ల మున్సిపల్ పీఠం దక్కించుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. గత మున్సిపాలిటీ ఎన్నికల్లో టిఆర్ఎస్ 22, బిజెపి 3, కాంగ్రెస్ 2 కౌన్సిలర్ అభ్యర్థులను గెలుచుకున్నాయి. సిరిసిల్ల మున్సిపల్ పీఠంపై అప్పట్లో భారత రాష్ట్ర సమితి జెండా ఎగురవేసిన విషయం తెలిసిందే.
ఈసారి ఫలితాలు మాత్రం ఆసక్తికరంగా ఉండేట్టు కనిపిస్తోంది. సిరిసిల్ల మున్సిపాలిటీ పై జెండా
ఎగరవేసేందుకు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతుండగా ఈసారి మాత్రం స్వతంత్రంగా గెలుపొందిన అభ్యర్థులే కీలకం కానున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఎక్కడ చూసిన ప్రస్తుతానికి ఈ అంశం పైనే జోరుగా చర్చలు నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
*వేములవాడ మున్సిపాలిటీలో..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న రెండు మున్సిపాలిటీలలో రెండవది వేములవాడ మున్సిపాలిటీ 28 మంది కౌన్సిల్ సభ్యులు ఉండగా 58 మంది కౌన్సిలర్ అభ్యర్థులు పోటీ పడ్డారు. వేములవాడ మున్సిపాలిటీలు ప్రధానంగా త్రిముఖ పోటీ జరిగిందని చెప్పవచ్చు. గతంలో టిఆర్ఎస్ 16, బిజెపి 6, కాంగ్రెస్ 1 గెలుపొందగా ఈసారి భిన్నమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో 19,580 మంది పురుషులు, 21 279 మంది మహిళలు ఇతరులు 10 ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 1,22,836 మంది ఓటర్లు ఉండగా 95, 443 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 77.70 శాతం పోలీస్ నమోదైనట్లు అధికారులు ధ్రువీకరించారు. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ కూడా మహిళలే అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి. ఫలితాలపై ఎవరి అంచనాలు వారికి ఉండగా వేములవాడ మున్సిపల్ పీఠంపై జెండా ఎవరు ఎగరేస్తారన్నది వేసి చూడవలసి ఉంది.
మొత్తానికి సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలలో జరిగే రాజకీయ సమీకరణలు, వ్యూహ ప్రతి వ్యూహాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయే అన్న చర్చ విస్తృతంగా రెండు మున్సిపాలిటీలలో నడుస్తుంది. గతంలో మునిసిపాలిటీల్లో వచ్చిన ఫలితాలకు భిన్నంగా ఈసారి ఫలితాలు ఉంటాయన్నది పరిశీలగుల అంచనా. పోలింగ్ ప్రశాంతంగా జరగడం కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికి సిరిసిల్ల వేములవాడ మున్సిపాలిటీలలోని కౌన్సిలర్ అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా ఉంది. విజయం ఎవర్ని వరిస్తుందన్నది తుది ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సిందే..

0 Comments
0 Shares
119 Views
0 Reviews