• 🌱 పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుడే మేలు!
    నాచారంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
    హైదరాబాద్, నాచారం:
    వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ నాచారం VST కాలనీలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.


    VST Colony Mates ఆధ్వర్యంలో, S.S.S యువసేన సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. VST కాలనీలోని శ్రీ నాగదేవత రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఉదయం 7:45 గంటల నుంచి 9:00 గంటల వరకు భక్తులకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు.


    🛑 POPకు నో చెప్పండి.. మట్టి వినాయకుడిని ఇంటికి తీసుకెళ్లండి!


    ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల చెరువులు, కుంటలు, నీటి వనరులపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. అందుకే పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించేందుకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.


    ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి, పర్యావరణం, చెరువులు, కుంటలను కాపాడేందుకు తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.


    📢 నిర్వాహకుల సందేశం:


    “చిన్న మట్టి విగ్రహం.. పర్యావరణానికి పెద్ద మేలు!”
    “పర్యావరణాన్ని కాపాడుదాం.. చెరువులు, కుంటలను పరిరక్షిద్దాం!”


    📍 వేదిక: శ్రీ నాగదేవత రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయం, VST కాలనీ, నాచారం, హైదరాబాద్
    📅 తేదీ: 13 సెప్టెంబర్ 2026
    ⏰ సమయం: ఉదయం 7:45 – 9:00 గంటల వరకు


    నిర్వహణ: VST Colony Mates
    సహకారం: S.S.S యువసేన


    🎙️ BHARATH AAWAZ — ప్రత్యేక కథనం


    పర్యావరణహిత వినాయక చవితి.. మన బాధ్యత!
    🌱 పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుడే మేలు! నాచారంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ హైదరాబాద్, నాచారం: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ నాచారం VST కాలనీలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. VST Colony Mates ఆధ్వర్యంలో, S.S.S యువసేన సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. VST కాలనీలోని శ్రీ నాగదేవత రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఉదయం 7:45 గంటల నుంచి 9:00 గంటల వరకు భక్తులకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు. 🛑 POPకు నో చెప్పండి.. మట్టి వినాయకుడిని ఇంటికి తీసుకెళ్లండి! ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల చెరువులు, కుంటలు, నీటి వనరులపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. అందుకే పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించేందుకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి, పర్యావరణం, చెరువులు, కుంటలను కాపాడేందుకు తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. 📢 నిర్వాహకుల సందేశం: “చిన్న మట్టి విగ్రహం.. పర్యావరణానికి పెద్ద మేలు!” “పర్యావరణాన్ని కాపాడుదాం.. చెరువులు, కుంటలను పరిరక్షిద్దాం!” 📍 వేదిక: శ్రీ నాగదేవత రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయం, VST కాలనీ, నాచారం, హైదరాబాద్ 📅 తేదీ: 13 సెప్టెంబర్ 2026 ⏰ సమయం: ఉదయం 7:45 – 9:00 గంటల వరకు నిర్వహణ: VST Colony Mates సహకారం: S.S.S యువసేన 🎙️ BHARATH AAWAZ — ప్రత్యేక కథనం పర్యావరణహిత వినాయక చవితి.. మన బాధ్యత!
    0 Comments 0 Shares 171 Views 0 Reviews
  • కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరభేరి: నిజామాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ


    ఎన్నికల హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ ధ్వజం


    వెయ్యికి పైగా బైక్‌లతో బీఆర్ఎస్ శ్రేణుల భారీ ప్రదర్శన

    ప్రజా సమస్యలపై పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిక


    తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బిగాల గణేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రజా పోరాటంలో భాగంగా శనివారం నిజామాబాద్ నగరంలో యువత, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వెయ్యి మందికి పైగా యువకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
    పాత కలెక్టర్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ ఫూలాంగ్ ఎక్స్ రోడ్, వర్ని ఎక్స్ రోడ్, ఖిల్లా ఎక్స్ రోడ్, పవన్ టాకీస్ రోడ్, నెహ్రూ పార్క్, బస్ స్టాండ్ మీదుగా సాగి తిరిగి పాత కలెక్టర్ గ్రౌండ్ వద్ద ముగిసింది.


    గణేష్ బిగాల గారు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు 6 గ్యారెంటీలు, 420 హామీలిచ్చి ప్రజలను తీవ్రంగా మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన అట్టర్ ప్లాప్‌గా మారిందని, ప్రజా సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని విమర్శించారు.


    ఏ ప్రభుత్వానికైనా సర్దుబాటు చేసుకునేందుకు కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ వేచి చూశారని, అయితే ప్రజా సమస్యలు తీవ్రమవుతుండటంతో పోరాట బాట పట్టక తప్పలేదన్నారు. మహిళలు, రైతులు, నిరుద్యోగుల తరఫున బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తోందని స్పష్టం చేశారు.


    ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ వంటి హామీల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, నిరుద్యోగ యువతకు వెంటనే స్పష్టమైన భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.


    గత బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు నేడు కాంగ్రెస్ పాలనతో పోల్చి చూస్తున్నారని, రానున్న రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

    కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలు, పెండింగ్ హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో ప్రజల పక్షాన పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు
    కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరభేరి: నిజామాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ ఎన్నికల హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ ధ్వజం వెయ్యికి పైగా బైక్‌లతో బీఆర్ఎస్ శ్రేణుల భారీ ప్రదర్శన ప్రజా సమస్యలపై పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బిగాల గణేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రజా పోరాటంలో భాగంగా శనివారం నిజామాబాద్ నగరంలో యువత, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వెయ్యి మందికి పైగా యువకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాత కలెక్టర్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ ఫూలాంగ్ ఎక్స్ రోడ్, వర్ని ఎక్స్ రోడ్, ఖిల్లా ఎక్స్ రోడ్, పవన్ టాకీస్ రోడ్, నెహ్రూ పార్క్, బస్ స్టాండ్ మీదుగా సాగి తిరిగి పాత కలెక్టర్ గ్రౌండ్ వద్ద ముగిసింది. గణేష్ బిగాల గారు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు 6 గ్యారెంటీలు, 420 హామీలిచ్చి ప్రజలను తీవ్రంగా మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన అట్టర్ ప్లాప్‌గా మారిందని, ప్రజా సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని విమర్శించారు. ఏ ప్రభుత్వానికైనా సర్దుబాటు చేసుకునేందుకు కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ వేచి చూశారని, అయితే ప్రజా సమస్యలు తీవ్రమవుతుండటంతో పోరాట బాట పట్టక తప్పలేదన్నారు. మహిళలు, రైతులు, నిరుద్యోగుల తరఫున బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తోందని స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ వంటి హామీల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, నిరుద్యోగ యువతకు వెంటనే స్పష్టమైన భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు నేడు కాంగ్రెస్ పాలనతో పోల్చి చూస్తున్నారని, రానున్న రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలు, పెండింగ్ హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో ప్రజల పక్షాన పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు
    0 Comments 0 Shares 184 Views 0 Reviews
  • నేడు అనుచరులతో కొండా సురేఖ భేటీ..


    వరంగల్‌: కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చిన అనంతరం మంత్రి కొండా సురేఖ వరంగల్‌ నియోజకవర్గంలోని తన అనుచరులతో నేడు సమావేశం కానున్నారు. ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, తన ఢిల్లీ పర్యటన, పార్టీ అధిష్ఠానంతో జరిగిన చర్చలకు సంబంధించిన అంశాలను ఆమె అనుచరులకు వివరించే అవకాశం ఉంది.


    ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిసిన సందర్భంగా తనపై వచ్చిన ఆరోపణలు, పార్టీలో నెలకొన్న పరిస్థితులు, తన కుటుంబంపై జరుగుతున్న విమర్శలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు సురేఖ ఇప్పటికే వెల్లడించారు. అధిష్ఠానానికి చెప్పాల్సిన అన్ని విషయాలను స్పష్టంగా చెప్పానని ఆమె పేర్కొన్నారు.


    ఈ నేపథ్యంలో వరంగల్‌లో తనకు మద్దతుగా ఉన్న ముఖ్య నేతలు, కార్యకర్తలతో సురేఖ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఢిల్లీ పర్యటనలో ఏం జరిగింది? పార్టీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? క్రమశిక్షణ కమిటీ వ్యవహారంపై అధిష్ఠానం వైఖరి ఏమిటి? వంటి అంశాలను ఆమె అనుచరులకు వివరించే అవకాశం ఉంది.


    ఇటీవల కొండా సురేఖ, ఆమె కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు కాంగ్రెస్‌ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఆమె వివరణ ఇచ్చారు. అయితే విచారణ కొనసాగుతున్న సమయంలోనే తనపై, తన కుటుంబ సభ్యులపై విమర్శలు చేయడం సరికాదని సురేఖ అభ్యంతరం వ్యక్తం చేశారు.


    మరోవైపు, వరంగల్‌ నియోజకవర్గంలో తన రాజకీయ భవిష్యత్‌ కార్యాచరణపై కూడా అనుచరులతో సురేఖ చర్చించే అవకాశం ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో అనుచరుల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు, పార్టీ కోసం కలిసి పనిచేయాలని వారికి దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


    కాగా, సురేఖతో భేటీకి నియోజకవర్గంలోని పలువురు ముఖ్య అనుచరులు, నాయకులు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం ఆమె నుంచి మరిన్ని కీలక వ్యాఖ్యలు వెలువడే అవకాశం ఉంది.
    నేడు అనుచరులతో కొండా సురేఖ భేటీ.. వరంగల్‌: కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చిన అనంతరం మంత్రి కొండా సురేఖ వరంగల్‌ నియోజకవర్గంలోని తన అనుచరులతో నేడు సమావేశం కానున్నారు. ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, తన ఢిల్లీ పర్యటన, పార్టీ అధిష్ఠానంతో జరిగిన చర్చలకు సంబంధించిన అంశాలను ఆమె అనుచరులకు వివరించే అవకాశం ఉంది. ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిసిన సందర్భంగా తనపై వచ్చిన ఆరోపణలు, పార్టీలో నెలకొన్న పరిస్థితులు, తన కుటుంబంపై జరుగుతున్న విమర్శలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు సురేఖ ఇప్పటికే వెల్లడించారు. అధిష్ఠానానికి చెప్పాల్సిన అన్ని విషయాలను స్పష్టంగా చెప్పానని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వరంగల్‌లో తనకు మద్దతుగా ఉన్న ముఖ్య నేతలు, కార్యకర్తలతో సురేఖ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఢిల్లీ పర్యటనలో ఏం జరిగింది? పార్టీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? క్రమశిక్షణ కమిటీ వ్యవహారంపై అధిష్ఠానం వైఖరి ఏమిటి? వంటి అంశాలను ఆమె అనుచరులకు వివరించే అవకాశం ఉంది. ఇటీవల కొండా సురేఖ, ఆమె కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు కాంగ్రెస్‌ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఆమె వివరణ ఇచ్చారు. అయితే విచారణ కొనసాగుతున్న సమయంలోనే తనపై, తన కుటుంబ సభ్యులపై విమర్శలు చేయడం సరికాదని సురేఖ అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు, వరంగల్‌ నియోజకవర్గంలో తన రాజకీయ భవిష్యత్‌ కార్యాచరణపై కూడా అనుచరులతో సురేఖ చర్చించే అవకాశం ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో అనుచరుల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు, పార్టీ కోసం కలిసి పనిచేయాలని వారికి దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, సురేఖతో భేటీకి నియోజకవర్గంలోని పలువురు ముఖ్య అనుచరులు, నాయకులు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం ఆమె నుంచి మరిన్ని కీలక వ్యాఖ్యలు వెలువడే అవకాశం ఉంది.
    1 Comments 0 Shares 559 Views 0 Reviews
  • ముసారాంబాగ్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం అనంతరం, అంబర్‌పేట్ జీహెచ్ఎంసీ స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు


    *YouTube*
    https://www.youtube.com/live/PaEFaS-qx_g?si=pxy_I8n0lHCWCaD3


    *X*
    https://x.com/TelanganaCMO/status/2094393249280807049?s=20


    *Facebook*
    https://www.facebook.com/share/v/1DLq3BQ3em/
    ముసారాంబాగ్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం అనంతరం, అంబర్‌పేట్ జీహెచ్ఎంసీ స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు *YouTube* https://www.youtube.com/live/PaEFaS-qx_g?si=pxy_I8n0lHCWCaD3 *X* https://x.com/TelanganaCMO/status/2094393249280807049?s=20 *Facebook* https://www.facebook.com/share/v/1DLq3BQ3em/
    0 Comments 0 Shares 373 Views 0 Reviews
  • హైదరాబాద్‌ ముసారాంబాగ్ వద్ద మూసీ నదిపై నూతనంగా నిర్మించిన హైలెవల్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు


    *YouTube*
    https://www.youtube.com/live/kKknDK7uzGM?si=u5G6cb4NZMwCBEEX


    *X*
    https://x.com/TelanganaCMO/status/2094388183580680568?s=20


    *Facebook*
    https://www.facebook.com/share/v/189ppXnscU/
    హైదరాబాద్‌ ముసారాంబాగ్ వద్ద మూసీ నదిపై నూతనంగా నిర్మించిన హైలెవల్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు *YouTube* https://www.youtube.com/live/kKknDK7uzGM?si=u5G6cb4NZMwCBEEX *X* https://x.com/TelanganaCMO/status/2094388183580680568?s=20 *Facebook* https://www.facebook.com/share/v/189ppXnscU/
    0 Comments 0 Shares 369 Views 0 Reviews
  • [31/08, 12:42 pm] Kumar: హైదరాబాద్ లో నేటి నుంచి అందుబాటులోకి రానున్న భారీ హైలెవెల్ బ్రిడ్జి- ట్రాఫిక్ కు చెక్
    [31/08, 12:42 pm] Kumar: హైదరాబాద్ లో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలు తుది దశకు చేరుకున్నాయి. నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులతో సతమతమవుతున్న వాహనదారులకు భారీ ఉపశమనం లభించనుంది. మూసీ నదిపై నిర్మించిన నూతన మూసారాంబాగ్‌ హైలెవల్ బ్రిడ్జి నేడు అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
    [31/08, 12:42 pm] Kumar: బ్రిడ్జి అందుబాటులోకి రానుండటంతో అంబర్‌పేట్, మూసారాంబాగ్‌ పరిసర ప్రాంతాల మధ్య వాహనాల రాకపోకలు మరింత సజావుగా సాగే అవకాశం ఉంది. ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది. సుమారు రూ. 52 కోట్ల అంచనా వ్యయంతో జీహెచ్ఎంసీ దీన్ని పూర్తి చేసింది. ఇప్పటి వరకు ఈ మార్గంలో ప్రయాణించాలంటే నరకప్రాయంగా ఉండేది. పీక్ అవర్స్‌లో ఎదురయ్యే ట్రాఫిక్ జాం సమస్యలకు ఇది శాశ్వత పరిష్కారాన్ని చూపుతుందని వాహనదారులు ఆశిస్తోన్నారు.
    [31/08, 12:43 pm] Kumar: ప్రారంభోత్సవ ఏర్పాట్లలో భాగంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ అధికారులతో కలిసి వంతెన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాహనాల రద్దీ అవసరాలకు అనుగుణంగా ఈ బ్రిడ్జికి రూపకల్పన చేసింది.. జీహెచ్‌ఎంసీ. దీని మొత్తం పొడవు 400 మీటర్లు. వెడల్పు 14.5 మీటర్లు. ఇరువైపుల నుంచి రాకపోకలు సాగించవచ్చు. పాదాచారుల కోసం మూసారాంబాగ్ వంతెనకు ఇరువైపులా 3.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌లను నిర్మించారు.
    [31/08, 12:43 pm] Kumar: వర్షాకాలంలో మూసీ నది ఉప్పొంగిన తరుణంలో పాత మూసారాంబాగ్‌ కాజ్‌వే పూర్తిగా నీట మునిగిపోయేదనే విషయం తెలిసిందే. ఆ సమయంలో అంబర్‌పేట, మలక్‌పేట, దిల్‍సుఖ్ నగర్, గోల్నాక మధ్య రవాణా పూర్తిగా స్తంభించిపోయేది. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు ఈ మార్గంలో నిత్యం రాకపోకలను నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చేది. ఫలితంగా వేలాది మంది వాహనదారులు కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి ప్రయాణించేవారు.
    [31/08, 12:43 pm] Kumar: నూతన హైలెవెల్ వంతెన అందుబాటులోకి వస్తోండటంతో ఈ ఇబ్బందులు తప్పినట్టవుతుంది. భవిష్యత్తులో మూసీ నదికి ఎంతటి వరదలు వచ్చినప్పటికీ వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేలా దీన్ని నిర్మించారు. నది ప్రవాహ స్థాయి కంటే చాలా ఎత్తులో ఈ వంతెనను నిర్మించడం దీనికి ప్రధాన కారణం.
    [31/08, 12:42 pm] Kumar: హైదరాబాద్ లో నేటి నుంచి అందుబాటులోకి రానున్న భారీ హైలెవెల్ బ్రిడ్జి- ట్రాఫిక్ కు చెక్ [31/08, 12:42 pm] Kumar: హైదరాబాద్ లో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలు తుది దశకు చేరుకున్నాయి. నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులతో సతమతమవుతున్న వాహనదారులకు భారీ ఉపశమనం లభించనుంది. మూసీ నదిపై నిర్మించిన నూతన మూసారాంబాగ్‌ హైలెవల్ బ్రిడ్జి నేడు అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. [31/08, 12:42 pm] Kumar: బ్రిడ్జి అందుబాటులోకి రానుండటంతో అంబర్‌పేట్, మూసారాంబాగ్‌ పరిసర ప్రాంతాల మధ్య వాహనాల రాకపోకలు మరింత సజావుగా సాగే అవకాశం ఉంది. ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది. సుమారు రూ. 52 కోట్ల అంచనా వ్యయంతో జీహెచ్ఎంసీ దీన్ని పూర్తి చేసింది. ఇప్పటి వరకు ఈ మార్గంలో ప్రయాణించాలంటే నరకప్రాయంగా ఉండేది. పీక్ అవర్స్‌లో ఎదురయ్యే ట్రాఫిక్ జాం సమస్యలకు ఇది శాశ్వత పరిష్కారాన్ని చూపుతుందని వాహనదారులు ఆశిస్తోన్నారు. [31/08, 12:43 pm] Kumar: ప్రారంభోత్సవ ఏర్పాట్లలో భాగంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ అధికారులతో కలిసి వంతెన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాహనాల రద్దీ అవసరాలకు అనుగుణంగా ఈ బ్రిడ్జికి రూపకల్పన చేసింది.. జీహెచ్‌ఎంసీ. దీని మొత్తం పొడవు 400 మీటర్లు. వెడల్పు 14.5 మీటర్లు. ఇరువైపుల నుంచి రాకపోకలు సాగించవచ్చు. పాదాచారుల కోసం మూసారాంబాగ్ వంతెనకు ఇరువైపులా 3.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌లను నిర్మించారు. [31/08, 12:43 pm] Kumar: వర్షాకాలంలో మూసీ నది ఉప్పొంగిన తరుణంలో పాత మూసారాంబాగ్‌ కాజ్‌వే పూర్తిగా నీట మునిగిపోయేదనే విషయం తెలిసిందే. ఆ సమయంలో అంబర్‌పేట, మలక్‌పేట, దిల్‍సుఖ్ నగర్, గోల్నాక మధ్య రవాణా పూర్తిగా స్తంభించిపోయేది. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు ఈ మార్గంలో నిత్యం రాకపోకలను నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చేది. ఫలితంగా వేలాది మంది వాహనదారులు కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి ప్రయాణించేవారు. [31/08, 12:43 pm] Kumar: నూతన హైలెవెల్ వంతెన అందుబాటులోకి వస్తోండటంతో ఈ ఇబ్బందులు తప్పినట్టవుతుంది. భవిష్యత్తులో మూసీ నదికి ఎంతటి వరదలు వచ్చినప్పటికీ వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేలా దీన్ని నిర్మించారు. నది ప్రవాహ స్థాయి కంటే చాలా ఎత్తులో ఈ వంతెనను నిర్మించడం దీనికి ప్రధాన కారణం.
    0 Comments 0 Shares 247 Views 0 Reviews
  • న్యూఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం: టింబర్ ఫ్యాక్టరీలో ఎగిసిపడిన మంటలు


    delhi-timber-factory-no-casualties
    న్యూఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం: టింబర్ ఫ్యాక్టరీలో ఎగిసిపడిన మంటలు delhi-timber-factory-no-casualties
    0 Comments 0 Shares 285 Views 0 Reviews
  • గచ్చిబౌలిలో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేడు అపార్ట్‌మెంట్‌ కూల్చివేతకు ఏర్పాట్లు


    హైదరాబాద్‌: గచ్చిబౌలిలో శిథిలాల తొలగింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాత్రి కురిసిన వర్షం కారణంగా శిథిలాల తొలగింపు పనులకు ఆటంకం ఏర్పడింది. వర్షంతో సహాయక చర్యలకు అంతరాయం కలగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.


    నిన్న గచ్చిబౌలిలో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కేవలం 40 గజాల స్థలంలో ఏడంతస్తుల భవనాన్ని నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. భవన నిర్మాణానికి సంబంధించిన అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.


    కూలిన భవనం పక్కనే ఉన్న జయదర్శి అపార్ట్‌మెంట్‌ను నేడు కూల్చివేసే అవకాశం ఉంది. ఇందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భవనం నిర్మాణం, నిబంధనల ఉల్లంఘనలపై విచారణ కొనసాగుతోంది.


    భవన నిర్మాణానికి సంబంధించి ప్రధానంగా ప్రస్తావనకు వస్తున్న సాజిద్‌ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆయన ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు సమాచారం.
    గచ్చిబౌలిలో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేడు అపార్ట్‌మెంట్‌ కూల్చివేతకు ఏర్పాట్లు హైదరాబాద్‌: గచ్చిబౌలిలో శిథిలాల తొలగింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాత్రి కురిసిన వర్షం కారణంగా శిథిలాల తొలగింపు పనులకు ఆటంకం ఏర్పడింది. వర్షంతో సహాయక చర్యలకు అంతరాయం కలగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిన్న గచ్చిబౌలిలో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కేవలం 40 గజాల స్థలంలో ఏడంతస్తుల భవనాన్ని నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. భవన నిర్మాణానికి సంబంధించిన అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కూలిన భవనం పక్కనే ఉన్న జయదర్శి అపార్ట్‌మెంట్‌ను నేడు కూల్చివేసే అవకాశం ఉంది. ఇందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భవనం నిర్మాణం, నిబంధనల ఉల్లంఘనలపై విచారణ కొనసాగుతోంది. భవన నిర్మాణానికి సంబంధించి ప్రధానంగా ప్రస్తావనకు వస్తున్న సాజిద్‌ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆయన ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు సమాచారం.
    0 Comments 0 Shares 182 Views 0 Reviews
  • https://youtube.com/shorts/cm_LTI91MRo?si=yZZXdF1MAs2lCXaQ
    https://youtube.com/shorts/cm_LTI91MRo?si=yZZXdF1MAs2lCXaQ
    0 Comments 0 Shares 274 Views 0 Reviews
  • సమావేశం వివరాలు
    గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) శంషాబాద్ జోనల్ కమిషనర్ శ్రీమతి చంద్రకళ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 11:00 గంటలకు గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది.
    గణేష్ ఉత్సవాల నిర్వహణ, ప్రజా భద్రత, పారిశుధ్యం, ట్రాఫిక్ నిర్వహణ మరియు ఇతర ఏర్పాట్లపై అధికారులు సూచనలు ఇచ్చి, పరస్పర సమన్వయంతో పండుగను విజయవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
    సమావేశం వివరాలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) శంషాబాద్ జోనల్ కమిషనర్ శ్రీమతి చంద్రకళ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 11:00 గంటలకు గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. గణేష్ ఉత్సవాల నిర్వహణ, ప్రజా భద్రత, పారిశుధ్యం, ట్రాఫిక్ నిర్వహణ మరియు ఇతర ఏర్పాట్లపై అధికారులు సూచనలు ఇచ్చి, పరస్పర సమన్వయంతో పండుగను విజయవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
    0 Comments 0 Shares 156 Views 0 Reviews
  • నిజామాబాద్: 43 డి విజన్ కార్పోరేటర్ ఎర్రాం గంగాధర్ గారి అధ్వర్యం లో జండా అవిశీకరణ
    నిజామాబాద్: 43 డి విజన్ కార్పోరేటర్ ఎర్రాం గంగాధర్ గారి అధ్వర్యం లో జండా అవిశీకరణ
    0 Comments 0 Shares 156 Views 0 Reviews
  • నిజామాబాద్: ఘనంగా జరిజినా ఉరపండగ
    నిజామాబాద్: ఘనంగా జరిజినా ఉరపండగ
    0 Comments 0 Shares 219 Views 0 Reviews
More Results
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com