• రిపోర్టర్ డైరీ: కవరేజ్ కాదు, కవర్‌స్టోరీ: విలేకరుల గురించి. వార్తల వెనుక గొంతు, రిపోర్టర్ల జీవితం

    Beyond Byline: The Story of the Storyteller!

    ఎప్పుడూ వార్తలు సేకరించి, వాటిని ప్రజలకు చేరవేసేది విలేకరులే. కానీ ఈసారి ఆ సంప్రదాయాన్ని మార్చాలనుకుంటున్నాం. విలేకరులనే ఇంటర్వ్యూ చేసి, వారి కథనాలను ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించుకున్నాము.

    Reporters are always on the front lines, telling the stories of others, we're flipping the script. We believe the story behind the storyteller is just as compelling.

    వార్తలను కవర్ చేసేటప్పుడు వారి ప్యాషన్ ఏంటి? వారు ఎదుర్కొనే ఇబ్బందులు ఏమిటి? వారి జీవిత శైలి ఎలా ఉంటుంది? ఇలాంటి ఎన్నో విషయాలను మేము మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ క్రమంలో, మీరు మీ అనుభవాలను పంచుకోవడానికి ఆసక్తి ఉన్నట్లయితే, హైదరాబాద్‌లోని మా స్టూడియోకి రావాల్సిందిగా మేము ఆహ్వానిస్తున్నాం


    At our Hyderabad studio, we're opening our doors to the brave Journalists who tirelessly bring us the news. We want to hear your story—what drives your passion, the hurdles you've overcome, and the moments that have defined your career. We want to understand the life behind the lens, the human spirit that fuels the headlines.

    If you're a reporter and you're ready to share your journey with us, we invite you to step into the spotlight. Come sit down with us and let's have a conversation that goes beyond the headlines.

    మీ కథ చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆసక్తి ఉన్నవారు దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
    Interested in sharing your story? Please let us know!

    Bharat Aawaz!
    Jai Hind!
    రిపోర్టర్ డైరీ: కవరేజ్ కాదు, కవర్‌స్టోరీ: విలేకరుల గురించి. వార్తల వెనుక గొంతు, రిపోర్టర్ల జీవితం Beyond Byline: The Story of the Storyteller! ఎప్పుడూ వార్తలు సేకరించి, వాటిని ప్రజలకు చేరవేసేది విలేకరులే. కానీ ఈసారి ఆ సంప్రదాయాన్ని మార్చాలనుకుంటున్నాం. విలేకరులనే ఇంటర్వ్యూ చేసి, వారి కథనాలను ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించుకున్నాము. Reporters are always on the front lines, telling the stories of others, we're flipping the script. We believe the story behind the storyteller is just as compelling. వార్తలను కవర్ చేసేటప్పుడు వారి ప్యాషన్ ఏంటి? వారు ఎదుర్కొనే ఇబ్బందులు ఏమిటి? వారి జీవిత శైలి ఎలా ఉంటుంది? ఇలాంటి ఎన్నో విషయాలను మేము మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ క్రమంలో, మీరు మీ అనుభవాలను పంచుకోవడానికి ఆసక్తి ఉన్నట్లయితే, హైదరాబాద్‌లోని మా స్టూడియోకి రావాల్సిందిగా మేము ఆహ్వానిస్తున్నాం At our Hyderabad studio, we're opening our doors to the brave Journalists who tirelessly bring us the news. We want to hear your story—what drives your passion, the hurdles you've overcome, and the moments that have defined your career. We want to understand the life behind the lens, the human spirit that fuels the headlines. If you're a reporter and you're ready to share your journey with us, we invite you to step into the spotlight. Come sit down with us and let's have a conversation that goes beyond the headlines. మీ కథ చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆసక్తి ఉన్నవారు దయచేసి మమ్మల్ని సంప్రదించండి. Interested in sharing your story? Please let us know! Bharat Aawaz! Jai Hind!
    0 Comments 0 Shares 300 Views 0 Reviews
  • ISRO తాజా ఉపగ్రహ ప్రయోగం విజయవంతం – భారత్ అంతరిక్ష శక్తిగా మరింత బలపడుతోంది.
    మీ అభిప్రాయం ప్రకారం, భారత్ భవిష్యత్తులో ఎక్కువ దృష్టి పెట్టాల్సిన రంగం ఏది?
    🚀 ISRO తాజా ఉపగ్రహ ప్రయోగం విజయవంతం – భారత్ అంతరిక్ష శక్తిగా మరింత బలపడుతోంది. మీ అభిప్రాయం ప్రకారం, భారత్ భవిష్యత్తులో ఎక్కువ దృష్టి పెట్టాల్సిన రంగం ఏది?
    0
    0
    0
    0
    0 Comments 0 Shares 331 Views 0 Reviews
  • మల్కాజిగిరి జిల్లా/అల్వాల్

    సినీ తార నిధి అగర్వాల్ ఓల్డ్ ఆల్వాల్ లో సందడి చేశారు

    ఓల్డ్ ఆల్వాల్ లో నూతనంగా ఏర్పాటుచేసిన అనుటెక్స్ షాపింగ్ మాల్ ను ప్రముఖ సినీనటి నిధి అగర్వాల్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు లు ప్రారంభించారు.
    ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి షాపింగ్ మాల్ లో ఉన్న వివిధ రకాల పట్టుచీరలు, వస్త్రలను తిలకించారు.
    అల్వాల్ ప్రాంత వాసులకు చుట్టుపక్కల వారికి నాణ్యమైన చీరలు దుస్తులు సరసమైన ధరలకే అందించనునట్లు తెలిపారు.
    ఈనెల 24న విడుదల కానున్న హరిహర వీరమల్లు లో పంచమి అనే పాత్రను పోషించినట్లు ఆమె తెలిపారు. హరిహర వీరమల్లు సినిమాను ప్రతి ఒక్కరూ వీక్షించాలని విజ్ఞప్తి చేశారు.
    కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు షాపింగ్ మాల్ యజమానులకు అభినందనలు తెలియజేసి భవిష్యత్తులో మరిన్ని షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. నగరంలోనే ఏడవ అనుటెక్స్ షాపింగ్ మాల్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు.

    -sidhumaroju
    మల్కాజిగిరి జిల్లా/అల్వాల్ సినీ తార నిధి అగర్వాల్ ఓల్డ్ ఆల్వాల్ లో సందడి చేశారు ఓల్డ్ ఆల్వాల్ లో నూతనంగా ఏర్పాటుచేసిన అనుటెక్స్ షాపింగ్ మాల్ ను ప్రముఖ సినీనటి నిధి అగర్వాల్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు లు ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి షాపింగ్ మాల్ లో ఉన్న వివిధ రకాల పట్టుచీరలు, వస్త్రలను తిలకించారు. అల్వాల్ ప్రాంత వాసులకు చుట్టుపక్కల వారికి నాణ్యమైన చీరలు దుస్తులు సరసమైన ధరలకే అందించనునట్లు తెలిపారు. ఈనెల 24న విడుదల కానున్న హరిహర వీరమల్లు లో పంచమి అనే పాత్రను పోషించినట్లు ఆమె తెలిపారు. హరిహర వీరమల్లు సినిమాను ప్రతి ఒక్కరూ వీక్షించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు షాపింగ్ మాల్ యజమానులకు అభినందనలు తెలియజేసి భవిష్యత్తులో మరిన్ని షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. నగరంలోనే ఏడవ అనుటెక్స్ షాపింగ్ మాల్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. -sidhumaroju
    Like
    Love
    2
    11 Comments 1 Shares 1K Views 136 0 Reviews
  • రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి గార్లు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పోతిరెడ్డిపల్లి చౌరస్తా లో ఉన్న PSR గార్డెన్ లో జిల్లా మహిళా సమాఖ్య ఏర్పాటు చేసిన సంగారెడ్డి నియోజక వర్గ స్థాయి మహిళా సమాఖ్య అద్వర్యం లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలు - 2025 లలో పాల్గొన్నారు .

    ఈ సందర్బంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ ...
    ఇందిరా మహిళా శక్తి సంబరాలను సంగారెడ్డి జిల్లాలో అధికారకంగా పండుగ వాతావరణంలో వేడుక గా జరుపుకుంటున్నామన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ. స్వయం సహాయక బృందాల చరిత్ర 2000 లో మొదలైందన్నారు . స్వయం సహకార సంఘాలు అనే ఒక ఆలోచన 25 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమము మొదలుపెడితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మనం ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు . గ్రామీణ మహిళలు పొదుపు ను సంఘాల ద్వారా పొదుపు చేసుకోవాలన్నారు , ఆర్థికంగా ఎదగాలని ఈ కార్యక్రమాన్ని రూపొందించటం జరిగిందన్నారు . దానికి బ్యాంకు తో సహా ఆనాటి ప్రభుత్వాలు రివాల్వింగ్ ఇచ్చారన్నారు . మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం లో పావులా వడ్డీ , అభయ హస్తం పతకాల ద్వారా మహిళలను , మహిళా సమాఖ్య లను ఆర్థికంగా బలోపేతం చేశామన్నారు . కానీ గత BRS ప్రభుత్వం లో మహిళా సమాఖ్య ల పై వివక్ష చూపారన్నారు మంత్రి దామోదర్ నరసింహ .

    ప్రజా ప్రభుత్వం ఏర్పడినా తరువాత సీఎం రేవంత్ రెడ్డి అద్వర్యం లో మహిళా సమాఖ్య లకు పూర్వ వైభవాన్ని తెచ్చామన్నారు. సంగారెడ్డి జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యం లో చేపట్టిన సంక్షేమం ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ . రాష్ట్రం లో మహిళా సమాఖ్య ద్వారా పెట్రోల్ pump, షాపింగ్ కాంప్లెక్స్ ల నిర్వహణ , canteen నిర్వహణ లను జిల్లా మహిళా సమాఖ్య నిర్వహిస్తోందన్నారు . గతం లో sc కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు జిల్లాలో రెండు ప్రాంతాల్లో 5ఎకరాల చొప్పున 10 ఎకరాల ప్రభత్వ భూమి ని కేటాయించామన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ . మహిళలను పరాశక్తి గా అభివర్ణించారు . కూతురు గా , చెల్లి గా , అమ్మగా . భార్య గా ఒక మహిళా తన కుటుంబాన్ని బాధ్యతతో , క్రమశిక్షణ తో ముందుకు తీసుకెళ్తుందన్నారు . మహిళా సంక్షేమం , సాధికారత కోసం ప్రజా ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. మహిళలు ఇంకా ముందుకు రావాలని ఆకాక్షించారు , జిల్లాలో జాతీయ రహదారుల వెంట ఉన్న ఒకటి , రెండు ఎకరాల ప్రభుత్వ భూములు ఉంటే మహిళా సమాఖ్య కు కేటాయించాలన్నారు . మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలను కల్పించాలన్నారు . కోటి మంది మహిళలను కోటేశ్వర్లు గా తీర్చి దిద్దుతున్నామన్నారు . ఒక్కసారి మనం ఆలోచన చెసు కోవాలన్నారు. మీకు ఎన్నిసార్లు వడ్డీ లేని రుణాలు సమయానికి గత ప్రభుత్వం ఇచ్చిందో ఒక్కసారి గుండె మీద చేయి వేసుకొని ఆలోచన చేయాలన్నారు.

    ఈ కార్యక్రమం లో శాసన మండలి సభ్యులు అంజిరెడ్డి , నారాయణ ఖేడ్ ఏమ్మెల్యే డా . సంజీవ రెడ్డి , రాష్ట్ర ప్రభుత్వ వివిధ సంస్థల చైర్మన్ లు నిర్మల జగ్గారెడ్డి , ఫయీమ్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య లు పాల్గొన్నారు .
    రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి గార్లు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పోతిరెడ్డిపల్లి చౌరస్తా లో ఉన్న PSR గార్డెన్ లో జిల్లా మహిళా సమాఖ్య ఏర్పాటు చేసిన సంగారెడ్డి నియోజక వర్గ స్థాయి మహిళా సమాఖ్య అద్వర్యం లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలు - 2025 లలో పాల్గొన్నారు . ఈ సందర్బంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ ... ఇందిరా మహిళా శక్తి సంబరాలను సంగారెడ్డి జిల్లాలో అధికారకంగా పండుగ వాతావరణంలో వేడుక గా జరుపుకుంటున్నామన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ. స్వయం సహాయక బృందాల చరిత్ర 2000 లో మొదలైందన్నారు . స్వయం సహకార సంఘాలు అనే ఒక ఆలోచన 25 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమము మొదలుపెడితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మనం ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు . గ్రామీణ మహిళలు పొదుపు ను సంఘాల ద్వారా పొదుపు చేసుకోవాలన్నారు , ఆర్థికంగా ఎదగాలని ఈ కార్యక్రమాన్ని రూపొందించటం జరిగిందన్నారు . దానికి బ్యాంకు తో సహా ఆనాటి ప్రభుత్వాలు రివాల్వింగ్ ఇచ్చారన్నారు . మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం లో పావులా వడ్డీ , అభయ హస్తం పతకాల ద్వారా మహిళలను , మహిళా సమాఖ్య లను ఆర్థికంగా బలోపేతం చేశామన్నారు . కానీ గత BRS ప్రభుత్వం లో మహిళా సమాఖ్య ల పై వివక్ష చూపారన్నారు మంత్రి దామోదర్ నరసింహ . ప్రజా ప్రభుత్వం ఏర్పడినా తరువాత సీఎం రేవంత్ రెడ్డి అద్వర్యం లో మహిళా సమాఖ్య లకు పూర్వ వైభవాన్ని తెచ్చామన్నారు. సంగారెడ్డి జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యం లో చేపట్టిన సంక్షేమం ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ . రాష్ట్రం లో మహిళా సమాఖ్య ద్వారా పెట్రోల్ pump, షాపింగ్ కాంప్లెక్స్ ల నిర్వహణ , canteen నిర్వహణ లను జిల్లా మహిళా సమాఖ్య నిర్వహిస్తోందన్నారు . గతం లో sc కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు జిల్లాలో రెండు ప్రాంతాల్లో 5ఎకరాల చొప్పున 10 ఎకరాల ప్రభత్వ భూమి ని కేటాయించామన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ . మహిళలను పరాశక్తి గా అభివర్ణించారు . కూతురు గా , చెల్లి గా , అమ్మగా . భార్య గా ఒక మహిళా తన కుటుంబాన్ని బాధ్యతతో , క్రమశిక్షణ తో ముందుకు తీసుకెళ్తుందన్నారు . మహిళా సంక్షేమం , సాధికారత కోసం ప్రజా ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. మహిళలు ఇంకా ముందుకు రావాలని ఆకాక్షించారు , జిల్లాలో జాతీయ రహదారుల వెంట ఉన్న ఒకటి , రెండు ఎకరాల ప్రభుత్వ భూములు ఉంటే మహిళా సమాఖ్య కు కేటాయించాలన్నారు . మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలను కల్పించాలన్నారు . కోటి మంది మహిళలను కోటేశ్వర్లు గా తీర్చి దిద్దుతున్నామన్నారు . ఒక్కసారి మనం ఆలోచన చెసు కోవాలన్నారు. మీకు ఎన్నిసార్లు వడ్డీ లేని రుణాలు సమయానికి గత ప్రభుత్వం ఇచ్చిందో ఒక్కసారి గుండె మీద చేయి వేసుకొని ఆలోచన చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో శాసన మండలి సభ్యులు అంజిరెడ్డి , నారాయణ ఖేడ్ ఏమ్మెల్యే డా . సంజీవ రెడ్డి , రాష్ట్ర ప్రభుత్వ వివిధ సంస్థల చైర్మన్ లు నిర్మల జగ్గారెడ్డి , ఫయీమ్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య లు పాల్గొన్నారు .
    0 Comments 0 Shares 416 Views 0 Reviews
  • *సత్యానికి శక్తినిద్దాం... అంగట్లో వస్తువుగా మార్చొద్దు!*
    ప్రయాణం... ఒక విలేకరి నుండి వ్యాపారవేత్త వరకు!

    మీరు కేవలం వార్తలను అందించే రిపోర్టర్ మాత్రమే కాదు. మీ భవిష్యత్తును మీరే నిర్మించుకునే ఒక పారిశ్రామికవేత్త.

    BMA నేరుగా మరియు అనేక అనుబంధ సంస్థల ద్వారా వందలాది ఉత్పత్తులను తయారు చేస్తుంది లేదా సరఫరా చేస్తుంది.
    1. Packaged Drinking Water
    2. Beverages and Soft Drinks
    3. Packeged Food Products
    4. Groceries and Supplies
    5. Electronic Items and Supplies
    7. Medical Products
    8. Agriculture Drones & Products
    9. And Many More
    సున్నా పెట్టుబడితో వ్యాపార యజమాని అయ్యే సువర్ణావకాశం!

    BMA అందించే ఈ ఉత్పత్తులన్నింటికీ, ఎలాంటి ఫ్రాంచైజ్, డీలర్‌షిప్ లేదా డిస్ట్రిబ్యూషన్ ఫీజు లేకుండా... మీరే అధికారిక డీలర్ & డిస్ట్రిబ్యూటర్.

    మా అసలు లక్ష్యం ఇదే:
    కేవలం రిపోర్టింగ్ మాత్రమే కాదు, భారత్ ఆవాజ్‌లోని ప్రతి విలేకరి ఆర్థిక స్వాతంత్ర్యం సాధించడమే

    ఆర్థిక భరోసాయే, వారిని మరింత నిర్భయంగా, నిష్పక్షపాతంగా వార్తలను అందించడానికి మరియు ప్రజలకు అండగా నిలబడటానికి అసలైన శక్తినిస్తుంది!

    *నిర్భయమైన రిపోర్టింగ్ కోసం... ఆర్థిక స్వాతంత్ర్యం!*
    *సత్యానికి శక్తినిద్దాం... అంగట్లో వస్తువుగా మార్చొద్దు!* ప్రయాణం... ఒక విలేకరి నుండి వ్యాపారవేత్త వరకు! మీరు కేవలం వార్తలను అందించే రిపోర్టర్ మాత్రమే కాదు. మీ భవిష్యత్తును మీరే నిర్మించుకునే ఒక పారిశ్రామికవేత్త. BMA నేరుగా మరియు అనేక అనుబంధ సంస్థల ద్వారా వందలాది ఉత్పత్తులను తయారు చేస్తుంది లేదా సరఫరా చేస్తుంది. 1. Packaged Drinking Water 2. Beverages and Soft Drinks 3. Packeged Food Products 4. Groceries and Supplies 5. Electronic Items and Supplies 7. Medical Products 8. Agriculture Drones & Products 9. And Many More సున్నా పెట్టుబడితో వ్యాపార యజమాని అయ్యే సువర్ణావకాశం! BMA అందించే ఈ ఉత్పత్తులన్నింటికీ, ఎలాంటి ఫ్రాంచైజ్, డీలర్‌షిప్ లేదా డిస్ట్రిబ్యూషన్ ఫీజు లేకుండా... మీరే అధికారిక డీలర్ & డిస్ట్రిబ్యూటర్. మా అసలు లక్ష్యం ఇదే: కేవలం రిపోర్టింగ్ మాత్రమే కాదు, భారత్ ఆవాజ్‌లోని ప్రతి విలేకరి ఆర్థిక స్వాతంత్ర్యం సాధించడమే ఆర్థిక భరోసాయే, వారిని మరింత నిర్భయంగా, నిష్పక్షపాతంగా వార్తలను అందించడానికి మరియు ప్రజలకు అండగా నిలబడటానికి అసలైన శక్తినిస్తుంది! *నిర్భయమైన రిపోర్టింగ్ కోసం... ఆర్థిక స్వాతంత్ర్యం!*
    0 Comments 0 Shares 586 Views 0 Reviews
  • The Voice Listens

    అంజలి తన జర్నలిజం డిగ్రీని, పదును కోల్పోయిన కవచంలా పట్టుకుంది. ఆమె ఇంటర్న్‌షిప్ చేసిన ఢిల్లీ న్యూస్‌రూమ్‌ల హోరులో, నిజం ఒక అంగడి సరుకైపోయింది. రేటింగుల కోసం, పలుకుబడి ఉన్నవారి కోసం సత్యాన్ని తాకట్టుపెట్టేవారు. దేశానికి అవసరమైన కథలు, సెలబ్రిటీల గాసిప్‌లు, రాజకీయ నాయకుల అరుపుల కింద సమాధి చేయబడ్డాయి. కళాశాలలో తనను నడిపించిన ఆశయాల అగ్ని, నిరాశ అనే నీటితో ఆరిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇదేనా జర్నలిజం? దేశపు గొంతుకంటే కేవలం కొందరి ప్రతిధ్వనేనా?

    ఒక రాత్రి, ఆ డిజిటల్ శబ్దంలో దారితప్పి తిరుగుతున్నప్పుడు, ఒక సాధారణమైన, సూటైన శీర్షిక ఆమె కంటపడింది. అది ఏ పెద్ద సంస్థ నుంచీ కాదు. ఆ వెబ్‌సైట్ చాలా నిరాడంబరంగా ఉంది. లోగోలో శక్తివంతమైన దేవనాగరి లిపిలో 'భారత్ ఆవాజ్' అని రాసి ఉంది. దాని కింద ఉన్న వాక్యం ఆమెను కదిలించింది: "నువ్వు పేదల, అణగారిన, నిస్సహాయుల గొంతుక కాగలవా?"

    ఆ కథ బీహార్‌లోని ఒక మారుమూల గ్రామంలోని చేనేత కార్మికులది. కొత్త పారిశ్రామిక విధానం వారి జీవితాలను ఎలా నాశనం చేస్తుందో అందులో వివరించారు. ఆ కథను స్టూడియోలో కూర్చున్న నిపుణుడి కోణంలో కాకుండా, ఆ కార్మికుల కఠినమైన, కల్మషం లేని మాటలతోనే చెప్పారు. అందులో సంచలనం లేదు, వారి పోరాటంలో ఒక నిశ్శబ్దమైన, గంభీరమైన గౌరవం మాత్రమే ఉంది. అంజలి గంటపాటు ఆ సైట్‌లోని ప్రతి కథనాన్ని చదివింది. ఇవి దేశపు గుండె లోతుల్లోంచి వచ్చిన కథలు. కెమెరాలు ఎప్పుడూ వెళ్లని ప్రదేశాల నుంచి వచ్చినవి. ఇది వ్యాపారం కోసం కాదు, సేవ కోసం చేస్తున్న జర్నలిజం.

    ఎన్నో నెలల తర్వాత తనలో కొత్త ఉత్తేజం నిండింది. వారి కాంటాక్ట్ కోసం వెతకగా, ఒక వాట్సాప్ నంబర్ దొరికింది. గుండె వేగంగా కొట్టుకుంటుండగా, ఒక సందేశం పంపింది. "నేను ఒక గొంతుక కావాలనుకుంటున్నాను. నేను మీతో చేరాలనుకుంటున్నాను" అని రాసింది.

    సమాధానం ప్రకాష్ అనే వ్యక్తి నుండి వచ్చింది. అతను 'భారత్ ఆవాజ్' వ్యవస్థాపకుడు మరియు సంపాదకుడు. 'భారత్ ఆవాజ్' ఒక కంపెనీ కాదని, అదొక యజ్ఞమని వివరించాడు. వారికి పెద్ద కార్యాలయాలు లేవు, కేవలం కొద్దిమంది నిబద్ధత గల రిపోర్టర్లు, పౌర జర్నలిస్టుల బృందం మాత్రమే ఉంది. భారతదేశపు నిజమైన కథలు బోర్డ్‌రూమ్‌లలో కాదు, పల్లెల్లో, పొలాల్లో, మురికివాడల్లోనే ఉన్నాయని నమ్మే కొద్దిమందితో నడిచే ఉద్యమం అది.

    ఆమె మొదటి అసైన్‌మెంట్, జార్ఖండ్ కొండలలోని 'పత్తర్‌గఢ్' అనే ఒక గిరిజన గూడెం నుండి వచ్చిన ఒక చిన్న సమాచారం. కొత్త డ్యామ్ ప్రాజెక్ట్ కోసం ఆ గ్రామాన్ని 'పునరావాసం' కల్పిస్తున్నారని అధికారిక కథనం. కానీ ఆ చిన్న సమాచారం వేరే కథ చెప్పింది.

    అంజలి అక్కడికి చేరుకునేసరికి, గాలిలో భయం కమ్ముకుని ఉంది. ఆ గూడెం ప్రజలను, వారి సొంత భూమిపైనే దెయ్యాల్లా చూస్తున్నారు. యూనిఫాం వేసుకున్న మనుషులు వారి పొలాల్లో గస్తీ కాస్తున్నారు. నష్టపరిహారం, కొత్త ఇళ్ల వాగ్దానాలు గాలిలో కలిసిపోతున్న బోలు మాటలయ్యాయి. చాలా రోజుల వరకు ఎవరూ ఆమెతో మాట్లాడలేదు. వారికి ఆమె కూడా ఒక నోట్‌బుక్‌తో వచ్చిన బయటి మనిషే. వారి విషాదాన్ని చూడటానికి వచ్చిన మరో పర్యాటకురాలే.

    "రిపోర్టర్‌గా వెళ్లకు, శ్రోతగా వెళ్ళు" అని ప్రకాష్ ఇచ్చిన సలహా గుర్తుకువచ్చి, ఆమె తన నోట్‌బుక్‌ను పక్కన పెట్టింది. ఒక వృద్ధురాలికి బావి నుండి నీరు తోడటానికి సహాయం చేసింది. పిల్లలతో కూర్చుని వారి పాటలు విన్నది. వారు పెట్టిన సాధారణ భోజనాన్ని పంచుకుంది. చెట్లు, కొండలు, వాటిలో నివసించే ఆత్మల పేర్లను తెలుసుకుంది.

    నెమ్మదిగా, కథలు బయటకు రావడం మొదలయ్యాయి. ఇంటర్వ్యూలుగా కాదు, సంభాషణలుగా. నీట మునిగిపోనున్న పవిత్రమైన వనాల గురించి, నకిలీ పత్రాలతో అమ్మేసిన పూర్వీకుల భూముల గురించి, భవిష్యత్తులో కొట్టుకుపోనున్న వారి అస్తిత్వం గురించి వారు మాట్లాడారు. తరతరాల జ్ఞానాన్ని తన కళ్ళలో నింపుకున్న ఒక గూడెం పెద్ద, చివరకు ఒక చిరిగిన ఫైల్‌ను ఆమెకు చూపించాడు. అందులో అసలైన భూమి పత్రాలు ఉన్నాయి. ఆ భూమి వారికే சொந்தమని నిరూపించే సాక్ష్యాలు. అధికారులు లేవని చెప్పిన నిజాలు.

    ఆమె సాక్ష్యాలను నమోదు చేస్తున్న కొద్దీ, ఒత్తిడి పెరిగింది. ఆమె వాహనం టైర్లు కోసేశారు. ఒక స్థానిక అధికారి ఆమె భద్రత కోసం వెళ్ళిపొమ్మని హెచ్చరించాడు. ఆమెలోని మనిషి భయపడింది. కానీ ఆమెలోని జర్నలిస్ట్, తను ఇస్తానన్న గొంతుక, ఇదే అసలైన కథ అని గ్రహించింది. ఇది ఎంపిక చేసుకోవలసిన సమయం: వారి ఓటమికి సాక్షిగా మిగిలిపోవడమా? లేక వారి పోరాటానికి ఒక వాహికగా మారడమా?

    ఆమె తన పరిశోధనలను ప్రకాష్‌కు పంపింది. 'భారత్ ఆవాజ్' కేవలం ఒక కథనాన్ని ప్రచురించలేదు. వారు ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. వారు గ్రామస్తుల మాటలను, వారి ఫోటోలను, వారి పాటలను ఉపయోగించారు. శీర్షిక చాలా సరళంగా ఉంది: "పత్తర్‌గఢ్‌కు ఒక గొంతు ఉంది. మీరు వింటున్నారా?"

    సోషల్ మీడియాలో విస్తరించిన ఆ కథ, జాతీయ మీడియా నిర్లక్ష్యపు బుడగను బద్దలు కొట్టింది. విద్యార్థులు, కార్యకర్తలు, ఆ తర్వాత సిగ్గుతో తలదించుకుని శ్రద్ధ పెట్టవలసి వచ్చిన ప్రముఖ జర్నలిస్టులు కూడా దాన్ని పంచుకున్నారు. #AawazForPathargarh అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవ్వడం మొదలైంది. గ్రామస్తుల సాక్ష్యంలోని కఠినమైన నిజం, ఏ పాలిష్ చేసిన కార్పొరేట్ పత్రికా ప్రకటన కన్నా శక్తివంతమైనది.

    వారాల తర్వాత, ఆ కథ ద్వారా సమాచారం అందుకున్న మానవ హక్కుల న్యాయవాదుల బృందం పత్తర్‌గఢ్‌కు చేరుకుంది. జాతీయ కమిషన్ విచారణ ప్రారంభించింది. భూమి హక్కులను సమీక్షించే వరకు డ్యామ్ ప్రాజెక్ట్ నిలిపివేయబడింది.

    అంజలి ఒక కొండపై నిలబడి ఆ గ్రామాన్ని చూసింది. ఒక కథను 'బ్రేక్' చేసిన రిపోర్టర్‌గా కాదు, సత్యపు గొలుసులో ఒకానొక భాగంగా. ఆ విజయం ఆమెది కాదు; మాట్లాడటానికి ధైర్యం చేసిన పత్తర్‌గఢ్ ప్రజలది. 'భారత్ ఆవాజ్' వారికి గొంతు ఇవ్వలేదు; కేవలం మైక్రోఫోన్‌ను అందించింది, తద్వారా వారు పాడుతున్న పాటను దేశమంతా వినగలిగింది. ఒకప్పుడు తనలో మిగిలిన నిరాశ అనే నిప్పురవ్వ, పత్తర్‌గఢ్ పోరాటపు అగ్నిలో అఖండ జ్వాలగా మారింది. ఆమెకు చివరకు అర్థమైంది. భారత్ ఆవాజ్ అవ్వాలంటే, ముందు దేశపు గుండె చప్పుడు వినగలగాలి.
    The Voice Listens అంజలి తన జర్నలిజం డిగ్రీని, పదును కోల్పోయిన కవచంలా పట్టుకుంది. ఆమె ఇంటర్న్‌షిప్ చేసిన ఢిల్లీ న్యూస్‌రూమ్‌ల హోరులో, నిజం ఒక అంగడి సరుకైపోయింది. రేటింగుల కోసం, పలుకుబడి ఉన్నవారి కోసం సత్యాన్ని తాకట్టుపెట్టేవారు. దేశానికి అవసరమైన కథలు, సెలబ్రిటీల గాసిప్‌లు, రాజకీయ నాయకుల అరుపుల కింద సమాధి చేయబడ్డాయి. కళాశాలలో తనను నడిపించిన ఆశయాల అగ్ని, నిరాశ అనే నీటితో ఆరిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇదేనా జర్నలిజం? దేశపు గొంతుకంటే కేవలం కొందరి ప్రతిధ్వనేనా? ఒక రాత్రి, ఆ డిజిటల్ శబ్దంలో దారితప్పి తిరుగుతున్నప్పుడు, ఒక సాధారణమైన, సూటైన శీర్షిక ఆమె కంటపడింది. అది ఏ పెద్ద సంస్థ నుంచీ కాదు. ఆ వెబ్‌సైట్ చాలా నిరాడంబరంగా ఉంది. లోగోలో శక్తివంతమైన దేవనాగరి లిపిలో 'భారత్ ఆవాజ్' అని రాసి ఉంది. దాని కింద ఉన్న వాక్యం ఆమెను కదిలించింది: "నువ్వు పేదల, అణగారిన, నిస్సహాయుల గొంతుక కాగలవా?" ఆ కథ బీహార్‌లోని ఒక మారుమూల గ్రామంలోని చేనేత కార్మికులది. కొత్త పారిశ్రామిక విధానం వారి జీవితాలను ఎలా నాశనం చేస్తుందో అందులో వివరించారు. ఆ కథను స్టూడియోలో కూర్చున్న నిపుణుడి కోణంలో కాకుండా, ఆ కార్మికుల కఠినమైన, కల్మషం లేని మాటలతోనే చెప్పారు. అందులో సంచలనం లేదు, వారి పోరాటంలో ఒక నిశ్శబ్దమైన, గంభీరమైన గౌరవం మాత్రమే ఉంది. అంజలి గంటపాటు ఆ సైట్‌లోని ప్రతి కథనాన్ని చదివింది. ఇవి దేశపు గుండె లోతుల్లోంచి వచ్చిన కథలు. కెమెరాలు ఎప్పుడూ వెళ్లని ప్రదేశాల నుంచి వచ్చినవి. ఇది వ్యాపారం కోసం కాదు, సేవ కోసం చేస్తున్న జర్నలిజం. ఎన్నో నెలల తర్వాత తనలో కొత్త ఉత్తేజం నిండింది. వారి కాంటాక్ట్ కోసం వెతకగా, ఒక వాట్సాప్ నంబర్ దొరికింది. గుండె వేగంగా కొట్టుకుంటుండగా, ఒక సందేశం పంపింది. "నేను ఒక గొంతుక కావాలనుకుంటున్నాను. నేను మీతో చేరాలనుకుంటున్నాను" అని రాసింది. సమాధానం ప్రకాష్ అనే వ్యక్తి నుండి వచ్చింది. అతను 'భారత్ ఆవాజ్' వ్యవస్థాపకుడు మరియు సంపాదకుడు. 'భారత్ ఆవాజ్' ఒక కంపెనీ కాదని, అదొక యజ్ఞమని వివరించాడు. వారికి పెద్ద కార్యాలయాలు లేవు, కేవలం కొద్దిమంది నిబద్ధత గల రిపోర్టర్లు, పౌర జర్నలిస్టుల బృందం మాత్రమే ఉంది. భారతదేశపు నిజమైన కథలు బోర్డ్‌రూమ్‌లలో కాదు, పల్లెల్లో, పొలాల్లో, మురికివాడల్లోనే ఉన్నాయని నమ్మే కొద్దిమందితో నడిచే ఉద్యమం అది. ఆమె మొదటి అసైన్‌మెంట్, జార్ఖండ్ కొండలలోని 'పత్తర్‌గఢ్' అనే ఒక గిరిజన గూడెం నుండి వచ్చిన ఒక చిన్న సమాచారం. కొత్త డ్యామ్ ప్రాజెక్ట్ కోసం ఆ గ్రామాన్ని 'పునరావాసం' కల్పిస్తున్నారని అధికారిక కథనం. కానీ ఆ చిన్న సమాచారం వేరే కథ చెప్పింది. అంజలి అక్కడికి చేరుకునేసరికి, గాలిలో భయం కమ్ముకుని ఉంది. ఆ గూడెం ప్రజలను, వారి సొంత భూమిపైనే దెయ్యాల్లా చూస్తున్నారు. యూనిఫాం వేసుకున్న మనుషులు వారి పొలాల్లో గస్తీ కాస్తున్నారు. నష్టపరిహారం, కొత్త ఇళ్ల వాగ్దానాలు గాలిలో కలిసిపోతున్న బోలు మాటలయ్యాయి. చాలా రోజుల వరకు ఎవరూ ఆమెతో మాట్లాడలేదు. వారికి ఆమె కూడా ఒక నోట్‌బుక్‌తో వచ్చిన బయటి మనిషే. వారి విషాదాన్ని చూడటానికి వచ్చిన మరో పర్యాటకురాలే. "రిపోర్టర్‌గా వెళ్లకు, శ్రోతగా వెళ్ళు" అని ప్రకాష్ ఇచ్చిన సలహా గుర్తుకువచ్చి, ఆమె తన నోట్‌బుక్‌ను పక్కన పెట్టింది. ఒక వృద్ధురాలికి బావి నుండి నీరు తోడటానికి సహాయం చేసింది. పిల్లలతో కూర్చుని వారి పాటలు విన్నది. వారు పెట్టిన సాధారణ భోజనాన్ని పంచుకుంది. చెట్లు, కొండలు, వాటిలో నివసించే ఆత్మల పేర్లను తెలుసుకుంది. నెమ్మదిగా, కథలు బయటకు రావడం మొదలయ్యాయి. ఇంటర్వ్యూలుగా కాదు, సంభాషణలుగా. నీట మునిగిపోనున్న పవిత్రమైన వనాల గురించి, నకిలీ పత్రాలతో అమ్మేసిన పూర్వీకుల భూముల గురించి, భవిష్యత్తులో కొట్టుకుపోనున్న వారి అస్తిత్వం గురించి వారు మాట్లాడారు. తరతరాల జ్ఞానాన్ని తన కళ్ళలో నింపుకున్న ఒక గూడెం పెద్ద, చివరకు ఒక చిరిగిన ఫైల్‌ను ఆమెకు చూపించాడు. అందులో అసలైన భూమి పత్రాలు ఉన్నాయి. ఆ భూమి వారికే சொந்தమని నిరూపించే సాక్ష్యాలు. అధికారులు లేవని చెప్పిన నిజాలు. ఆమె సాక్ష్యాలను నమోదు చేస్తున్న కొద్దీ, ఒత్తిడి పెరిగింది. ఆమె వాహనం టైర్లు కోసేశారు. ఒక స్థానిక అధికారి ఆమె భద్రత కోసం వెళ్ళిపొమ్మని హెచ్చరించాడు. ఆమెలోని మనిషి భయపడింది. కానీ ఆమెలోని జర్నలిస్ట్, తను ఇస్తానన్న గొంతుక, ఇదే అసలైన కథ అని గ్రహించింది. ఇది ఎంపిక చేసుకోవలసిన సమయం: వారి ఓటమికి సాక్షిగా మిగిలిపోవడమా? లేక వారి పోరాటానికి ఒక వాహికగా మారడమా? ఆమె తన పరిశోధనలను ప్రకాష్‌కు పంపింది. 'భారత్ ఆవాజ్' కేవలం ఒక కథనాన్ని ప్రచురించలేదు. వారు ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. వారు గ్రామస్తుల మాటలను, వారి ఫోటోలను, వారి పాటలను ఉపయోగించారు. శీర్షిక చాలా సరళంగా ఉంది: "పత్తర్‌గఢ్‌కు ఒక గొంతు ఉంది. మీరు వింటున్నారా?" సోషల్ మీడియాలో విస్తరించిన ఆ కథ, జాతీయ మీడియా నిర్లక్ష్యపు బుడగను బద్దలు కొట్టింది. విద్యార్థులు, కార్యకర్తలు, ఆ తర్వాత సిగ్గుతో తలదించుకుని శ్రద్ధ పెట్టవలసి వచ్చిన ప్రముఖ జర్నలిస్టులు కూడా దాన్ని పంచుకున్నారు. #AawazForPathargarh అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవ్వడం మొదలైంది. గ్రామస్తుల సాక్ష్యంలోని కఠినమైన నిజం, ఏ పాలిష్ చేసిన కార్పొరేట్ పత్రికా ప్రకటన కన్నా శక్తివంతమైనది. వారాల తర్వాత, ఆ కథ ద్వారా సమాచారం అందుకున్న మానవ హక్కుల న్యాయవాదుల బృందం పత్తర్‌గఢ్‌కు చేరుకుంది. జాతీయ కమిషన్ విచారణ ప్రారంభించింది. భూమి హక్కులను సమీక్షించే వరకు డ్యామ్ ప్రాజెక్ట్ నిలిపివేయబడింది. అంజలి ఒక కొండపై నిలబడి ఆ గ్రామాన్ని చూసింది. ఒక కథను 'బ్రేక్' చేసిన రిపోర్టర్‌గా కాదు, సత్యపు గొలుసులో ఒకానొక భాగంగా. ఆ విజయం ఆమెది కాదు; మాట్లాడటానికి ధైర్యం చేసిన పత్తర్‌గఢ్ ప్రజలది. 'భారత్ ఆవాజ్' వారికి గొంతు ఇవ్వలేదు; కేవలం మైక్రోఫోన్‌ను అందించింది, తద్వారా వారు పాడుతున్న పాటను దేశమంతా వినగలిగింది. ఒకప్పుడు తనలో మిగిలిన నిరాశ అనే నిప్పురవ్వ, పత్తర్‌గఢ్ పోరాటపు అగ్నిలో అఖండ జ్వాలగా మారింది. ఆమెకు చివరకు అర్థమైంది. భారత్ ఆవాజ్ అవ్వాలంటే, ముందు దేశపు గుండె చప్పుడు వినగలగాలి.
    Love
    1
    0 Comments 0 Shares 500 Views 0 Reviews
  • సికింద్రాబాద్.. ఆషాడ బోనాల ఉత్సవాలలో భాగంగా అత్తిలి అరుణ ఆధ్వర్యంలో నిర్వహించే తొలి బోనం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి సనత్ నగర్ శాసనసభ్యులు శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఆషాడంలో భాగంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బోనాన్ని ఆనవాయితీగా అత్తిలి అరుణ కుటుంబం సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా జోగిని శ్యామల బోనం ఎత్తుకొని చేసిన నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గోల్కొండ అనంతరం ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని అందులో తొలి బోనం కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురవాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా జంట నగరాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా బోనాల పండుగ విశిష్టత అందరికీ తెలియజేసేలా గొప్పగా జరిపినట్లు తెలిపారు.
    సికింద్రాబాద్.. ఆషాడ బోనాల ఉత్సవాలలో భాగంగా అత్తిలి అరుణ ఆధ్వర్యంలో నిర్వహించే తొలి బోనం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి సనత్ నగర్ శాసనసభ్యులు శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఆషాడంలో భాగంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బోనాన్ని ఆనవాయితీగా అత్తిలి అరుణ కుటుంబం సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా జోగిని శ్యామల బోనం ఎత్తుకొని చేసిన నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గోల్కొండ అనంతరం ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని అందులో తొలి బోనం కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురవాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా జంట నగరాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా బోనాల పండుగ విశిష్టత అందరికీ తెలియజేసేలా గొప్పగా జరిపినట్లు తెలిపారు.
    0 Comments 0 Shares 301 Views 15 0 Reviews
  • విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
    రేగోడు: విద్యార్థులు మంచి నడవడికతో విద్యనభ్యసిస్తే బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవచ్చని, విద్యార్థి దశలో సైబర్‌ నేరాలకు, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని రేగోడు మండల ఎస్‌ఐ పోచయ్య అన్నారు. మోడల్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ప్రవీణ అధ్యక్షతన ‘సైబర్‌ నేరాలు-డ్రగ్స్‌ వాడకం’ అనే అంశంతో పాటు మహిళలపై జరుగుతున్న నేరాల గురించి అవగాహన సదస్సు మంగళవారం నిర్వహిం చారు. రేగోడు ఎస్‌ఐ మాట్లాడుతూ సమాజంలో మహిళలపై జరిగే సైబర్‌ క్రైమ్‌ గురించి విద్యార్థులు అవగాహన కలిగి ఉండాల న్నారు. విద్యార్థి దశలో డ్రగ్స్‌ అలవాటు చేసుకుని ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడంతో పాటు అనేక నేరాలకు దగ్గరవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచిగా నడుచుకోవాలన్నారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఈ పాఠశాలలో చదివిన అనేక మంది మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారని, వారు విద్యార్థి దశ నుంచి మంచి ప్రవర్తనతో మెలిగారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సోమవారం పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఫోన్‌కి మెసేజ్‌లు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్‌ క్రైమ్‌కు గురైన వెంటనే 1930కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఈవ్‌టీజింగ్‌ చేయరాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ , కళాశాల ప్రిన్సిపాల్‌ విద్యార్థులు పాల్గొన్నారు.
    విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి రేగోడు: విద్యార్థులు మంచి నడవడికతో విద్యనభ్యసిస్తే బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవచ్చని, విద్యార్థి దశలో సైబర్‌ నేరాలకు, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని రేగోడు మండల ఎస్‌ఐ పోచయ్య అన్నారు. మోడల్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ప్రవీణ అధ్యక్షతన ‘సైబర్‌ నేరాలు-డ్రగ్స్‌ వాడకం’ అనే అంశంతో పాటు మహిళలపై జరుగుతున్న నేరాల గురించి అవగాహన సదస్సు మంగళవారం నిర్వహిం చారు. రేగోడు ఎస్‌ఐ మాట్లాడుతూ సమాజంలో మహిళలపై జరిగే సైబర్‌ క్రైమ్‌ గురించి విద్యార్థులు అవగాహన కలిగి ఉండాల న్నారు. విద్యార్థి దశలో డ్రగ్స్‌ అలవాటు చేసుకుని ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడంతో పాటు అనేక నేరాలకు దగ్గరవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచిగా నడుచుకోవాలన్నారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఈ పాఠశాలలో చదివిన అనేక మంది మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారని, వారు విద్యార్థి దశ నుంచి మంచి ప్రవర్తనతో మెలిగారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సోమవారం పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఫోన్‌కి మెసేజ్‌లు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్‌ క్రైమ్‌కు గురైన వెంటనే 1930కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఈవ్‌టీజింగ్‌ చేయరాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ , కళాశాల ప్రిన్సిపాల్‌ విద్యార్థులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 587 Views 0 Reviews
  • సఫిల్ గూడ మినీ ట్యాంక్ బండ్ వద్ద మహనీయుల విగ్రహాల స్థాపనను వ్యతిరేకించిన బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ వ్యాఖ్యలు రాజకీయ వేడిని రగిల్చాయి. ఈ విషయంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మౌలాఅలీ డివిజన్‌కు చెందిన దూలం మహేష్ గౌడ్ శ్రవణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. శ్రవణ్, తన వ్యాఖ్యలను ఖండించిన బీసీ నాయకులను 'చిల్లర గాళ్లు', 'బేకార్ గాళ్లు' అంటూ అవమానించి, అగ్రకుల అహంకారాన్ని బహిర్గతం చేశారని మహేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
    "నీకు చిత్తశుద్ధి ఉంటే, అందరినీ కలుపుకుని నువ్వు విగ్రహాల ప్రతిష్టాపనకు వ్యతిరేకం కాదని నిరూపించు! మహనీయుల విగ్రహాలను వ్యతిరేకిస్తున్నావని పత్రికల్లో వచ్చిన వార్తలను ఖండించు. నోటికొచ్చినట్లు బీసీ కులాలపై దాడి చేయడం నీ అసలు రంగును చూపిస్తుంది," అని ఆయన సవాల్ విసిరారు. "నీవు కష్టపడి చదువుకున్నావంటావు, ఆ చదువుకు గౌరవం ఇవ్వు. నీకు మంచి భవిష్యత్తు, గౌరవం ఉన్నాయి. అహంకారంతో వాటిని నాశనం చేసుకోకు," అని హితవు పలికారు.
    ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చుట్టూ ఉన్నవారిని 'చిల్లర గాళ్లు' అనడం, ఎమ్మెల్యే ఈ వివాదానికి కారణమని ఆరోపించడంపై మహేష్ గౌడ్ మండిపడ్డారు. "ఎమ్మెల్యే కుల వివక్షతో ఉంటే, అరుంధతి హాస్పిటల్‌లో రోజూ 5-6 లక్షలు ఖర్చు చేస్తూ, కులం, ప్రాంతం తెలియకుండా నిరుపేదలకు వైద్యం ఎలా అందిస్తారు? నీకు దమ్ము ఉంటే, ఒక్క పేదవాడికైనా 10,000 రూపాయలు ఖర్చు చేసి చూపించు. విమర్శలు చేయడం తేలిక, కానీ ఎందుకు చేస్తున్నావో కారణం చెప్పు," అని ఆయన ప్రశ్నించారు.
    "పెద్దలను విమర్శిస్తే నీవు ఎప్పటికీ పెద్దోడివి కాలేవు. నీ బీజేపీలోని బీసీ నాయకులు ఎవరూ నిన్ను సమర్థించడం లేదు. ఇప్పటికైనా ఆలోచించి సరిదిద్దుకో," అని మహేష్ గౌడ్ గట్టిగా చెప్పారు.
    సఫిల్ గూడ మినీ ట్యాంక్ బండ్ వద్ద మహనీయుల విగ్రహాల స్థాపనను వ్యతిరేకించిన బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ వ్యాఖ్యలు రాజకీయ వేడిని రగిల్చాయి. ఈ విషయంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మౌలాఅలీ డివిజన్‌కు చెందిన దూలం మహేష్ గౌడ్ శ్రవణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. శ్రవణ్, తన వ్యాఖ్యలను ఖండించిన బీసీ నాయకులను 'చిల్లర గాళ్లు', 'బేకార్ గాళ్లు' అంటూ అవమానించి, అగ్రకుల అహంకారాన్ని బహిర్గతం చేశారని మహేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. "నీకు చిత్తశుద్ధి ఉంటే, అందరినీ కలుపుకుని నువ్వు విగ్రహాల ప్రతిష్టాపనకు వ్యతిరేకం కాదని నిరూపించు! మహనీయుల విగ్రహాలను వ్యతిరేకిస్తున్నావని పత్రికల్లో వచ్చిన వార్తలను ఖండించు. నోటికొచ్చినట్లు బీసీ కులాలపై దాడి చేయడం నీ అసలు రంగును చూపిస్తుంది," అని ఆయన సవాల్ విసిరారు. "నీవు కష్టపడి చదువుకున్నావంటావు, ఆ చదువుకు గౌరవం ఇవ్వు. నీకు మంచి భవిష్యత్తు, గౌరవం ఉన్నాయి. అహంకారంతో వాటిని నాశనం చేసుకోకు," అని హితవు పలికారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చుట్టూ ఉన్నవారిని 'చిల్లర గాళ్లు' అనడం, ఎమ్మెల్యే ఈ వివాదానికి కారణమని ఆరోపించడంపై మహేష్ గౌడ్ మండిపడ్డారు. "ఎమ్మెల్యే కుల వివక్షతో ఉంటే, అరుంధతి హాస్పిటల్‌లో రోజూ 5-6 లక్షలు ఖర్చు చేస్తూ, కులం, ప్రాంతం తెలియకుండా నిరుపేదలకు వైద్యం ఎలా అందిస్తారు? నీకు దమ్ము ఉంటే, ఒక్క పేదవాడికైనా 10,000 రూపాయలు ఖర్చు చేసి చూపించు. విమర్శలు చేయడం తేలిక, కానీ ఎందుకు చేస్తున్నావో కారణం చెప్పు," అని ఆయన ప్రశ్నించారు. "పెద్దలను విమర్శిస్తే నీవు ఎప్పటికీ పెద్దోడివి కాలేవు. నీ బీజేపీలోని బీసీ నాయకులు ఎవరూ నిన్ను సమర్థించడం లేదు. ఇప్పటికైనా ఆలోచించి సరిదిద్దుకో," అని మహేష్ గౌడ్ గట్టిగా చెప్పారు.
    0 Comments 0 Shares 502 Views 22 0 Reviews
  • ఇది దమ్మాయిగూడ లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ప్రభుత్వము జీవో జారీ చేసి పైన లేయర్ ఎయ్యద్దు అని చెప్పినా కూడా చిత్త వేసి ఇంకో లేయర్ తయారు చేస్తున్నటువంటి వైనం. ప్రభుత్వాధికారులు చెప్పినా నాయకులు చెప్పిన డంపింగ్ యార్డ్ కాంట్రాక్టర్ యాజమాన్యం పట్టించుకోకుండా ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్నటువంటి పరిస్థితి. ఆరోగ్య సమస్యలతో దిక్కులేని చావు చస్తున్నటువంటి జనాలు అయినా నిమ్మకు నీరెత్తిన అధికార గణం నాయకులు. ఇంతకుముందే ప్రభుత్వం జీవో జారీ అక్కడ మంచినీరు వాడకూడదు. గాలి కాలుష్యం అయిపోయింది. రోజువారి కూలికి పోయి సంపాదించుకుంటున్నటువంటి జనం ఆ సంపాదన రోగాలకు పెట్టే పరిస్థితి. మరి ఎలా జీవనం గడపాలి వచ్చిన సంపాదన రోగాలకు పోతే ఎలా బతకాలి. ఓట్ల కోసం జనం కావాలి పన్నుల కోసం జనం కావాలి. మరి వీరిని పట్టించుకునే నాధుడు ఎవరు. రాత్రి వేళల్లో విపరీతమైన దుర్వాసన రావడం వల్ల వాంతులు, విరోచనాలు మరియు కడుపు నొప్పితో బాధపడుతున్నటువంటి పిల్లలు పెద్దలు. అక్కడ పరిసర ప్రాంతాల్లో నీరు వాడితే చర్మ వ్యాధులు, ఎలర్జీలు మరియు వింత రకాల వ్యాధులు. దిక్కుతోచని పరిస్థితి అనుభవిస్తున్నటువంటి ప్రజలు ముఖ్యమంత్రి దగ్గరికి ఒక వెళ్లలేనటువంటి సామాన్యుడు. మరి ఎవరికి చెప్పుకోవాలి బాధ మమ్మల్ని ఎవరు ఆదుకుంటారని ఆశతో ఎదురుచూస్తున్నటువంటి ప్రజలు. దీనికి సమాధానం ఎవరు చెప్తారు.
    ఇది దమ్మాయిగూడ లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ప్రభుత్వము జీవో జారీ చేసి పైన లేయర్ ఎయ్యద్దు అని చెప్పినా కూడా చిత్త వేసి ఇంకో లేయర్ తయారు చేస్తున్నటువంటి వైనం. ప్రభుత్వాధికారులు చెప్పినా నాయకులు చెప్పిన డంపింగ్ యార్డ్ కాంట్రాక్టర్ యాజమాన్యం పట్టించుకోకుండా ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్నటువంటి పరిస్థితి. ఆరోగ్య సమస్యలతో దిక్కులేని చావు చస్తున్నటువంటి జనాలు అయినా నిమ్మకు నీరెత్తిన అధికార గణం నాయకులు. ఇంతకుముందే ప్రభుత్వం జీవో జారీ అక్కడ మంచినీరు వాడకూడదు. గాలి కాలుష్యం అయిపోయింది. రోజువారి కూలికి పోయి సంపాదించుకుంటున్నటువంటి జనం ఆ సంపాదన రోగాలకు పెట్టే పరిస్థితి. మరి ఎలా జీవనం గడపాలి వచ్చిన సంపాదన రోగాలకు పోతే ఎలా బతకాలి. ఓట్ల కోసం జనం కావాలి పన్నుల కోసం జనం కావాలి. మరి వీరిని పట్టించుకునే నాధుడు ఎవరు. రాత్రి వేళల్లో విపరీతమైన దుర్వాసన రావడం వల్ల వాంతులు, విరోచనాలు మరియు కడుపు నొప్పితో బాధపడుతున్నటువంటి పిల్లలు పెద్దలు. అక్కడ పరిసర ప్రాంతాల్లో నీరు వాడితే చర్మ వ్యాధులు, ఎలర్జీలు మరియు వింత రకాల వ్యాధులు. దిక్కుతోచని పరిస్థితి అనుభవిస్తున్నటువంటి ప్రజలు ముఖ్యమంత్రి దగ్గరికి ఒక వెళ్లలేనటువంటి సామాన్యుడు. మరి ఎవరికి చెప్పుకోవాలి బాధ మమ్మల్ని ఎవరు ఆదుకుంటారని ఆశతో ఎదురుచూస్తున్నటువంటి ప్రజలు. దీనికి సమాధానం ఎవరు చెప్తారు.
    Love
    1
    0 Comments 1 Shares 1K Views 36 0 Reviews
  • ప్రమాదాల నివారణ చర్యలు.
    లోతుకుంట చౌరస్తాలో భారీ రావి చెట్టు తొలగింపు.

    రాజీవ్ రహదారి పైన లోతుకుంట చౌరస్తా బొల్లారం రాష్ట్రపతి నిర్ణయం టర్నింగ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం కాంపౌండ్ వాల్ లో ఉన్న భారీ రావి చెట్టును నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసిపి. శంకర్ రాజు మరియు తిరుమలగిరి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మధు నాయకత్వంలో, బుధవారం ఉదయం నుండి ట్రాఫిక్ ను ఒకవైపు నియంత్రిస్తూ.. కంటోన్మెంట్ అధికారులు, విద్యుత్ శాఖ, హార్టికల్చర్ విభాగం అధికారులు సిబ్బందిసహాయంతో ట్రాఫిక్ ని నియంత్రిస్తూ భారీ రావి చెట్టును లోతుగా వేర్ల నుండి తీసి దానిని తిరిగి పునర్జీవనం కోసం అల్వాల్ లోని ప్రభుత్వ ఐటిఐ కళాశాల ఆవరణలో పునర్ వృద్ధి కి లోతైన గుంత తీసి భూమిలో పాతిపెట్టారు తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని , హకీంపేట్ వై-జంక్షన్ నుండి తిరుమలగిరి ఆర్టిఏ కార్యాలయం దాకా ఉన్న రాజీవ్ రహదారి వెంబడి కీలక భాగంగా ఉంటుంది. ఇది సికింద్రాబాద్‌ను కరీంనగర్, రామగుండంను కలుపుతూ సిద్ధిపేట, కరీంనగర్ వైపు అధిక ట్రాఫిక్ ఉంటుంది. ప్రతిరోజు ఇక్కడ అనేకప్రమాదాలుజరుగుతున్నాయి లోతుకుంట జంక్షన్ వద్ద ఉన్న ఒక పెద్ద చెట్టు తీవ్ర ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతూ, దాని కొమ్మలు ప్రయాణికులకూ ప్రమాదంగా మారాయి. ఈ చెట్టు వల్ల ప్రమాదాలు సంభవించినఘటనలు
    గతంలోపలుమార్లుచోటుచేసుకు న్నాయి. పెద్ద వాహనాలకు అడ్డంగా ఉండే కొమ్మలు ట్రాఫిక్కు ఆటంకంగా మారి, ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించాయి. సంవత్సర కాలంలో లోతుకుంట నుండి బొల్లారం రాష్ట్రపతి నిలయం వైపు వెళ్తున్న వాహనాల వద్ద ప్రమాదాలుజరుగుతున్నాయి.
    అందువల్ల, సంబంధిత అధికారుల అనుమతి పొందిన తరువాత లోతుకుంట జంక్షన్ వద్ద ఉన్న రావి చెట్టును విజయవంతంగా అల్వాల్లోని ఐటీఐ కాలేజీ ప్రాంగణానికి తరలించబడింది. ఈ చెట్టు ఎదుగుదల పునర్వృద్ధి ని పర్యవేక్షిస్తూ,చర్యలుతీసుకోబడతాయి.ఈ రావి చెట్టు తరలింపుతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా సాగుతుంది. ఇప్పుడు ఆర్.పి. నిలయం రోడ్డుపై నుంచి వచ్చిన వాహనదారులు అడ్డంకులు లేకుండా అల్వాల్ వైపు యూ టర్న్ తీసుకోగలుగుతున్నారు. అలాగే, అల్వాల్ నుండి ఆర్.పి. నిలయం వైపు వచ్చే వాహనాలు సులభంగా ఫ్రీ లెఫ్ట్ తీసుకోగలుగుతున్నాయి.
    అదేవిధంగా, అంబేద్కర్ విగ్రహం కమిటీ సభ్యులతో చర్చించిన తర్వాత, ట్రాఫిక్ నిరవధికంగా పనులు చేపట్టారు. భారీ క్రేన్లు జెసిబి లు సహాయంతో విజయవంతంగా పనులు పూర్తి చేశారు . పనులు జరుగుతున్నంత సమయం పాటు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా నియంత్రించారు .
    ప్రమాదాల నివారణ చర్యలు. లోతుకుంట చౌరస్తాలో భారీ రావి చెట్టు తొలగింపు. రాజీవ్ రహదారి పైన లోతుకుంట చౌరస్తా బొల్లారం రాష్ట్రపతి నిర్ణయం టర్నింగ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం కాంపౌండ్ వాల్ లో ఉన్న భారీ రావి చెట్టును నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసిపి. శంకర్ రాజు మరియు తిరుమలగిరి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మధు నాయకత్వంలో, బుధవారం ఉదయం నుండి ట్రాఫిక్ ను ఒకవైపు నియంత్రిస్తూ.. కంటోన్మెంట్ అధికారులు, విద్యుత్ శాఖ, హార్టికల్చర్ విభాగం అధికారులు సిబ్బందిసహాయంతో ట్రాఫిక్ ని నియంత్రిస్తూ భారీ రావి చెట్టును లోతుగా వేర్ల నుండి తీసి దానిని తిరిగి పునర్జీవనం కోసం అల్వాల్ లోని ప్రభుత్వ ఐటిఐ కళాశాల ఆవరణలో పునర్ వృద్ధి కి లోతైన గుంత తీసి భూమిలో పాతిపెట్టారు తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని , హకీంపేట్ వై-జంక్షన్ నుండి తిరుమలగిరి ఆర్టిఏ కార్యాలయం దాకా ఉన్న రాజీవ్ రహదారి వెంబడి కీలక భాగంగా ఉంటుంది. ఇది సికింద్రాబాద్‌ను కరీంనగర్, రామగుండంను కలుపుతూ సిద్ధిపేట, కరీంనగర్ వైపు అధిక ట్రాఫిక్ ఉంటుంది. ప్రతిరోజు ఇక్కడ అనేకప్రమాదాలుజరుగుతున్నాయి లోతుకుంట జంక్షన్ వద్ద ఉన్న ఒక పెద్ద చెట్టు తీవ్ర ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతూ, దాని కొమ్మలు ప్రయాణికులకూ ప్రమాదంగా మారాయి. ఈ చెట్టు వల్ల ప్రమాదాలు సంభవించినఘటనలు గతంలోపలుమార్లుచోటుచేసుకు న్నాయి. పెద్ద వాహనాలకు అడ్డంగా ఉండే కొమ్మలు ట్రాఫిక్కు ఆటంకంగా మారి, ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించాయి. సంవత్సర కాలంలో లోతుకుంట నుండి బొల్లారం రాష్ట్రపతి నిలయం వైపు వెళ్తున్న వాహనాల వద్ద ప్రమాదాలుజరుగుతున్నాయి. అందువల్ల, సంబంధిత అధికారుల అనుమతి పొందిన తరువాత లోతుకుంట జంక్షన్ వద్ద ఉన్న రావి చెట్టును విజయవంతంగా అల్వాల్లోని ఐటీఐ కాలేజీ ప్రాంగణానికి తరలించబడింది. ఈ చెట్టు ఎదుగుదల పునర్వృద్ధి ని పర్యవేక్షిస్తూ,చర్యలుతీసుకోబడతాయి.ఈ రావి చెట్టు తరలింపుతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా సాగుతుంది. ఇప్పుడు ఆర్.పి. నిలయం రోడ్డుపై నుంచి వచ్చిన వాహనదారులు అడ్డంకులు లేకుండా అల్వాల్ వైపు యూ టర్న్ తీసుకోగలుగుతున్నారు. అలాగే, అల్వాల్ నుండి ఆర్.పి. నిలయం వైపు వచ్చే వాహనాలు సులభంగా ఫ్రీ లెఫ్ట్ తీసుకోగలుగుతున్నాయి. అదేవిధంగా, అంబేద్కర్ విగ్రహం కమిటీ సభ్యులతో చర్చించిన తర్వాత, ట్రాఫిక్ నిరవధికంగా పనులు చేపట్టారు. భారీ క్రేన్లు జెసిబి లు సహాయంతో విజయవంతంగా పనులు పూర్తి చేశారు . పనులు జరుగుతున్నంత సమయం పాటు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా నియంత్రించారు .
    Like
    1
    0 Comments 0 Shares 700 Views 0 Reviews
  • You must be 18+ to view this content
More Results
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com