Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మంచిర్యాల్: వరి ధాన్యం తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్
    కొనుగోలు కేంద్రం నుంచి వరి ధాన్యం వేగవంతంగా తరలించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ అధికారులను ఆదేశించారు. లక్షట్ పేట్ మండలం లోని పలు రైస్ మిల్లలు ఆయనే సందర్శించారు. ధాన్యం దిగుమతి ప్రక్రియ పరిశీలించారు. మిల్లుల యజమానులకు తమకు కేటాయించిన ధాన్యం బస్తాలను త్వరగా అన్లోడ్  చేసుకోవాలన్నారు. జిల్లా పౌర సరఫరాల అధికారులు, మేనేజర్, తాసిల్దార్, మరియు కలెక్టర్ పాల్గొన్నారు..
    272 Views
  • జూన్ 1న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి: పర్యటన తేదీలో మార్పు
    🎤(భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్):కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన తేదీలో మార్పు చోటుచేసుకుందని, ముందుగా నిర్ణయించిన జూన్ 2కు బదులుగా ఒక రోజు ముందే.. అంటే జూన్ 1వ తేదీన సీఎం జిల్లాలో పర్యటించనున్నారని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కెరమెరి మండలం కొఠారి గ్రామంలో కొలాం ఆదివాసీల కోసం ప్రభుత్వం...
    610 Views
  • నడిరోడ్డుపై మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్ . ‎
    ఇటీవల మణికొండలోని అల్కాపూర్ టౌన్ షిప్ లో ఒక మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వ్యక్తి ‎రెండున్నరేళ్ల బిడ్డను ఎత్తుకుని ఓ మహిళ రోడ్డుపై వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చి దుస్తులు పైకిత్తి ఓ వ్యక్తి కీచకపర్వం  ‎సీవీటీవీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డు.. కేసు నమోదు చేసి, నిందితుడ్ని గుర్తించి, అరెస్ట్ చేసిన పోలీసులు ‎నిందితుడు పుప్పాలగూడకు చెందిన వడ్డే నాగరాజు(26)గా గుర్తింపు
    282 Views
  • ఎలక్ట్రిక్ వాహనాలను ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర పార్క్ చేయకండి..
    ఎలక్ట్రిక్ వాహనాలను ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర పార్క్ చేయకండి.. ఈ దృశ్యం నన్ను కలచి వేసింది.. ఏ క్షణం ఎలా ఉంటుందో.. ఏ మాట చివరిది అవుతుందో తెలియని జీవిత చదరంగంలో మనం ఓ పావుగా బతుకుతున్నాం.. వీలైతే ఒకరికొకరు తోడ్పడుదాం
    236 Views
  • వరంగల్ జిల్లాలో మూడు రోజులు 49 మంది వడదెబ్బకు మృతి....!
    వరంగల్: మూడు రోజుల్లో 49 మంది మృతి! భారత్ అవాజ్ న్యూస్: 25 మే రోజున ఉమ్మడి వరంగల్ లో గత మూడు రోజులుగా వడదెబ్బతో 49 మంది మృతి చెందినా అధికారులు చర్యలు తీసుకోవట్లేదని జిల్లావాసులు మండిపడుతున్నారు.. శుక్రవారం 9, శనివారం 23, ఆదివారం 18 మంది మృత్యువాత పడ్డారు. ఆదివారం WGL నగరంలోనే నలుగురు మృతి చెందారు. ఉమ్మడి జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటుతున్నాయి. హీట్ వేవ్ వార్డులు, నీడ సౌకర్యం, ఉపాధి...
    282 Views
  • త్రివేణి సంగమ తీరంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.....!
    భారత్ అవాజ్ న్యూస్: 25 మే రోజున భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం అంత్య పుష్కరాల్లో భాగంగా త్రిలింగ క్షేత్రం, త్రివేణి సంగమ తీరానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది.నేడు 5వ రోజు, సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి, కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. భక్తులు త్రివేణి సంగమ తీరాన పుణ్య స్నానాలు ఆచరించి, గంగమ్మ ఒడిలో జంగమయ్య ను ఆరాధిస్తున్నారు. త్రివేణి సంగమ తీరం ఆధ్యాత్మిక శోభను...
    269 Views
  • "భద్రతపై అల్వాల్ పోలీసుల చైతన్యం: ఏఆర్కే అపార్ట్‌మెంట్స్‌లో ‘మీ సురక్ష’ కార్యక్రమం.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి జోన్ పరిధిలోని అల్వాల్ ఏఆర్కే అపార్ట్‌మెంట్స్ మరియు గేటెడ్ కమ్యూనిటీలో ‘మీ సురక్ష’ కమ్యూనిటీ పోలీసింగ్ అవగాహన కార్యక్రమం అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది. స్థానిక అల్వాల్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) ప్రశాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బేగంపేట ఏసీపీతో పాటు సెక్టార్ సబ్ ఇన్‌స్పెక్టర్ (SI), పోలీస్ సిబ్బంది...
    579 Views
  • అన్నమయ్య: దొంగతనానికి వచ్చి.. కెమెరాలకు చిక్కారు.
    శనివారం రాత్రి రాజంపేట మండలం వెంకట రాజంపేటలోని కనకదుర్గమ్మ గుడిలో ఇద్దరు దొంగలు హుండీని బద్దలు కొట్టడానికి ప్రయత్నించారు. స్కూటర్‌పై వచ్చిన దొంగలు గుడిలోకి ప్రవేశించి, హుండీని పగలగొట్టేందుకు విఫలయత్నం చేశారు. ఈ ఘటన ఆలయ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. దొంగతనాలు జరగకుండా రాత్రి పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని ప్రజలు పోలీసులను కోరుతున్నారు.
    215 Views
  • అన్నమయ్య జిల్లా : ఎక్సైజ్ కానిస్టేబుల్ మృతి
    మదనపల్లెలో ఎక్సైజ్ కానిస్టేబుల్ ఏ.రెడ్డయ్య (35) విధులు నిర్వర్తిస్తుండగా అస్వస్థతతో మృతి చెందారు. ఆదివారం జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జోగేంద్ర తెలిపిన వివరాల ప్రకారం, రామసముద్రం చెక్‌పోస్ట్‌లో పనిచేస్తున్న రెడ్డయ్యకు తీవ్ర అస్వస్థత కలగడంతో సహచరులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు. సిబ్బంది ఆయనకు నివాళులర్పించా
    257 Views
  • మదనపల్లిలో మలుపు గ్రంథఆవిష్కరణ
    మదనపల్లె ప్రశాంత్ నగర్ జ్ఞానోదయ పాఠశాలలో ప్రముఖ రచయిత్రి డాక్టర్ కామకోటి లక్ష్మీ రాఘవ రచించిన 11వ గ్రంథం 'మలుపు' (కథా సంపుటి) ఆవిష్కరణ ఆదివారం జరిగింది. డాక్టర్ గొల్లపూడి తిరుపతి రావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో, ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ కిరణ్, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రాధికలు గ్రంథ పఠనం, సాహిత్యం ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం చేకూరుతుందని తెలిపారు. ఈ పుస్తకంలోని కథలు మానసిక...
    216 Views