Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • A P in tirupathi royal Enfield project
    ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి సమీపంలో ఏర్పాటు చేయనున్న రాయల్ ఎన్ ఫీల్డ్ ప్రాజెక్టును 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని దీనికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారాన్ని అందిస్తుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ సీఈఓ గోవింద రాజన్ సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
    325 Views
  • Saraswathi antya puskharalu
    జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర త్రివేణీ సంగమ క్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం వద్ద, ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు అత్యంత వైభవంగా జరగనున్న “సరస్వతి అంత్య పుష్కరాల” మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించారు.   దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు, ఆలయ అర్చక బృందం, ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి గారిని...
    285 Views
  • రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం, రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు
    రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం మైలారం గ్రామంలో రైతు అవగాహన కార్యక్రమం చేపట్టారు.రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పూర్తి అవగాహన కల్పించడం, వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా సంబంధిత శాఖ అధికారులు పాల్గొని,...
    575 Views
  • బ్లడ్ బ్యాంకుల్లో రక్త కొరత లేకుండా చర్యలుతీసుకోవాలి: భాస్కర్.
    అన్నమయ్య జిల్లాలోని బ్లడ్ బ్యాంకుల్లో రక్తం కొరత ఏర్పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లాల ఎయిడ్స్ నియంత్రణ క్లస్టర్ ప్రోగ్రామ్ అధికారి వేంపల్లి భాస్కర్ సోమవారం సూచించారు. మదనపల్లిలోని ప్రభుత్వ బ్లడ్ బ్యాంకును తనిఖీ చేసి, రక్త నిల్వలు, రికార్డులను పరిశీలించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి నెల కనీసం 24 రక్తదాన శిబిరాలు...
    227 Views
  • ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: అదనపు ఎస్పీ.
    అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' నిర్వహించారు. అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు, వృద్ధులు, వికలాంగులు, మహిళల కేసులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఇద్దరు దివ్యాంగుల ఫిర్యాదులు స్వీకరించి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.
    192 Views
  • డ్రైనేజ్ సమస్య పరిష్కరించాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన.
    మదనపల్లి మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని ఈశ్వరమ్మ కాలనీ, బేకరీ కాలనీలలో గత మూడేళ్లుగా డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో మురుగు నీరు రోడ్లపైకి వస్తోందని కాలనీ వాసులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. డ్రైనేజీ కాలువలు నిర్మించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే...
    208 Views
  • బొలెరో ఢీకొని ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు.
    సోమవారం ములకలచెరువు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురానికి చెందిన భాను ప్రకాశ్ (24), నంద్యాలకు చెందిన ఉదయ్ (24) అనే ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతిలో ఇంజినీరింగ్ చదువుతున్న వీరు, ఆదివారం సెలవు కావడంతో భాను ప్రకాశ్ ఇంటికి వెళ్లి, సోమవారం తిరుగు ప్రయాణంలో వేపూరుకోట వద్ద బైకుపై వస్తుండగా బొలెరో వాహనం ఢీకొట్టింది. స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా,...
    193 Views
  • ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ సహకారంతో కొనుగోలు చేయాలి.
    ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం కొనుగోలు చేసి, ఆర్టీసీ సిబ్బంది ద్వారా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు అన్నమయ్య జిల్లా కలెక్టరుకు సోమవారం వినతిపత్రం సమర్పించారు. పెండింగ్ డీఏలు, ఐఆర్ విడుదల చేయాలని, కొత్త బస్సులు కొనుగోలు చేసి సిబ్బందిని నియమించాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి యూనియన్ పోరాటం కొనసాగుతుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్...
    220 Views
  • బుల్లెట్ 350పై చంద్రబాబు సవారీ... ఫొటోలు ఇవిగో!.
      బుల్లెట్ 350పై చంద్రబాబు సవారీ... ఫొటోలు ఇవిగో! Andhra Chandrababu Naidu Rides Royal Enfield Bullet 350 Photos తిరుపతి జిల్లాలో రూ. 2,500 కోట్లతో రాయల్ ఎన్ ఫీల్డ్ ప్లాంట్ ఏడాదికి 9 లక్షల బైక్‌ల తయారీ సామర్థ్యంతో ఏర్పాటు సుమారు 15,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పన 18 నెలల్లోనే ప్రాజెక్ట్ పూర్తి చేయాలని కంపెనీకి సీఎం సూచన ఏపీ గ్రీన్ ఎనర్జీ వ్యవస్థ ఈవీ ప్రయాణానికి...
    226 Views
  • ఏపీలో 16,000 ఇ-సైకిళ్లు.. ఉద్యమంగా మార్చాలన్న సీఎం చంద్రబాబు.
    ఏపీలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ఉద్యమంగా మార్చే యోచన స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలకు 16,000 ఇ-సైకిళ్లు ఈవీ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సులువైన రుణాల కోసం ప్రత్యేక ఎస్పీవీ ఏర్పాటుకు నిర్ణయం ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామన్న ప్రభుత్వం రాష్ట్రంలో ఇంధన పొదుపును ప్రోత్సహించడంతో పాటు, పర్యావరణ హితమైన రవాణాను ప్రోత్సాహించే దిశగా ఆంధ్రప్రదేశ్...
    235 Views