Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • తెలంగాణ జాతి ఆత్మగౌరవ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గులాబీ దీపిక,
    నాలుగు కోట్ల గొంతులను ఏకం చేసి విప్లవ శంఖం మోగించిన ధిక్కార వేదిక, ‎సమైక్య సంకెళ్లను తెంచి స్వరాష్ట్ర కాంక్షను సాకారం చేసిన యుద్ధ గీతిక, ‎పదేళ్ల పాలనతో ఉద్యమ తెలంగాణను ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దిన అభివృద్ధి పతాక, ‎తెలంగాణ జాతి ఆత్మగౌరవ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గులాబీ దీపిక, ‎ప్రజల విశ్వాసానికి ప్రతీక, ప్రజా ఉద్యమ పతాక.. భారత రాష్ట్ర సమితి 26 వ ఆవిర్భావ దినోత్సవ...
    273 Views
  • జయలలిత లాగా వేషధారణతో తెలంగాణ ప్రజలతో అమ్మ అనిపించుకుందాం అనుకుటుందేమో కానీ ... ఆమె ఎప్పటికీ ఎప్పటికీ శశికళే కానీ జయలలిత కాలేదు
    సంపాదించిన అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డితో కుమ్మక్కు అయి టిఆర్ఎస్ పేరిటే పార్టీ ఏర్పాటు చేస్తే ఎన్నికల్లో కనీసం రెండు మూడు శాతం ఓట్లు చీల్చిన తిరిగి కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది అన్న కుటిల రాజకీయమే ఈమెది తప్ప తెలంగాణ సమాజంపై ప్రేమ లేదు!! ‎జయలలిత లాగా వేషధారణతో తెలంగాణ ప్రజలతో అమ్మ అనిపించుకుందాం అనుకుటుందేమో కానీ ఆమె ఎప్పటికీ ఎప్పటికీ శశికళే కానీ జయలలిత కాలేదు!!...
    309 Views
  • మదనపల్లిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి JC ఉదయాన్నే పర్యటన.
    మదనపల్లె పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించిన జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, ఆదివారం ఉదయం 5 గంటల నుంచే కోమటివాని చెరువు, బహుదా నది, బస్టాండ్, కాలనీలు వంటి ప్రాంతాలను పర్యటించి, శుభ్రత పనులను సమీక్షించారు. పారిశుద్ధ్య కార్మికులకు కాలువల్లోని చెత్తను పూర్తిగా తొలగించి, తీసిన మురుగును వెంటనే తరలించాలని సూచించారు. విధులకు గైర్హాజరయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని...
    259 Views
  • మదనపల్లిలో నూతన టమాటా మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు అధికారుల పరిశీలన.
    అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నూతన టమాటా మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు అధికారులు ఆదివారం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. సుమారు 50 ఎకరాల స్థలం ఎంపికలో భాగంగా రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్న ప్రదేశాన్ని ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ పరిశీలనలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి, మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరామ్, సెక్రటరీ జగదీష్, డైరెక్టర్ లక్ష్మీపతి, మండల సర్వేయర్ చక్రపాణి,...
    287 Views
  • అగ్రహారంలో అంకాళా పరమేశ్వరి విగ్రహ ప్రతిష్ట, జనసేన నేతల భాగస్వామ్యం.
    అన్నమయ్య జిల్లా నిమ్మలపల్లి మండలం అగ్రహారం గ్రామం నాయనవారిపల్లిలో ఆదివారం శ్రీ అంకాళా పరమేశ్వరి దేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మదనపల్లె జనసేన నాయకులు రాంమోహన్, నరేంద్ర, అజయ్, హరి, ఆలయ కమిటీ సభ్యులు తరుణ్, శ్రీనాథ్, ప్రవీణ్ తదితరులు అమ్మవారి పూజ కార్యక్రమంలో...
    214 Views
  • టమోటా మార్కెట్లలో అక్రమాలకు చెక్.. జేసీ ఆదేశాలు.
    అన్నమయ్య జిల్లాలో టమోటా మార్కెట్ యార్డుల్లో అక్రమాలకు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ఆదివారం ఆదేశించారు. మార్కెట్ కమిటీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పారదర్శకతపై దృష్టి పెట్టాలని సూచించారు. 15 కిలోల క్రేట్లను తప్పనిసరిగా అమలు చేయాలని, హమాలీలు, లారీ సంఘాలు రైతుల నుంచి డబ్బు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీసీ కెమెరాలు, డిజిటల్...
    232 Views
  • రాష్ట్ర స్థాయి కోలాటం పోటీలు విజేతలు వీరే
    బొబ్బిలి రాజా కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి కోలాటం పోటీలలో నిర్వహించారు. ఈ పోటీల్లో బొబ్బిలి మండలం పక్కి గ్రామ సభ్యలు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఉత్సాహభరితంగా సాగిన పోటీలలో 2nd అనకాపల్లి జిల్లా నూకాంబిక టీమ్, 3rd బాడంగి మండలం ముగడ, 4th విశాఖ జిల్లా శ్రీఅభయాంజనేయ టీమ్, 5th అనకాపల్లి జిల్లా శ్రీగంగభవానీ టీములు విజేతలగా నిలిచారు. వీరికి MLA బేబినాయన బహుమతులు...
    374 Views
  • ఈతకు వెళ్లిన యువకుడు మృతి... విషాదం
    మదనపల్లె మండలంలో ఆదివారం చీకిలబైలుకు ఈతకు వెళ్లిన యువకుడు సుబ్బిరెడ్డిబావిలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. సహచరులు, స్థానికులు అతడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినా అప్పటికే మరణించినట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    264 Views
  • పండగలో అల్లర్లు, గొడవలు చేస్తే కఠిన చర్యలు
    పండగలో గొడవలు, అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ కె.నారాయణరావు అన్నారు. బొబ్బిలి పట్టణంలోని రావువారివీధిలో ఆదివారం సమావేశం నిర్వహించారు. దాడితల్లి గ్రామదేవత పండుగలో అల్లర్లు, గొడవలు చేయకుండా ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. సిరిమానోత్సవం విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు. అల్లర్లు, గొడవలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు...
    341 Views
  • జర్నలిస్టుల సమస్యలపై ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ ఎన్నికల ఏకగ్రీవం.
    అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఆదివారం ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ జిల్లా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, ఇంటి స్థలాలు, పింఛను, వైద్య సౌకర్యాలు, రైల్వే పాస్‌లు, పిల్లలకు ఉచిత విద్య కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టులపై దాడుల నివారణకు ప్రత్యేక చట్టాలు, అక్రిడిటేషన్‌లో పారదర్శకత అవసరమని తెలిపారు....
    218 Views