నగరంలోని ఎల్లమ్మగుట్ట పద్మశాలి సంఘం ( తర్ప నం 32 ) నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొనడం జరిగింది. నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. భవిష్యత్తులో సంఘానికి తనవంతు సహకారం ఉంటుందని తెలపడం జరిగింది.
సింగరేణి ఉద్యోగుల పిల్లల కోసం వేసవి శిక్షణ శిబిరాలకు యాజమాన్యం నిధులు కేటాయించింది అన్ని ఏరియాల్లో 25 రోజులపాటు క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనుంది.18 సంవత్సరాల లోపు వయస్సున్న పిల్లలకు అవకాశం కల్పించింది ఈ నెల 27 నుంచి క్రీడా శిబిరాలను ఏరియా ల వారీగా ప్రారంభించనుంది.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం బోయకొండలో బుధవారం జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లి ఆదేశాల మేరకు మదనపల్లి శక్తి టీం ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై చిన్నరెడ్డప్ప మాట్లాడుతూ, చిన్న చిన్న విషయాలకు గొడవలు పడకుండా సహనంతో వ్యవహరించాలని సూచించారు. ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, సెల్ ఫోన్ల ద్వారా జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మహిళలు, పిల్లల భద్రత...
విజయ కుమారి, శివ రత్నమ్మ గురువారం కలమందలవారిపల్లి ఎంపీపీ పాఠశాలలో వార్షికోత్సవానికి హాజరయ్యారు. ప్రతి విద్యార్థి కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని వారు సూచించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు దీటుగా చదువుతున్నారని ఉపాధ్యాయ యూనియన్ నాయకులు తల్లిదండ్రులకు వివరించారు. కార్యక్రమంలో హెచ్ఎం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
తిరుపతిలో ఈనెల 26 నుంచి 28 వరకు జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పుంగనూరు సివిల్ సప్లై కేంద్రం వద్ద నాయకులు వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఈ మహాసభలు జరుగుతాయని, కార్మికులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు# కొత్తూరు మురళి.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి ట్రాఫిక్ జోన్-1 పరిధిలో రాంగ్ సైడ్ డ్రైవింగ్, ప్రమాదకరమైన డ్రైవింగ్ మరియు అనధికార సైరన్ల వినియోగాన్ని అరికట్టడానికి పోలీసులు ఈరోజు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో భాగంగా మొత్తం 1786 రాంగ్ సైడ్ కేసులు, 4 అనధికార సైరన్ వినియోగం కేసులు నమోదు చేసి, వాహనదారులకు రూ. 22,01,800 జరిమానా విధించారు.
ముఖ్యంగా ప్రధాన కూడళ్లు మరియు ప్రమాదకర ప్రాంతాల్లో...