కీ,, శే శ్రీ కొక్కిరాల రఘుపతి రావు గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా..
మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో..
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బస్టాండ్, బెల్లంపల్లి చౌరస్తా, మార్కెట్, ఐబీ చౌరస్తా, హమాలివాడ, ఓవర్ బ్రిడ్జి , ఫ్లడ్ కాలనీ, సిసిసి కార్నర్, శ్రీరాంపూర్ కాలనీ ఏరియాల్లో చలివేంద్రాల కేంద్రాలను...
ఈరోజు నిజామాబాద్ నగరంలోని శ్రీరామ గార్డెన్ లో పోలీస్ శాఖ వారు నిర్వహించిన "అర్రివె అలివెఅతిధిగా వచ్చిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య IPS గారి ఆధ్వర్యంలో 45వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బిలి వేణు గారు పాల్గొనడం జరిగింది .
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలం, బండ కింద పల్లి గ్రామంలో శనివారం సుమారు కోటి రూపాయల విలువైన 48 సెంట్ల ఆక్రమణ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వెళ్లిన అధికారులపై రైతు రవి కుమార్ రెడ్డి దుర్భాషలాడాడని, ఈ నేపథ్యంలో అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని రెవెన్యూ అధికారులు సిఫార్సు చేశారు# కొత్తూరు మురళి
శనివారం పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం లోని కందూరు నిమ్మనపల్లి మార్గంలో సమాదిగుట్టపల్లె సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద ఉప్పరపల్లికి చెందిన రిహాన్ అనే యువకుడు బైక్ పై తిరిగి వస్తుండగా, బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి# కొత్తూరు మురళి.
ప్రజలు అప్రమత్తంగా ఉంటే అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని ఇన్చార్జి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సురేష్ బాబు తెలిపారు. పుంగనూరు అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా శనివారం గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం, డెలివరీ బాయ్స్, పెట్రోల్ బంక్ యాజమాన్యానికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
చిత్తూరు జిల్లా, రొంపిచర్ల క్రాస్ వద్ద శనివారం అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న రెండు లారీలను ఎస్సై మధుసూదన్ పట్టుకున్నారు. పుంగనూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హరి కిశోర్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ రెండు లారీలకు రూ. 1.82 లక్షల జరిమానా విధించారు. కలకడ నుంచి వస్తున్న ఈ లారీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు# కొత్తూరు మురళి.
చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలంలో ఆదివారం ఒంటరి ఏనుగు సంచారం స్థానికంగా కలకలం సృష్టించింది. పాతపాలెం అడవి మార్గంలో పాతపేట వద్దకు చేరుకున్న ఏనుగు, రైతులు సాగు చేస్తున్న మామిడి చెట్ల కొమ్మలను విరచివేసి, కొబ్బరి చెట్లను పీకివేసి నష్టం కలిగించింది. అనంతరం ఏనుగు అడవుల్లోకి వెళ్లి దాక్కుందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో రైతులు ఆందోళన చెందుతున్నారు# కొత్తూరు మురళి.
పుంగనూరు మండలం, ఈడీగపల్లె చెక్ పోస్ట్ వద్ద ఆదివారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తికి ఫిట్స్ రావడంతో సృహతప్పి రోడ్డుపై పడ్డాడు. దీనితో అతడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు అతడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలం కొత్తపేట వద్ద ఆదివారం కుక్కల దాడిలో ఒక జింక మృతి చెందింది. స్థానికులు కొత్తపేట-మంగళపేట మార్గమధ్యంలోని సబ్ స్టేషన్ సమీపంలో జింక మృతదేహాన్ని గుర్తించి, వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు# కొత్తూరు మురళి.