Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పుంగనూరు: కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఏపీ మోడల్ స్కూల్ కొత్తూరు మురళి
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, అడవినాథ కుంటలోని ఏపీ మోడల్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం సిఈసి విద్యార్థిని క్యాతిప్రియ, 500 మార్కులకు 491 సాధించి మండలం టాపర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రమా ఆధ్వర్యంలో గురువారం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కేక్ కట్ చేసి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఎంఈఓ నటరాజన్ రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
    235 Views
  • పుంగునూరు నియోజకవర్గ అధ్యక్షులుగా వరద రెడ్డి
    పుంగనూరు నియోజకవర్గ వైయస్సార్సీపి ఉద్యోగుల మరియు పెన్షనర్ల విభాగం అధ్యక్షుడిగా వరద రెడ్డి నియమితులయ్యారు. గురువారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందినట్లు ఆయన తెలిపారు. తనపై నమ్మకంతో ఈ పదవిని అప్పగించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లి ఉద్యోగ, పెన్షనర్లకు న్యాయం...
    215 Views
  • పుంగనూరు: అనుమానాస్పద వ్యక్తులు ఉంటే సమాచారం ఇవ్వండి: ఎస్సై
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం బయలు గాని పల్లి గ్రామంలో గురువారం సాయంత్రం గ్రామ ప్రజలకు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై పోలీస్ అధికారులు అవగాహన కల్పించారు. ఎస్సైలు ఆన్సర్ బాష, కె. వి రమణ మాట్లాడుతూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, అనుమానస్పద వ్యక్తుల సమాచారం పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
    240 Views
  • డీజీపీ శివధర్ రెడ్డికి లేఖ రాసిన ‎మంత్రి పొన్నం ప్రభాకర్!
    పార్లమెంట్ లో తెలంగాణ విభజన పై భారత్ పాకిస్థాన్ తో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్న మంత్రి పొన్నం ప్రభాకర్.తెలంగాణ ఏర్పాటు అనేది ఇక్కడి ప్రజల న్యాయమైన ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ, ఒక ప్రజాస్వామ్య,రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ ఫలితంగా జరిగింది.దీనిని భారతదేశపు బాధాకరమైన, హింసాత్మక విభజనతో పోల్చడం ఆ ప్రక్రియ యొక్క పవిత్రతను తగ్గించడమే...
    241 Views
  • ప్లాన్ బితో మంగ్లీకి షాకిచ్చిన అడ్వకేట్ సుబ్బారావు.. ముదురుతున్న చీటింగ్ కేసు వివాదం!
    ప్రముఖ గాయని మంగ్లీ చుట్టూ మైక్రో ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్ మోసం ఆరోపణలు ముదురుతున్నాయి. అడ్వకేట్ సుబ్బారావు బాధితుల తరపున పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ. 10 కోట్లకు పైగా మోసం జరిగిందని, ఇందులో మంగ్లీ తన సెలబ్రిటీ హోదాను అడ్డం పెట్టుకుని ప్రజలను నమ్మించారని ఆయన ఆరోపించారు. మంగ్లీ ఈ ఆరోపణలను కొట్టిపారేస్తూ, ఇది తనను బ్లాక్‌మెయిల్ చేసే...
    309 Views
  • ఏప్రిల్ 25-26న అన్నమయ్య జిల్లా జర్నలిస్టుల ఎన్నికలు.
    మదనపల్లెలో ఏప్రిల్ 25, 26 తేదీల్లో ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ (ఎలక్ట్రానిక్ మీడియా) అన్నమయ్య జిల్లా కార్యవర్గ ఎన్నికలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏప్రిల్ 16 నుంచి 23 వరకు సభ్యత్వ నమోదు, 24న ఓటర్ల జాబితా విడుదల ఉంటుంది. 25న నామినేషన్లు, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలు పూర్తి చేసి సాయంత్రం తుది జాబితా విడుదల చేస్తారు. 26న పోలింగ్, అనంతరం ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తారు....
    298 Views
  • ప్రజల భద్రత కోసం పోలీసుల ముమ్మర అవగాహన కార్యక్రమాలు.
    అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ప్రజల భద్రతను లక్ష్యంగా పోలీసులు విస్తృత చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు గురువారం గ్రామాల్లో పర్యటించి సైబర్ నేరాలు, రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఓటీపీ మోసాలు, ఆన్లైన్ ఫ్రాడ్స్ నుంచి జాగ్రత్తలు వివరించారు. మహిళలు, చిన్నారుల రక్షణకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. వాహన తనిఖీలు నిర్వహించి ఉల్లంఘనలపై...
    251 Views
  • నిమ్మనపల్లె పీహెచ్సీ తనిఖీ: ప్రసవాల సంఖ్య పెంచాలని DMHO ఆదేశం.
    అన్నమయ్య జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్య గురువారం నిమ్మనపల్లె పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాన్పుల గది, ల్యాబ్, మందుల నిల్వలు, రోగుల పడకలు, పరిశుభ్రతను పరిశీలించారు. మండలంలోని గర్భిణీలకు స్థానికంగానే ప్రసవాలు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వేసవి వ్యాధులు, వడదెబ్బపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
    266 Views
  • ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన మహనీయుడు, విద్యారంగ అభివృద్ధికి విశేష కృషి చేసిన విద్యావేత్త రెండో రాష్ట్రపతి, భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు 🙏🏻
    166 Views
  • కుందేరు ఆక్రమణలపై ఆరోపణలు… వెంచర్ల పేరుతో భూ దందా?
    వేటపాలెం బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ పరిధిలోని కేబి పార్క్‌ను ఆదారంగా చేసుకుని కుందేరు ప్రాంతంలో భూ అక్రమాలు జరుగుతున్నాయంటూ స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారం ప్రకారం, గతంలో కొంతమంది వ్యక్తులు కుందేరు ప్రవాహాన్ని పూడ్చి కేబి పార్క్ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఇదే అవకాశంగా తీసుకుని ప్రస్తుతం కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుందేరు...
    348 Views