Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • సమగ్ర శిక్షా కార్యాలయంలో ఉద్యోగాల భర్తీ
    విజయనగరం సమగ్ర శిక్షా కార్యాలయంలో ఖాళీగా ఉన్న 8 సెక్టోరల్, అసిస్టెంట్ సెక్టోరల్ DEO&APC మాణిక్యం నాయుడు తెలిపారు. పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఉపాధ్యాయులు దీనికి అర్హులన్నారు. ఏప్రిల్ 22 సా.5 గంటల లోపు జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. #BOIENA RAJESH 
    293 Views
  • #suryapet news
     సూర్యాపేట జిల్లాలోని ఒక చిన్నా గ్రామం లోని సర్పంచి అదేవిధంగా ఉప సర్పంచ్ గారు తీసుకున్న నిర్ణయం విలేజ్ లో గ్రామ ప్రజలు కానీ బయట వ్యక్తులు కానీ హెల్మెట్ తప్పనిసరిగా తలకు ధరించాలని తలకు ధరించకుండా విలేజ్ లోపలకి వచ్చేదే లేదని తెలియజేశారు. గ్రామవాసులు కూడా దీనికి అంగీకరించారు ఇది ఎక్కడో కాదండి తుంగతుర్తి నియోజకవర్గంలోని కుంచమర్తి అనే గ్రామం లో ఈ నిర్ణయం. ఒక ఫ్యామిలీలోనీ పెద్ద పోతే ఆ ఫ్యామిలీ...
    923 Views
  • "పోలీసుల రైడ్‌తో కుదేలైన నకిలీ సర్టిఫికెట్ల ముఠా – అల్వాల్‌లో బిగ్ బస్ట్.!
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అనుమతి లేకుండా నకిలీ అఫిడవిట్లు, ముందుగానే సంతకాలు చేసిన ధ్రువీకరణ పత్రాలను విక్రయిస్తున్న ముఠాను అల్వాల్ పోలీసులు బట్టబయలు చేశారు. ఆల్వాల్ ఎస్హెచ్ఓ ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం... నమ్మదగిన సమాచారం మేరకు, ఈనెల 15న సాయంత్రం అల్వాల్ సబ్ ఇన్‌స్పెక్టర్ కె. చంద్రశేఖర్ తన బృందంతో కలిసి తెలుగు తల్లి విగ్రహం సమీపంలోని ‘శ్రీదేవి జిరాక్స్ & నోటరీ’...
    449 Views
  • పుంగునూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో పర్యటించిన కలెక్టర్
    బుధవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలాన్ని పర్యటించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం, దిగుపల్లె, కాగతి, ఏ కొత్తకోట గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన చెరువులు, వాటికి సంబంధించిన సప్లై ఛానల్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జలధార కార్యక్రమం అమలు తీరుపై డిప్యూటీ ఎంపీడీవోను ఆరా తీశారు. ఈ పర్యటనలో పలువురు అధికారులు పాల్గొన్నారు#...
    214 Views
  • పుంగనూరులో అగ్నిమాపక వారోత్సవాలు
    పుంగనూరులో బుధవారం నాడు అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అగ్నిప్రమాదాల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి వారం రోజుల పాటు పట్టణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు స్థానిక ఫైర్ స్టేషన్ అధికారి సుబ్రమణ్యం తెలిపారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ సిబ్బంది మార్కెట్ యార్డ్ నుంచి ముడెప్ప సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్ దగ్గర వాటర్ డ్రిల్...
    240 Views
  • సత్తా చాటిన చౌడేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు
    పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 70% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపల్ జయప్రకాష్ బుధవారం తెలిపారు. సెకండ్ ఇయర్‌లో తోటి లహరి (హాల్ టికెట్ నెం. 2620224598) సీఈసీ గ్రూప్‌లో 1000కి 945 మార్కులతో కళాశాల టాపర్‌గా నిలిచింది. ఫస్ట్ ఇయర్‌లో హరి (హాల్ టికెట్ నెం. 2620125456) హెచ్‌ఈసీ గ్రూప్‌లో 500కి 429 మార్కులతో టాపర్‌గా...
    265 Views
  • ఆరోగ్య రంగ అభివృద్ధిపై కీలక చర్చలు

    ఏపీ హెల్త్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డా. రంగారెడ్డి – IIHFW గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌ డా. కవితా రెడ్డి చర్చలు

    హైదరాబాద్ :
    IFCAI డైరెక్టర్ మరియు ఆంధ్రప్రదేశ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డా. రంగారెడ్డి ఈ రోజు హైదరాబాద్‌లోని IIHFW కార్యాలయంలో IIHFW గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌ డా. కవితా రెడ్డి గారిని కలిశారు.

    ఈ సందర్భంగా వైద్య మరియు ఆరోగ్య రంగ అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా సంస్థలో శిక్షణ కార్యక్రమాల అప్‌గ్రేడేషన్, పాలసీ రూపకల్పన, పరిశోధన కార్యక్రమాల విస్తరణపై ఇద్దరూ అభిప్రాయాలు పంచుకున్నారు.

    అలాగే తల్లి-శిశు ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

    ఈ సందర్భంగా చర్చించిన పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణ గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ గారి దృష్టికి తీసుకువెళ్తానని IIHFW గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌ డా. కవితా రెడ్డి గారు తెలిపారు.

    ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా కీలక ముందడుగు పడినట్లు భావిస్తున్నారు.
    356 Views
  • పుంగనూరు: ఘాట్ రోడ్లో పల్టీలు కొట్టిన కారు
    పులిచెర్ల మండలంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొద్దుటూరు పట్టణానికి చెందిన సరస్వతమ్మ, ఆమె మనవడు సైమన్ వేలూరు ఆసుపత్రికి కారులో వెళుతుండగా, కల్లూరు ఘాట్ రోడ్డులోని ఓ మలుపులో కారు అల్యూమినియం స్టాపర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురిని స్థానికులు పీలేరు ఆసుపత్రికి తరలించగా, వైద్యులు సరస్వతమ్మ మృతి చెందినట్లు తెలిపారు# కొత్తూరు మురళి.
    249 Views
  • 79 మంది మీడియా ప్రతినిధులకు అక్రిడేషన్లు మంజూరు
    బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్, డిఎంఎసి చైర్మన్ సుమిత్ కుమార్ ఐఏఎస్ అధ్యక్షతన జిల్లా మీడియా అక్రిడిటేషన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 56 ప్రింట్, 19 ఎలక్ట్రానిక్, 4 మాస పత్రికలకు చెందిన మొత్తం 79 మంది మీడియా ప్రతినిధులకు మూడవ విడతలో అక్రిడిటేషన్లు మంజూరు చేయడానికి కమిటీ ఆమోదం తెలిపింది. సుమిత్ కుమార్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు#.  
    240 Views